Sunday, October 22, 2017 - 19:33

సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్రంలో 50 శాతం పవర్‌లూమ్స్‌ ఉన్న సిరిసిల్లను కాదని వరంగల్‌లో టెక్స్‌ టైల్స్‌ ప్రారంభించడంపై కాంగ్రెస్‌ నాయకులు పొన్నం ప్రభాకర్‌ మండిపడ్డారు. ఈ రోజును సిరిసిల్ల చీకటి రోజుగా అభివర్ణించారు. వరంగల్‌లో కొత్తగా ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదన్నారు. సిరిసిల్లకు కొత్తగా వచ్చింది ఏమీ రాలేదని..మూడున్నర సంవత్సరాలైన తరువాత ఏదైనా వాగ్ధానాలు చేస్తే ఏడాదిన్నర తరువాత...

Saturday, October 21, 2017 - 21:21

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీసు అమరవీరులకు తెలుగు రాష్ట్రాల్లో ఘన నివాళులు అర్పించారు. పోలీసు ఉన్నతాధికారులు అమరులైన పోలీసు కుటుంబాలను పరామర్శించారు. అమరులైన పోలీసులకు నివాళులు అందించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు సంస్మరణ వేడుకల్లో...

Friday, October 20, 2017 - 13:24

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొత్తచెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్ధులు మృతి చెందారు. మృతులు శాంతినగర్‌కు చెందిన సాయిరాహుల్‌, సయ్యద్‌సాద్‌గా గుర్తించారు. చెరువులో గాలించి విద్యార్ధుల మృతదేహాలను వెలికితీశారు. 

Wednesday, October 11, 2017 - 21:52

సిరిసిల్ల : సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణాలకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామన్న కేసీఆర్‌... రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. తనను అన్ని విధాలుగా తీర్చిదిద్దిన సిద్దిపేటను... జిల్లా చేయడమే కాకుండా... తన చేతుల మీదుగా కలెక్టరేట్‌ భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇక...

Wednesday, October 11, 2017 - 20:39

సిరిసిల్ల : బతుకమ్మ చీరలపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేసాయన్నారు సీఎం కేసీఆర్. అలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోవద్దని చెంప ఛెళ్లుమనిపించాలని సూచించారు. సిరిసిల్లలో సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రైవేటు డాక్టర్లు అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేసి గర్భసంచులు తీసి ఇబ్బంది పాలు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. ఓవైపు కేసీఆర్ ప్రసంగం...

Wednesday, October 11, 2017 - 18:55

రాజన్నసిరిసిల్ల : వెనుకబడిన సిరిసిల్ల అభివృద్ధికి కృష్టి చేస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. రాజన్నసిరిసిల్ల సభలో ఆయన ప్రసంగించారు. సిరిసిల్ల...వెనుబడ్డ ప్రాంతమని...కరువుతో అల్లాడిన ప్రాంతమన్నారు. అనేక అవస్తలు ఎదుర్కొన్న ప్రాంతమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. అప్పటి సీఎంను నష్టపరిహారం అడిగితే ఇవ్వలేదన్నారు....

Wednesday, October 11, 2017 - 15:32

సిరిసిల్ల : సీఎం కేసీఆర్‌ టూర్‌ ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. సీఎం పర్యటన సందర్భంగా సిరిసిల్ల జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బస్సులను రద్దు చేశారు ఆర్టీసీ అధికారులు. ఈ మేరకు బస్టాండ్లలో నోటీసులు అంటించారు. బస్సులు రద్దు కావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. 

 

Pages

Don't Miss