Monday, October 9, 2017 - 18:22

నిర్మల్ : జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉద్రిక్తత నెలకొంది. మినుములు కొనుగోలు చేయడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ యార్డు అధికారులపై తిరగపడ్డారు. మార్కెట్ ప్రధాన ద్వారం వద్ద వారు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Sunday, October 8, 2017 - 16:08

నిర్మల్ : జిల్లా ఖానాపూర్ మార్కెట్లోని సుజాత జ్యువెల్లరీ షాపులో భారీ చోరీ జరిగింది. దొంగలు షెట్టర్ తాళాలు పగలగొట్టి షాపులో ఉన్న బంగారం ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Sunday, September 10, 2017 - 17:51

ఆదిలాబాద్/నిర్మల్ : రైతుల వికాసం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారన్నారు వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి. ఈ మేరకు నిర్మల్‌ జిల్లా, బైంసా డివిజన్‌లోని కుబీర్‌ మండల కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిన రైతు సమన్వయ కమిటీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతును తలెత్తుకొని తరిగేవిధంగా చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని దాన్ని...

Friday, September 8, 2017 - 12:24

నిర్మల్‌ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వస్తోంది. బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. మార్గంమధ్యలో నిర్మల్ జిల్లాలోని గంగాపూర్ దగ్గర ఓ బైకిస్టు ఎదురుగా వచ్చి బస్సును ఢీకొట్టి.. దాని కిందకు దూసుకెళ్లాడు. అతను మృతి చెందాడు. బైక్ ను తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సును రోడ్డు కిందికి నడిపాడు. ఈ నేపథ్యంలో బస్సు...

Thursday, September 7, 2017 - 16:46

నిర్మల్ : జిల్లా కడెం మండలం పెర్కపల్లికి చెందిన సత్తవ్వ అనే మహిళా రైతు కరెంట్ షాక్‌తో చనిపోయింది. కలుపు తీసేందుకు పొలానికి వెళ్లిన సత్తవ్వకు ఫెన్సింగ్‌కి అమర్చిన కరెంట్లు వైర్లు తగిలి షాక్ తగలడంతో అక్కడికక్కడే మరణించింది. అడవి పందుల నుంచి పంటను రక్షించుకోవడం కోసం ఎటువంటి అనుమతులు లేకుండా నరేష్ అనే వ్యక్తి ఫెన్సింగ్‌కు విద్యుత్ వైర్లు అమర్చినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న నరేష్...

Monday, September 4, 2017 - 10:06

నిర్మల్‌ : జిల్లాలోని ఖానాపూర్‌ మండలంలో దారుణం జరిగింది. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కుంచపు గంగాధర్‌, దుండగుల ధర్మపురి, దరంగుల చిన్నప్పలు కలిసి ఇంట్లో నుండి బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశారని బాధితురాలు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ...

Sunday, September 3, 2017 - 17:23

ఆదిలాబాద్/నిర్మల్ : జిల్లా ఖానాపూర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు వివాహితపై అత్యాచారానికి పాల్పపడ్డారు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో వివాహితను ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. ప్రకారం కుంచపు గంగాధర్, ధర్మపురి చిన్నప్ప ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Saturday, September 2, 2017 - 11:14

నిర్మల్‌ : బైంసాలో భారీ భద్రత ఏర్పాటు చేశారు... గణేశ్ నిమజ్జనం, బక్రీద్‌ పండుగలు ఒకేసారి రావడంతో 400మంది పోలీసుల్ని మోహరించారు... 60 సీసీ కెమెరాలద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.. వరంగల్‌ రేంజ్‌ ఐజీ నాగిరెడ్డి, డీఐజీ రవి వర్మ భద్రతను పర్యవేక్షిస్తున్నారు.. రెండు మతాల పెద్దలతో సమీక్ష నిర్వహించిన అధికారులు... ప్రశాంతంగా కార్యక్రమం పూర్తయ్యేందుకు సహకరించాలని...

Tuesday, August 29, 2017 - 11:37

నిర్మల్ జిల్లా : కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారిపోయింది. భారీగా వరదనీరు పోటెత్తుతోంది. మహారాష్ట్ర..ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో కడెం ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులుగా ఉండగా ప్రస్తుతం 698 అడుగులకు చేరుకుంది. ముందస్తుగా గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు వదిలారు. ఇన్ ఫ్లో 12.31 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 13.41...

Pages

Don't Miss