Wednesday, September 13, 2017 - 19:26

రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్లలో టీమాస్‌ ఫోరం ఆవిర్భావ సభలో తెలంగాణ ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నియంతృత్వం వైపు పోతుందా లేక ప్రజాస్వామ్యం వైపు పోతుందా తెలియడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిలదీసేందుకే టీమాస్‌ ఫోరం ఆవిర్భవించిందని..ఈ పేరు వింటేనే పాలకులకు వణుకుపుడుతోందన్నారు.

 

Wednesday, September 13, 2017 - 07:19

కరీంనగర్ : తెలంగాణ ఉద్యమానికి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉత్తర తెలంగాణ మొదటి నుంచి అండగా నిలిచింది. ఇందులోనూ కరీంనగర్‌జిల్లా అయితే టీఆర్‌ఎస్‌కు పెట్టని కోట. ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్‌ కూడా ఇదే జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కరీంనగర్‌ కేంద్రంగా ఇటీవల జరిగిన పరిణామాలు ప్రభుత్వ పాలనకు మాయని మచ్చలా మిగిలాయి. నేరెళ్లలో దళితులపై పోలీసుల దాష్టీకం మొదలుకొని నిన్నటి...

Monday, September 11, 2017 - 19:09

సిరిసిల్ల : ఇల్లంతకుంటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడు కిందకు దూకుతానంటూ హల్‌చల్‌ చేశాడు. గాలిపల్లి గ్రామానికి చెందిన దళిత కళాకారుడు రవి ప్రభుత్వ తీరుకు ఇలా నిరసనకు దిగాడు. బతుకుదెరువు కోసం ఉద్యోగం లేదా, కొంత భూమి అయినా ఇవ్వాలని ప్రభుత్వానికి పలుమార్లు అర్జీలు పెట్టుకున్నాడు. కాని.. అధికారులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఆత్మహత్య...

Monday, September 11, 2017 - 17:13

హైదరాబాద్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా కోర్టు నిలిపివేసింది. పౌరసత్వం రద్దుపై పునఃసమీక్షించాలని కేంద్రహోంశాఖను రమేశ్‌ కోరారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Monday, September 11, 2017 - 13:42

సిరిసిల్ల : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు కోర్టు విచారణ చేపట్టింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Wednesday, September 6, 2017 - 09:35

సామాజిక తెలంగాణ అన్న నినాదానికి తుప్పు పట్టింది. దళితులపై పైశాచికత్వం పెచ్చుమీరింది. అగ్రకులాలు గీసిన గీత దాటినా.. కుల కట్టుబాటులు చెరిపేసినా ఇక మరణదండనే. ఇదేంటని ప్రశ్నిస్తే కేసులు..జైళ్లు...! భయభ్రాంతులను చేసేలా బేడీలతో లాక్కెళ్లడాలు..! కరీంనగర్‌ జిల్లాలో దళితులపై జరుగుతున్న వరుస దాడులు నేటి తెలంగాణాలో వివక్ష తీవ్రతకు అద్దం పడుతున్నాయి. సామాజిక తెలంగాణ అన్న నినాదానికి తుప్పు పట్టింది....

Tuesday, September 5, 2017 - 19:29

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కు జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. రమేష్ బాబు భారతీయ పౌరసత్వం చెల్లదని కేంద్ర తెల్చిచెప్పింది. గతంలో ఆయన జర్మనీలో ప్రొపెసర్ గా పనిచేశాడు. ఆయన 2009టీడీపీ నుంచి,2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెపొందారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

 

Monday, September 4, 2017 - 10:16

సిరిసిల్ల : సిరిసిల్ల వాసులు మట్టి వినాయకుడే శ్రేష్టమంటున్నారు. పర్యావరణానికి చేటుచేసే ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలు మాకొద్దంటున్నారు. ఇంతింతై వటువింతై అన్న చందంగా..ఏటీకేడు నగరంలో మట్టివినాయకుల సంఖ్య పెరగడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. విజ్ఞాలు తీర్చే గణపయ్యను..తమ సమస్యలు తీర్చాలంటూ వినూత్నంగా కొలుస్తున్నారు.     

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వినాయక...

Saturday, September 2, 2017 - 13:15

రాజన్న సిరిసిల్ల : కొనరావుపేట మండలం నాగారంలో మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌ రావు పర్యటిస్తున్నారు.. హెలికాప్టర్‌ ద్వారా నాగారం చేరుకున్న గవర్నర్‌కు మంత్రులు ఈటెల రాజేందర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్‌ బాబు స్వాగతం పలికారు.. జీఎంఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుద్యోగులకు వృత్తివిద్య శిక్షణ...

Tuesday, August 29, 2017 - 15:19

సిరిసిల్ల : పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలు కొంతమంది దండుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు వివాహ రిజిస్ట్రేషన్‌ పత్రం తప్పనిసరి కావడంతో రిజిస్ట్రేషన్‌ సిబ్బంది అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. అసలు ఫీజు కంటే అధిక మొత్తం వసూలు చేస్తూ దండుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే... పత్రాలు సరిగాలేవని తిరస్కరిస్తున్నారు. దీంతో అడిగిన మొత్తం ఇచ్చి పత్రాలు...

Sunday, August 27, 2017 - 17:32

కరీంనగర్ : పేదల..మధ్య తరగతి పథకాల్లో లబ్ది పొందాలంటే అధికారులు..సిబ్బందికి డబ్బులు అందచేయాల్సి పరిస్థితి ఏర్పడుతోంది. స్వయంగా మంత్రి కేటీఆర్ ఇలాఖాలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే సిరిసిల్లలో ఇసుక మాఫియా ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే.

తాజాగా సిరిసిల్లలో సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. వివాహ ధృవీకరణ పత్రాల...

Pages

Don't Miss