Friday, May 18, 2018 - 08:01

రాజన్నసిరిసిల్ల : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ తన ఇంటి స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని వేములవాడకు చెందిన బొల్లినేని వేంకటేశ్వర్‌రావు మున్సిపల్‌ కార్యలయంలో ధర్నాకు దిగారు.  తన భూమి ఎల్‌ఆర్ఎస్‌ ప్రొసిడింగ్‌ పత్రాలను ఇవ్వకుండా ఎమ్మెల్యే మున్సిపల్‌ అధికారులపై ఒత్తిడి తెస్తున్నాడని ఆరోపించారు. కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇంటి స్థలాన్నికొనుగోలు చేస్తే...

Thursday, May 17, 2018 - 14:51

రాజన్న సిరిసిల్ల : డెబ్భై ఏళ్లలో రైతుల కోసం ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు మంత్రి కేటీఆర్‌. ఎన్నికల కోసమే రైతు బంధు అన్న విపక్షాల విమర్శలను తిప్పి కొట్టారు. రైతుబంధు పథకంతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుంటే కాంగ్రెస్‌ నేతల కళ్లల్లో భయం కనిపిస్తుందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం ముందుకు వెళదామన్నారు కేటీఆర్‌. ఈ సందర్భంగా రాజన్న...

Monday, May 14, 2018 - 08:11

రాజన్న సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్రంలో దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు అత్యాచారాలు జరుగుతుంటే మరోవైపు దారుణ హత్యలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ సర్పంచ్ ను వెంటాడి..వేటాడి నరికిచంపేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో చోటు చేసుకుంది. చందుర్తి మండలం మూడపల్లి సర్పంచ్ గోలి శంకర్ నూకలమర్రిలో జరుగుతున్న కబడ్డీ పోటీలను తిలకించి రాత్రి వెళుతున్నారు. కాపుగాచిన...

Monday, May 14, 2018 - 06:24

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం మహోద్యమంగా కొనసాగుతోంది. గ్రామ గ్రామాన లబ్ధిదారులైన రైతులకు పెట్టుబడి సాయం కింద చెక్కులు అందజేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అన్నదాతలకు చెక్‌లతోపాటు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగిన రైతుబంధు చెక్కుల...

Sunday, May 13, 2018 - 15:47

రాజన్నసిరిసిల్ల : గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల కోసం అద్భుతమైన పథకాన్ని ప్రారంభించిందన్నారు మంత్రి కేటీఆర్‌. ఒక రైతు ముఖ్యమంత్రి కావడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులను కాపాడేందుకే ఈ రైతు బంధు కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలంలో రైతు బంధు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌...

Wednesday, April 25, 2018 - 19:34

రాజన్నసిరిసిల్ల : జిల్లాలోని నేరెళ్ల బాధితులకు న్యాయం చేయడంతో మంత్రి కేటీఆర్‌ విఫలమయ్యారని కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ విమర్శించారు. ఇసుక మాఫియా, పోలీసులు ఆగడాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న నేరెళ్ల బాధితులను వీహెచ్‌ పరామర్శించారు. మంత్రి కేటీఆర్‌.. బలహీనవర్గాలను అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. 

 

Saturday, April 14, 2018 - 07:03

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...

Saturday, April 14, 2018 - 06:59

హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్‌ ఓ సజీవ సాక్ష్యం.

ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల...

Saturday, April 14, 2018 - 06:56

హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్‌ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి...

Sunday, April 8, 2018 - 21:14

హైదరాబాద్ : తెలంగాణలో అకాల వర్షాలకు అపార నష్టం వాటిల్లుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలతో పాటు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. వడగండ్ల వానకు వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. పలు...

Pages

Don't Miss