Sunday, August 12, 2018 - 21:21

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ తడిసి ముద్దైంది. వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు...

Thursday, August 9, 2018 - 13:50

సంగారెడ్డి : అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ ఇక్రిశాట్‌ పరిశోధనా ఫలితాలను సంగారెడ్డి జిల్లా అందిపుచ్చుకోనుంది. ఈ మేరకు రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయంలో ఆధునిక మెళకువల కోసం ఇక్రిశాట్‌ను ఉపయోగిస్తామంటనున్న జిల్లా కలెక్టర్‌తో ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించారు. తెలంగాణ ప్రాంతంలో అధికంగా మెట్ట పంటలే సాగవుతున్నాయని తెలిపారు...

Friday, August 3, 2018 - 15:17

సంగారెడ్డి : సదాశివపేట ఎమ్ ఆర్ ఎఫ్ పరిశ్రమ ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం తీరుకు నిరసనగా 600 మంది కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం, కార్మిక సంఘం నాయకుల చీకటి ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం కార్మిక వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకొని హామీలను విస్మరించిందని ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికుల...

Friday, August 3, 2018 - 06:58

హైదరాబాద్ : గ్రామీణ తెలంగాణలో నూతన శకం ఆరంభమైంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏకకాలంలో 4 వేల 3 వందల 83 కొత్త పంచాయతీలు నేటి నుంచి ఉనికిలోకి వచ్చాయి. పాత పంచాయతీలతో పాటు నూతన పంచాయతీలలో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. ఇంతకాలం ఒక ఊరికి అనుబంధంగా ఉన్న శివారు పల్లెలు, తండాలు, గూడేలకు ఇప్పుడు స్వతంత్ర హోదా దక్కింది. కొత్త పంచాయితీల ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు...

Thursday, August 2, 2018 - 20:40

సంగారెడ్డి : జిల్లాలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయితీల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. తండాలను కూడా గ్రామ పంచాయితీ హోదాను కల్పించడంతో పండుగ వాతావరణం వచ్చిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయితీలతో పాలన మరింత మెరుగవుతుందంటున్న జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లుతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. సంగారెడ్డి జిల్లాకు కొత్తగా 190 గ్రామ...

Wednesday, July 25, 2018 - 15:53

సంగారెడ్డి : అక్కడి పల్లెల్ని, పచ్చని పంట పొలాలను కాలుష్యం కాటేస్తోంది. అక్కడి వాతావరణాన్ని, పరిశ్రమలు విధ్వంసం చేస్తున్నాయి. దశాబ్దాల క్రితం ఏర్పాటైన పరిశ్రమలు ఇప్పుడు.. విస్తరణ బాట పట్టాయి. అంటే అక్కడి ప్రజలు మరింత కాలుష్య కోరల్లో చిక్కుకోబోతున్నారు. వందలాది గ్రామాలు లక్షలాది మంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న కాలుష్య భూతంపై 10టీవీ కథనం..
...

Wednesday, July 25, 2018 - 06:42

సంగారెడ్డి : జిల్లా కలెక్టరేట్‌ ముందు మెప్మా రిసోర్స్‌ పర్సన్స్‌ చేస్తున్న దీక్షలు ఉధృతరూపం దాల్చాయి. 59 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తమ ఆందోళన ఉధృతం చేశారు. కలెక్టరేట్‌కు జిల్లా సమీక్షకు వచ్చిన మంత్రి హరీశ్‌రావు దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని...

Sunday, July 22, 2018 - 08:12

సంగారెడ్డి : జిల్లాలోని బోల్లారంలోని డిజైర్‌ సొసైటీలోఉన్న ఎయిడ్స్‌ బాధిత పిల్లలను బిగ్‌బాస్‌ 2 పార్టిసిపెంట్‌ భానుశ్రీ కలిశారు. బాధిత పిల్లలకు భోజనం పెట్టి వారితో డాన్సులు చేశారు. పిల్లలతో గడపడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. 

 

Thursday, July 19, 2018 - 19:48

సంగారెడ్డి : జిల్లా కేంద్రంలో రోడ్ల వెడల్పు, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ మేరకు స్వయంగా అధికారులతో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై పట్టణంలో తిరిగి పనుల పురోగతిని పరిశీలించారు. నిర్ణీత గడువు ముగుస్తున్నా పనుల్లో జాప్యం జరగడంపై కలెక్టర్‌, ఎమ్మెల్యేలు హెచ్ ఎండీఏ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో వేగం...

Pages

Don't Miss