Wednesday, September 20, 2017 - 19:10

కరీంనగర్/సిరిసిల్ల : కాళేశ్వరం పనుల్లో ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య చేరింది. యాజమాన్యం నిర్లాక్ష్యం కారణంగా సొరంగం కూలిందని తెలుస్తోంది. సొరంగంలో మరికొందురు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Wednesday, September 20, 2017 - 16:30

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద కాళేశ్వరం సొరంగ మార్గం కూలి ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. మృతులు యూపీకి చెందిన వారిగా గుర్తించారు. సొరంగంలో మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Tuesday, September 19, 2017 - 16:03

కరీంనగర్/సిరిసిల్ల : జిల్లా వేములవాడలో దారుణం జరిగింది. రవి అనే వ్యక్తి ఆటోలో భార్య అంజలి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరుం రవి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రవిని హసుపత్రికి తరలించారు. రవి నెల క్రితమే దుబాయ్ నుంచి వచ్చాడు. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్...

Monday, September 18, 2017 - 19:39

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.....

Wednesday, September 13, 2017 - 19:28

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని జిల్లెల గ్రామంలో విషాదం చోటుచేసుకొంది. ఈత కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్ధులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. జిల్లెల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్ధులు.. మద్యాహ్న భోజనం చేసిన అనంతరం ఈత కోసమని చెరువు దగ్గరికి వెళ్లారు. చెరువులోకి దిగిన ఇద్దరు స్నేహితులు మునిగి పోవడంతో వెంటనే ఇంకో విద్యార్ధి విషయాన్ని...

Wednesday, September 13, 2017 - 19:26

రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్లలో టీమాస్‌ ఫోరం ఆవిర్భావ సభలో తెలంగాణ ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నియంతృత్వం వైపు పోతుందా లేక ప్రజాస్వామ్యం వైపు పోతుందా తెలియడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిలదీసేందుకే టీమాస్‌ ఫోరం ఆవిర్భవించిందని..ఈ పేరు వింటేనే పాలకులకు వణుకుపుడుతోందన్నారు.

 

Wednesday, September 13, 2017 - 07:19

కరీంనగర్ : తెలంగాణ ఉద్యమానికి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉత్తర తెలంగాణ మొదటి నుంచి అండగా నిలిచింది. ఇందులోనూ కరీంనగర్‌జిల్లా అయితే టీఆర్‌ఎస్‌కు పెట్టని కోట. ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్‌ కూడా ఇదే జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కరీంనగర్‌ కేంద్రంగా ఇటీవల జరిగిన పరిణామాలు ప్రభుత్వ పాలనకు మాయని మచ్చలా మిగిలాయి. నేరెళ్లలో దళితులపై పోలీసుల దాష్టీకం మొదలుకొని నిన్నటి...

Monday, September 11, 2017 - 19:09

సిరిసిల్ల : ఇల్లంతకుంటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడు కిందకు దూకుతానంటూ హల్‌చల్‌ చేశాడు. గాలిపల్లి గ్రామానికి చెందిన దళిత కళాకారుడు రవి ప్రభుత్వ తీరుకు ఇలా నిరసనకు దిగాడు. బతుకుదెరువు కోసం ఉద్యోగం లేదా, కొంత భూమి అయినా ఇవ్వాలని ప్రభుత్వానికి పలుమార్లు అర్జీలు పెట్టుకున్నాడు. కాని.. అధికారులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఆత్మహత్య...

Monday, September 11, 2017 - 17:13

హైదరాబాద్ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. తన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా కోర్టు నిలిపివేసింది. పౌరసత్వం రద్దుపై పునఃసమీక్షించాలని కేంద్రహోంశాఖను రమేశ్‌ కోరారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Monday, September 11, 2017 - 13:42

సిరిసిల్ల : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు కోర్టు విచారణ చేపట్టింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Pages

Don't Miss