Monday, September 25, 2017 - 07:17

హైదరాబాద్ : తెలంగాణలో దళితులకు మూడుఎకరాల భూమి కలేనా..? అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే భూములు దక్కనున్నాయా..? దశాబ్దాలుగా కబ్జాలకు గురైనా భూముల లెక్కలు తేలేదన్నడు.. ? సమగ్ర భూసర్వే పేరుతో గులాబీనేతలు జేబులు నింపుకోడానికి ప్లాన్స్‌ వేశారా..? తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తున్న భూ సర్వేపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పై వివాదాలు రాజుకుంటున్నాయి...

Sunday, September 24, 2017 - 17:26

సంగారెడ్డి : ఆర్టీసీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎస్ డబ్ల్యూ  అధ్వర్యంలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల చైతన్య యాత్ర సంగారెడ్డి డిపోకు చేరుకుంది. ఆరు రోజుల క్రితం మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ప్రారంభమైన జీపు జాత ఇప్పటివరకు ఇరవై ఆరు డిపోలను సందర్శించి అక్కడి సమస్యలను తెలుసుకున్నామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Tuesday, September 19, 2017 - 17:54

సంగారెడ్డి : జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం మన్నెగూడలోని శ్లోకా ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు బతుకమ్మ పాటలకు చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగర్‌ మధు ప్రియ హాజరై చిన్నారులను ఆట పాటలతో అలరించారు. తెలంగాణ సంప్రదాయ పండగైన బతుకమ్మ గురించి పిల్లలకు తెలియజేయడానికే ఈ కార్యక్రమం...

Tuesday, September 19, 2017 - 17:42

సంగారెడ్డి : జిల్లాలో సీఐటీయూ రాష్ట్రవ్యాప్త సమ్మె ఉద్ధృతంగా కొనసాగింది. ఆందోల్‌ మండలం జోగిపేటలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల బాగోగులు ఏనాడు పట్టించుకోలేదని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ..సచివాలయం నుంచి కాకుండా ప్రగతిభవన్‌ నుంచి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అటు పటాన్‌చెరులో కార్మికులు భారీ ర్యాలీ...

Monday, September 18, 2017 - 19:39

హైదరాబాద్ : బతుకమ్మ చీరల పంపిణీ ప్రహసనంగా మారింది. నాసిరకం చీరలిచ్చారంటూ నారీ లోకం భగ్గుమంది. మాకొద్దీ చీరలంటూ కొందరు స్త్రీలు బతుకమ్మ చీరలను తగులబెట్టేశారు. మరికొందరైతే.. సీఎం భార్యాకుమార్తెలు ఇవే చీరలు కడతారా అని ప్రశ్నిస్తూ.. అప్పటికప్పుడు పాటలు కట్టి బతుకమ్మలు ఆడారు. మొత్తానికి బతుకమ్మ చీరల పంపిణీ వ్యవహారం.. ప్రభుత్వానికి అప్రతిష్టను తెచ్చిపెట్టింది.

తెలంగాణలో.....

Sunday, September 17, 2017 - 19:19

సంగారెడ్డి : కాలుష్య భూతం వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పచ్చని పల్లెల మధ్య పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో.. అక్కడి జనం ఊర్లను ఖాళీ చేసే పరిస్థితి నెలకొంది. ప్రశాంతమైన జీవనం కాస్తా.. పొగ కాలుష్యంతో పొగచూరిపోయింది. సంగారెడ్డి జిల్లా, కొండాపూర్‌ మండలంలోని కాలుష్య కారక పరిశ్రమలపై స్పెషల్ ఫోకస్. 

జనావాసాల మధ్య కాలుష్య కారక పరిశ్రమల్ని ఉంచబోమని.. మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన...

Saturday, September 16, 2017 - 15:42

సంగారెడ్డి : జిల్లాలోని తున్కల్‌ మండలం సుల్తాన్‌పూర్‌లోని జేఎన్ టీయూ వద్ద విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు తరగతులు బహిష్కరించి క్యాంపస్‌ ముందు నిరసన ర్యాలీ చేపట్టారు. 15 మంది విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్‌ ఈశ్వర ప్రసాద్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

 

Saturday, September 16, 2017 - 13:39

సంగారెడ్డి : అన్నా.. సోలో ఆంధ్రాకి అందగాడిని అంటూ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన నటుడు బాబుమోహన్‌ని ఇప్పటికి తెలుగు ప్రేక్షకులు మర్చిపోరు.. సినీ రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన చాలాకాలం టీడీపీలో పనిచేశారు. ఎమ్మెల్యేగా.. మంత్రిగా పదవులు నిర్వహించారు. గత ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా ఆందోల్ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు....

Monday, September 11, 2017 - 21:34

సంగారెడ్డి : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు చిన్నారుల పాలిట విలన్లుగా మారుతున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం- భారతినగర్‌లోని రావూస్‌ స్కూల్‌లో చిన్న తప్పుకు విద్యార్థినికి దారుణమైన పనిష్‌మెంట్ ఇచ్చారు. శనివారం యూనిఫాం వేసుకొని రాలేదంటూ పదకొండేళ్ల బాలికను అబ్బాయిల టాయ్‌లెట్‌ముందు నిలబెట్టారు.. గంటసేపు అక్కడే ఉన్న బాలిక... తీవ్ర మనో వేదనకు గురైంది....

Pages

Don't Miss