Sunday, September 3, 2017 - 10:55

సంగారెడ్డి : జిల్లాలో రూ. 100 కోట్ల విలువైన భారీ కుంభకోణం వెలుగుచూసింది. కోట్ల రూపాయల విలువైన కొల్లూరు చెరువును అప్పనంగా నొక్కేసేందుకు హైదరాబాద్‌కు చెందిన కొందరు భూబకాసురులు రంగంలోకి దిగారు. కొల్లూరు గ్రామంలో కొన్ని భూములను కొనుగోలు చేసిన... ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి చెందిన యజమానులు సురేందర్‌రావు, దేవేందర్‌రావు రోడ్డు నిర్మాణం పేరుతో... చెరువును కబ్జా చేసేందుకు యత్నించారు....

Saturday, September 2, 2017 - 09:45

సంగారెడ్డి : జిల్లా ఆందోల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు కోపం వచ్చింది. రైతు సమన్వయ కమిటీల ఏర్పాటుపై పుల్కల్‌ మండలం చౌటుకూర్‌లో జరిగిన అవగాహన సదస్సులో అన్నదాతలపై ఆగ్రహంతో ఊగిపోయారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధినన్న విషయం మర్చిపోయి బూతు పురాణం లంకించుకున్నారు. తాను వేషం వేసి నటిస్తే డబ్బులిస్తారని, మీరేమిస్తారంటూ రైతులను ప్రశ్నించారు.

Friday, September 1, 2017 - 21:56

సంగారెడ్డి : జిల్లాలోని ఆందోల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు కోపం వచ్చింది. రైతు సమన్వయ కమిటీల ఏర్పాటుపై పుల్కల్‌ మండలం చౌటుకూర్‌లో జరిగిన అవగాహన  సదస్సులో అన్నదాతలపై ఆగ్రహంతో ఊగిపోయారు.  బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధినన్న విషయం మర్చిపోయి బూతు పురాణం లంకించుకున్నారు. తాను వేషం వేసి నటిస్తే డబ్బులిస్తారని, మీరేమిస్తారంటూ రైతులను ప్రశ్నించారు.
 

Monday, August 28, 2017 - 18:56

సంగారెడ్డి : డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బురదబాట పట్టారు. సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేటలో పాలిటెక్నిక్‌ కళాశాల భవనాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆయన రోడ్డు సక్రమంగా లేకపోవడంతో బురద రోడ్డులోనే ప్రయాణించాల్సి వచ్చింది. అయితే ఈ విషయాన్ని కవర్ చేస్తున్న మీడియాపై కడియం రుసరుసలాడారు. 

Thursday, August 17, 2017 - 15:38

సంగారెడ్డి : మెడికల్‌ కాలేజీ తరలింపును నిరసిస్తూ కలెక్టరేట్‌ ఎదుట జగ్గారెడ్డి నిరాహారదీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. జగ్గారెడ్డికి మద్దతుగా భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. అయితే... దీక్షకు కూర్చునేముందే జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కలెక్టరేట్‌ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

Thursday, August 17, 2017 - 13:29

సంగారెడ్డి : జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేయాలని టి.కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. గత కొన్ని రోజులుగా ఆయన ఈ అంశంపై ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. సంగారెడ్డికి మంజూరైన కాలేజీని మంత్రి హరీష్ రావు సిద్ధిపేటకు తరలించుకపోయాడని ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమరణ దీక్ష చేయనున్నట్లు...

Thursday, August 17, 2017 - 12:30

సంగారెడ్డి : మెడికల్ కాలేజీ కోసం కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆమరణ నిరహార దీక్ష చేయడానికి సిద్ధమయ్యారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీక్షకు అనుమతినివ్వాలని జగ్గారెడ్డి కోరినట్లు..అందుకు పోలీసులు అనుమతి లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం జగ్గారెడ్డి ఇంటికి భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఎలాగైనా దీక్ష చేపడుతానని...

Wednesday, August 16, 2017 - 19:40

సంగారెడ్డి : జిల్లాలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్‌పై రేపటి నుంచి ఆమరణ దీక్షకు దిగుతున్నట్టు తెలిపారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డికి రావాల్సిన మెడికల్‌ కాలేజ్‌ను మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటకు తరలించుకుపోయారని ఆరోపించారు. సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ...

Sunday, August 13, 2017 - 19:44

హైదరాబాద్ : తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం టీమాస్‌ ఫోరం పోరాడుతుందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.  అన్ని సామాజిక తరగతులు అభివృద్ధి చెందినప్పుడే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. ఒకరో ఇద్దరు అభివృద్ధి అయినంత మాత్రాన యావత్‌ తెలంగాణ అభివృద్ధి అయినట్టు కాదన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా గార్డెన్స్‌లో టీమార్‌ ఆవిర్భావ సభ జరిగింది. ఈ...

Thursday, August 10, 2017 - 17:18

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా... పఠాన్‌చేరు పట్టణంలో జీఎమ్‌ఆర్‌ కన్వేన్షన్‌ సెంట్ర్‌లలో ఏర్పాటు చేసిన జాబ్‌ మేళాను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ మేళాలో ఉద్యోగం రాకపోయినా.. అభ్యర్థులు అధైర్యపడకూడదని... అందరికీ ఉద్యోగాలు వస్తాయని మహిపాల్‌రెడ్డి అన్నారు. అందరూ మంచి స్థాయిలో స్థిరపడతారని ఆకాంక్షించారు. కాగా ఈ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు హాజరయ్యారు. 

Pages

Don't Miss