Monday, October 9, 2017 - 16:22

కరీంనగర్/సిరిసిల్ల : నేరెళ్ల ఘటనలో ఎస్పై రవీందర్ పై తంగాళ్లపల్లి పీఎస్ లో కేసు నమోదు అయింది. నేరెళ్ల ఇసుక లారీల దహనం తరువాత అకారణంగా తమను అదుపులోకి తీసుకొని కొట్టారని బాధితుడు గణేష్ ఫిర్యాదు చేశారు. ఎస్సైపై ఐపీసీ సెక్షన్ 324 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. నేరెళ్ల ఘటనలో ఇప్పటికే ఎస్సై రవీందర్ సస్పెన్షన్ లో ఉన్నారు. మరింత...

Saturday, October 7, 2017 - 17:37

కరీంనగర్ : జిల్లా బోయిన్‌పల్లి మండలం మానువాడలోని మిడ్‌మానేరు డ్యామ్‌ పనుల్లో ప్రమాదం జరిగింది. స్పిల్‌వేపై గేట్లు బిగిస్తుండగా ముగ్గురు కార్మికులు ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని కరీంనగర్‌లోని మహావీర్‌ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Thursday, October 5, 2017 - 19:44

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో దారుణం జరిగింది. నవ దంపతులు హరీష్, రచన దారుణ హత్య గురైయ్యారు. నెల క్రితమే వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Thursday, September 28, 2017 - 12:43

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతల ఠాణా గ్రామాలు మిడ్‌ మానేరు కింద ముంపునకు గురవుతున్నాయి. భూ నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం చేయడంతో ఇక్కడి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మిషన్‌ భగీరథలో భాగంగా మిడ్‌ మానేరును 4.4 టీఎంసీల నీరు నింపడానికి ప్రభుత్వం నిశ్చయించింది. గ్రామాలను ఖాళీ చేయాలంటూ గతంలో...

Tuesday, September 26, 2017 - 19:41

రాజన్నసిరిసిల్ల : అనంతారం ప్రాజెక్టు పనులను సోమారంపేట రైతులు అడ్డుకున్నారు. నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కన్ స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రైతులను అరెస్టు చేశారు. పీఎస్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Monday, September 25, 2017 - 07:17

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు మూడుఎకరాల భూమి కలేనా..? అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే భూములు దక్కనున్నాయా..? దశాబ్దాలుగా కబ్జాలకు గురైనా భూముల లెక్కలు తేలేదన్నడు.. ? సమగ్ర భూసర్వే పేరుతో గులాబీనేతలు జేబులు నింపుకోడానికి ప్లాన్స్‌ వేశారా..? తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తున్న భూ సర్వేపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పై వివాదాలు రాజుకుంటున్నాయి...

Sunday, September 24, 2017 - 12:15

రాజన్న సిరిసిల్ల : మిడ్‌ మానేరు ముంచేసింది. ప్రాజెక్టు పూర్తి కాకముందే నీరు విడుదల చేయడంతో నాలుగు ముంపు గ్రామాల ప్రజలకు ముప్పు వాటిల్లుతోంది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండలంలోని మల్క్‌పేట, కొదురుపాక, నీలోజీపల్లి  గ్రామాల ప్రజలు పెట్టే బేడ, తట్టా బుట్టా సద్దుకుని, పిల్లాపాపలతో తలదాచుసుకునేందుకు వేరే ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరోవైపు తమకు పూర్తి స్థాయిలో...

Wednesday, September 20, 2017 - 21:48

కరీంనగర్/సిరిసిల్ల : రోజులాగే కార్మికులు పనిలోకి వెళ్లారు.. భోజన విరామం కోసం ముందు ఇంజనీర్లు బయటకు వచ్చారు.. వారి వెనకే వస్తున్న కార్మికులపై సొరంగ మార్గం కూలిపోయింది.. కాళేశ్వరం పనుల్లో జరిగిన ఈ ప్రమాదం ఏడుగురు కార్మికుల ప్రాణాలను బలిగొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరిలో కాళేశ్వరం ఎత్తిపోతల పదో ప్యాకేజీ...

Wednesday, September 20, 2017 - 19:10

కరీంనగర్/సిరిసిల్ల : కాళేశ్వరం పనుల్లో ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య చేరింది. యాజమాన్యం నిర్లాక్ష్యం కారణంగా సొరంగం కూలిందని తెలుస్తోంది. సొరంగంలో మరికొందురు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Pages

Don't Miss