Wednesday, July 26, 2017 - 08:37

రాజన్నసిరిసిల్ల : వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ వద్దు... 9 గంటల కరెంటే ముద్దు అంటున్నారు  అక్కడి గ్రామ రైతులు... అంతటా .. కరెంటో రామచంద్రో అంటూ  అరుస్తుంటే... ఆ  రైతులు మాత్రం ... 24 గంటల కరెంట్‌ వద్దు అని వేడుకుంటున్నారు. దీనికోసం తీర్మానం కూడా చేశారు. 
9 గంటల విద్యుత్‌ అందించాలని తీర్మానం  
ఎక్కడైనా.. రైతులు 24 గంటల విద్యుత్ కావాలని డిమాండ్‌...

Tuesday, July 25, 2017 - 18:46

సిరిసిల్ల : ఓ ఆటో డ్రైవర్‌పై పోలీసు ప్రతాపం చూపించాడు. తప్పు చేశానని ఒప్పుకున్నా  డ్రైవర్‌పై చేయి చేసుకున్నాడు. పోలీసు దాష్టీకానికి డ్రైవర్ ఆసుపత్రి పాలయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాలకు చెందిన ఆటో డ్రైవర్ సవరన్‌ రుద్రంగి మండలంలో ప్రయాణికులతో ఆటోలో బయలుదేరాడు. తనిఖీల్లో భాగంగా ఆటోను ఆపిన ఎస్ఐ రమేష్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడంతో సవరన్ తాగినట్లు తేలింది....

Sunday, July 23, 2017 - 20:12

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరళ్ల దళితులకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తమను ఎస్పీతోపాటు టీఆర్‌ఎస్‌ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులను కాంప్రమైజ్‌ కావాలంటూ వేధిస్తున్నారన్నారు. రాజీపడితే మా పిల్లలను విడిపిస్తామని.. లేకుంటే శవమై తేలుతారని హెచ్చరిస్తున్నారంటూ వాపోయారు. న్యాయం చేయాల్సిన పోలీసులు, అధికారపార్టీ నేతలే తమను...

Sunday, July 23, 2017 - 10:03

రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన టీ మాస్‌ బృందానికి కనిపించిన దృశ్యాలివి.. మహిళల ఆవేదన, వారి కన్నీళ్లు అక్కడున్న ప్రతిఒక్కరినీ కదిలించాయి.. బాధితులందరినీ టీ మాస్‌ బృందం ఓదార్చింది.. అండగా ఉంటామని హామీ ఇచ్చింది. నేరెళ్ల గ్రామంలో ఈ నెల 2న ఇసుక లారీ ఢీకొని భూమయ్య అనే నిరుపేద మృతిచెందాడు.. గడచిన ఆరు నెలల్లో ఇసుక లారీలు నలుగురి ప్రాణాలు తీశాయి.. 46మందిని...

Saturday, July 22, 2017 - 21:46

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల వీరంగాన్ని టీ మాస్‌ ఫోరం తీవ్రంగా ఖండించింది.. దళితుల్ని చితకబాది అక్రమ కేసులు పెట్టడాన్ని తప్పుబట్టింది.. బాధితులకు అండగా నిలిచిన బృందం సభ్యులు... బాధితుల తరపున న్యాయపోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.. 
పోలీసుల థర్డ్ డిగ్రీతో నరకయాతన 
ఎవరిని కదిపినా కన్నీళ్లే..పోలీసుల చిత్రహింసలు అనుభవించిన వారి రోదనలే.....

Saturday, July 22, 2017 - 18:52

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎనిమిది మంది గ్రామస్థులపై పోలీస్ అధికారులు థర్డ్ డిగ్రి ప్రయోగించి... వారిపై అక్రమ కేసులు పెట్టడాన్ని టీ మాస్ బృందం తీవ్రంగా ఖండించింది. నేరెళ్ల, జిల్లెల, రామచంద్ర పురంలో గల బాధిత   కుటుంబాలను బృంద సభ్యులు పరామర్శించారు. ఘటనపై న్యాయ పోరాటం చేస్తామంటూ బాధితులకు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం...

Friday, July 21, 2017 - 07:39

సిరిసిల్ల : మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల అసెంబ్లీ స్థానం పరిధిలోని నేరెళ్లలో దళితులపై దాడి జరిగింది. దాడి చేసింది ఎవరో కాదు.స్వయాన ప్రజలను రక్షించాల్సిన పోలీసులే కావడం గమనించదగ్గ విషయం. పోలీసుల లాఠీల కాఠిణ్యానికి దళితుల వీపులు చీరుకుపోయాయి. కాళ్లు, చేతులు విరిగాయి. పోలీసులు ఇచ్చిన షాక్‌ ట్రీట్‌మెంట్‌, థర్డ్‌ డిగ్రీ పద్ధతులకు నిలువెత్తు నిదర్శమనే ఈ రక్తపు...

Thursday, July 20, 2017 - 20:17

సిరిసిల్ల : అధికారుల నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇరువైపుల ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. అయితే... రోడ్డుపై వాహనాలను నిలిపివేయకుండానే చెట్లను తొలగిస్తున్నారు. అయితే... నరికిన చెట్టు కొమ్మ ద్విచక్రవాహనంపై పడింది. ఈ ప్రమాదంలో బైక్‌ వస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా... మరో వ్యక్తికి...

Thursday, July 20, 2017 - 07:54

సిరిసిల్ల : రాష్ట్రంలో ఇసుక, డ్రగ్స్‌ మాఫియా ముఠాలు చెలరేగిపోతున్నాయని, వీటి వెనుక ప్రభుత్వ హస్తం ఉందని TPCC కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నవారిని లారీలతో అడ్డంగా తొక్కిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులుకు కూడా మాఫియాకు వంతపాడుతూ ఫిర్యాదుదారులను చింత్రహింసకు గురి చేయడాన్ని తప్పుపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుకు అక్రమణ...

Tuesday, July 18, 2017 - 21:44

హైదరాబాద్ : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. వరద ప్రవాహంతో అన్ని జిల్లాల్లో ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. 
జోరుగా..
జోరువానలతో హైదరాబాద్‌లో జనజీవనం అతలాకుతలమవుతోంది. నగరంలోని పలు చెరువుల్లోకి భారీగా...

Monday, July 17, 2017 - 21:23

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభాంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీవర్షాలు దంచికొడుతుండగా .. ఒడిశాలో కురుస్తున్న భారీవర్షాలకు ఉత్తరాంధ్రలోని నదుల్లో వరద ఉధృతి...

Pages

Don't Miss