Thursday, June 22, 2017 - 18:50

సంగారెడ్డి: మిషన్‌ భగీరథ స్కీంలో అక్రమాలు జరుగుతున్నాయని... తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు.. పైపులుండగానే మళ్లీ కొత్తగా పైపులు వేస్తున్నారని విమర్శించారు. 16వేల కోట్ల రూపాయలతో అయిపోయే పనులకు దాదాపు 46 వేల కోట్లు ఖర్చుపెడుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఉంటే ప్రగతి భవన్‌లో... లేకపోతే ఫాంహౌస్‌లో ఉంటారని. ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలు వినే పరిస్థితే...

Wednesday, June 21, 2017 - 18:41

సంగారెడ్డి : అందోల్ మండలంలోని ఎర్రారం గ్రామానికి చెందిన దళిత మహిళా సర్పంచ్‌.. మాజీ సర్పంచ్‌పై జోగిపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మాజీ సర్పంచ్‌ ప్రభాకర్‌ రెడ్డితో తనకు ప్రాణభయం ఉందని.. జయమ్మ తెలిపారు. గ్రామంలో బోరు వేస్తుండగా టెంకాయ కొట్టమని పిలిపించారని.. నీళ్లు ఉన్న చోట ఎందుకు.. లేని చోట వేయండని తను చెప్పినట్లు జయమ్మ చెప్పారు....

Wednesday, June 21, 2017 - 15:21

సంగారెడ్డి : తెలంగాణ అభివృద్ధి కోసమే పోరాడుతున్నామని ప్రొ. కోదండరాం అన్నారు. ఆయన సంగారెడ్డిలో అమరుల స్ఫూర్తి యాత్రను ప్రారంభించారు. ప్రొ.జయశంకర్ గారి వర్థంతి సందర్భంగా మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన '10టివి'తో మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. తెలంగాణ రాకముందు సాధన కోసం, తెలంగాణ వచ్చిన తరువాత అభివృద్ధి...

Monday, June 19, 2017 - 21:23

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వానల కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్‌ జిల్లాలోని... ఉట్నూరు ఏరియాలో భారీ వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితి...

Saturday, June 17, 2017 - 12:35

సంగారెడ్డి : పరిశ్రమలకు 24 గంటలు కరెంట్ ఇవ్వడమనేది ప్రభుత్వ విజయమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి లో వైద్య పరికారల పరిశ్రమ శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ ధ్యేయంగా లక్ష్యంగా సీఎం కేసీఆర్ గారు పాలన చేస్తున్నారని తెలిపారు. మొదటి రోజు 14 మంది పెట్టుబడి పెట్టడానికి వచ్చినందుకు అనందంగా ఉందన్నారు. ఈ రోజు తమ ఆలోచన ఒక్కటే అన్ని రంగాలు...

Friday, June 16, 2017 - 15:50

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై.. టీడీపీ నేత ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి చనిపోతే.. పరామర్శించడానికి వెళ్లిన తన మీద 4 సెక్షన్లపై కేసు పెట్టారని మండిపడ్డారు. తప్పుడు ప్రెస్‌ మీట్‌లు పెట్టి ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమా? కాదా అని ప్రతాప్‌ రెడ్డి ప్రశ్నించారు...

Friday, June 16, 2017 - 13:51

సంగారెడ్డి : కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి బ్రాస్‌లెట్‌ 20 లక్షల రూపాయలు పలికింది. రాహుల్‌ పర్యటన సందర్భంగా జగ్గారెడ్డికి వీహెచ్‌ తన బ్రాస్‌లెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. రాహుల్‌ సూచనతో వీహెచ్‌ జగ్గారెడ్డికి ఈ బ్రాస్‌లెట్‌ను ఇచ్చాడు. అయితే.. బ్రాస్‌లెట్‌ను వేలం వేసి.. వచ్చిన డబ్బును మిర్చి రైతులకు ఇస్తానని అప్పుడు జగ్గారెడ్డి ప్రకటించాడు. దీంతో ఈరోజు బ్రాస్‌లెట్‌కు వేలం నిర్వహించారు...

Pages

Don't Miss