Monday, May 8, 2017 - 06:47

రాజన్న సిరిసిల్ల : జిల్లా కేంద్రంలోని.. బి. వై నగర్‌కు చెందిన శాప మధు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక నేతన్న ఉరి వేసుకొని.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. మధుకు తల్లి, భార్య, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. చెల్లెల్ల పెళ్లికి చేసిన అప్పులు.. ఆదాయం వచ్చే మార్గం లేక మధు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. పైగా అప్పులు ఇచ్చినవాళ్లు డబ్బులు చెల్లించమని ఒత్తిడి...

Sunday, May 7, 2017 - 15:01

సిరిసిల్ల : ఓ కూతురు పోలీస్‌ అమ్మకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. దత్తత తీసుకున్న సీఐకి మరచిపోలేని బహుమతి ఇచ్చింది.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనకరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికిచెందిన భార్గవి, విష్ణులకు ముగ్గురు కూతుళ్లు.. అనారోగ్యంతో తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు.. వీరిని వేములవాడ సీఐ మాధవి దత్తత తీసుకున్నారు.. పెద్ద కూతురు భవానీని కస్తూరిబా పాఠశాలలో చదివించారు.. పదో తరగతిలో...

Sunday, May 7, 2017 - 14:55

సిరిసిల్ల : అకాలంలో కురిసిన వర్షాలకు చేతికి వచ్చిన పంట తడిసి ముద్దయ్యింది. జిల్లాలోని వేములవాడ మార్కెట్ యార్డ్‌లో నిలువ చేసిన వరిధాన్యం.. వర్షం కారణంగా తడిసిపోయింది. ధాన్యం తడిచి నష్టం వాటిల్లడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. చేతికి వచ్చిన పంట మార్కెట్‌ యార్డు అధికారుల నిర్లక్ష్యం కారణంగా.. తడిచి కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

 

Wednesday, May 3, 2017 - 10:43

రాజన్న సిరిసిల్లా : జిల్లా కేంద్రములోని సుందరయ్య నగర్‌లో.. పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు చేశారు. వేములవాడ డిఎస్‌పి, సిరిసిల్ల ఇంచార్జ్‌ డిఎస్‌పి చంద్రశేఖర్‌.. నలుగురు సీఐలు, 12 మంది ఎస్‌ఐలు, సుమారు నూట ఇరవై మంది కానిస్టేబుల్స్‌ ఈ కార్డన్‌ సెర్చ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుందరయ్య నగర్‌లోని ప్రతీ ఇంటిని...

Saturday, April 29, 2017 - 12:36

రాజన్న సిరిసిల్ల : 60 ఏళ్ల చరిత్ర ఉన్నా...గుడిలింగాపూర్‌ గ్రామం .. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం లేదు. మొన్నటి వరకు నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న మానాల గ్రామం కింద ఉండే ఈ గుడిలింగాపూర్‌ తండా... బైఫరకేషన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పడింది. అందమైన కొండలు.. దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో ఈ గ్రామం ఉంటుంది. శివుని ఆలయం ఉండడంతో ఈ ప్రాంతానికి గుడిలింగాపూర్‌గా నామకరణం చేశారు. 1957లో సుకంద...

Tuesday, April 25, 2017 - 16:34

సిరిసిల్ల : తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. గంభీరావుపేట మండలం ముస్తాఫానగర్‌ బట్టల చెరువు భూ నిర్వాసితులను కలుసుకున్నారు. చెరువు ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న అవకతవకలను తెలుసుకున్నారు. 70, 80 సంవత్సరాల నుంచి ఈ భూమిని నమ్ముకుని జీవిస్తున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా కోదండరామ్‌...

Saturday, April 15, 2017 - 20:39

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడలో ఎండ వేడి తట్టుకోలేక 6 కోడెలు మృత్యువాతపడ్డాయి. దేవస్థానంలోని గోశాలలో ఈ గోవుల్ని పట్టించుకునేవారే కరువయ్యారు. మార్చి 31న పచ్చగడ్డి టెండర్‌ ముగిసింది. మళ్లీ టెండర్‌ నిర్వహించినా సరైన ధర రాక టెండర్‌ రద్దు చేశారు. దీంతో కోడెలకు పచ్చగడ్డివేసేవారే కరువయ్యారు. 

 

Thursday, April 13, 2017 - 17:58

రాజన్నసిరిసిల్లా : జిల్లాలోని వస్త్ర పరిశ్రమను అగ్రభాగాన నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని చేనేత జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తంగళ్లపల్లి మండలం సారంపెల్లి టెక్స్‌టైల్‌ పార్క్‌లో జూకీ కుట్టు మీషన్ల కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే నూతనంగా ఏర్పడ్డ టెక్స్ టైల్ పార్క్ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. సిరిసిల్లా పట్టణంలో ప్రెస్‌క్లబ్‌ భవనానికి...

Wednesday, April 12, 2017 - 06:55

కరీంనగర్ : సిరిసిల్లలోని సంజీవయ్యనగర్‌లో ఓ ఇంట్లోని ప్రిజ్‌లో పాము దర్శనమిచ్చింది. రాజు అనే వ్యక్తి ఇంట్లో ప్రిజ్‌లో పాము దూరింది. గమనించిన కుటుంబ సభ్యలు పాములు పట్టే వారిని పిలిపించి పామును పట్టి బయట వదిలిపెట్టారు.

Saturday, April 8, 2017 - 18:32

సిరిసిల్ల : మిషన్ భగీరథలో భాగంగా ఈ సంవత్సరం చివరికల్లా సిరిసిల్ల జిల్లాలోని ప్రతి గ్రామానికి తాగునీటిని అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సిరిసిల్ల పట్టణాన్ని 200 సీసీ కెమెరాలతో సేఫ్‌ జోన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. దీంతో పాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు పట్టణంలో రోడ్ల విస్తరణ పూర్తి...

Pages

Don't Miss