Wednesday, June 27, 2018 - 21:16

హైదరాబాద్ : బిఎల్‌ఎఫ్‌ నేతృత్వంలో.. వామపక్ష, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. ఏలికల నిర్బంధాన్ని.. అడుగడుగు ఆంక్షలను అధిగమిస్తూ.. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టాయి. అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. పోలీసుల అత్యుత్సాహాన్ని నిరసిస్తూ.. కొన్ని చోట్ల నేతలు నిరాహార దీక్షలూ చేపట్టారు. కేసీఆర్‌ సర్కారు తీరుకు నిరసనగా కదం తొక్కిన బిఎల్‌ఎఫ్‌.. అడుగడుగు ఆంక్షలను...

Wednesday, June 13, 2018 - 16:00

రాజన్న సిరిసిల్ల : రైతన్న, నేతన్నలతోపాటు ప్రతి ఒక్కరూ సంతోషించే విధంగా కేసీఆర్‌ పాలన సాగుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాజన్న సిరిసిల్లలో వ్యవసాయ కళాశాల శంకు స్థాపన కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు మంత్రి కేటీఆర్. కరవుకు కేరాఫ్‌గా ఉన్న ప్రాంతంలో కాలువల నిర్మాణం అద్భుతంగా సాగుతోందని చెప్పారు మంత్రి....

Wednesday, June 13, 2018 - 14:02

రాజన్నసిరిసిల్ల : మంత్రి కేటీఆర్ కృషి వల్లే సిరిసిల్లకు పాలిటెక్నిక్, అగ్రికల్చర్ కాలేజీలు వచ్చాయని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.   
వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇది ఒక చక్కటి కార్యక్రమం అన్నారు. కేటీఆర్ కృషి వల్ల పాలిటెక్నిక్ కళాశాలను బిల్డింగ్ తో సహా ప్రారంభించుకున్నామని తెలిపారు. ఒక్క సిరిసిల్లకు పాలిటెక్నిక్ కళాశాల, వ్యవసాయ కళాశాల...

Wednesday, June 13, 2018 - 12:53

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో తండ్రీ కొడుకుల మృతదేహాలతో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి..  ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో భూ తగాదాలతో.. మంగళవారం ఎల్లయ్య, రాజశేఖర్‌ను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. గత కొంతకాలంగా 39 గుంటల భూమి కోసం ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోంది.  నిందితులు దేవయ్య, స్వామి, పద్మ వెంకటేష్‌ను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేశాయి. 

 

Tuesday, June 12, 2018 - 12:13

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూమి వివాదంలో తండ్రీ కొడుకులను ప్రత్యర్థులు నరికి చంపేశారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌ గ్రామ పరిధిలోని కృష్ణారావుపల్లిలో ఈఘటన జరిగింది. గ్రామానికి చెందిన సవనపల్లి ఎల్లయ్య సోదరుడి నుంచి వ్యవసాయ భూమిని మామిండ్ల దేవయ్య, స్వామిలు కొనుగోలు చేశారు. 15ఏళ్ల క్రితమే సవనపల్లి యల్లయ్య సోదరుడు తన వ్యవసాయ భూమిని మామిండ్ల దేవయ్య,...

Monday, June 11, 2018 - 06:45

సిరిసిల్ల : ఆయనో ప్రజాప్రతినిధి. ప్రజలకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించాల్సిన నేత. ప్రజల కష్టాలు అలా ఉంచితే.. ఆయనే పెద్ద సమస్యగా మారాడు. అధికారమే అండగా పేదలకు చెందిన భూములను కబ్జా చేసేస్తున్నాడు. ఇదేంటని నిలదీస్తే దిక్కున్నచోట చెప్పుకోండని బెదిరింపులకు పాల్పడుతున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కబ్జాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అక్రమాలపై స్పెషల్‌ స్టోరీ.. రాజన్న...

Friday, June 8, 2018 - 19:51

రాజన్నసిరిసిల్ల : ఇల్లంతకుంటలో విషాదం చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్ లో ఈతకు వెళ్లిన శివ అనే 9 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.  స్థానికులు బాలున్ని కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే నీళ్లు మింగి ఊపిరిరాడక చనిపోయాడు. బాలుడి మృతితో ఇల్లంతకుంటలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Tuesday, June 5, 2018 - 19:11

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది. ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు వచ్చిన రసమయి బాలకిషన్‌ను మహిళలు ఖాళీ బిందెలతో అడ్డుకున్నారు. తమ ప్రాంతంలో తాగునీరు సమస్యను పరిష్కరించాలని మహిళలు, యువకులు ఎమ్మెల్యేను నిలదీశారు. దాదాపు 40 నిమిషాలపాటు ఎమ్మెల్యేను కదలనీయకుండా అడ్డుకున్నారు. ఇదిలావుంటే... ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన...

Monday, June 4, 2018 - 14:13

రాజన్నసిరిసిల్ల : జిల్లాలో ఓ సామాన్యుడు ప్రధాని మోడీకి చెక్ ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తొమ్మిది పైసలు తగ్గించినందుకు చందుగౌడ్ అనే వ్యక్తి వినూత్న నిరసన తెలిపారు. ప్రధాని రిలీఫ్ ఫండ్ కు ఆ తొమ్మిది పైసల చెక్ ను విరాళంగా జమ చేశారు. ఈ చెక్ ను సిరిసిల్ల ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ కు అందజేశాడు...ధనవంతులుగా ఉన్నపేదవారికి తొమ్మిది పైసలు అందజేయాలని సూచించారు.

Saturday, June 2, 2018 - 21:05

హైదరాబాద్ : ఎన్నో ఏళ్ల ఉద్యమం. ఎంతో మంది యువకుల ప్రాణ త్యాగాలు. ఉమ్మడి పోరాటాలు. ఉక్కు సంకల్పం. మొక్కవోని ఆత్మస్థైర్యంతో సాధించుకున్న తెలంగాణకు నాలుగేళ్లు నిండాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో...

Pages

Don't Miss