Saturday, February 3, 2018 - 16:22

సంగారెడ్డి : తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధిచెబుతామన్నారు.. మంత్రి హరీశ్‌రావు. సంగారెడ్డిజిల్లా నల్లవాగు వద్ద 25 కోట్లతో చేపడుతున్న కాల్వల ఆధునీకరణ పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో వెయ్యికోట్లతో ఇప్పటికే పనులు చేపట్టామన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సాయం అందడం లేదని హరీశ్‌...

Friday, February 2, 2018 - 18:12

సంగారెడ్డి : సింగూర్‌ జలాశయం నుండి మిషన్‌ భగీరథ ట్రయల్‌ రన్‌ను భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రారంభించారు. యాసంగికి కాలువ ద్వారా ఆయకట్టు చివరి ప్రాంతాల వివరాలను సంబంధిత శాఖాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ట్రయల్‌ రన్‌ అనంతరం తాగునీటిని ప్రతి ఇంటికి చేరేలా చేస్తామన్నారు.

Wednesday, January 31, 2018 - 16:12

సంగారెడ్డి : జిల్లాలోని రామచంద్రాపురం బీహెచ్‌ఈఎల్‌ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గండెమ్మగుడి దగ్గరలోని ఓ షాపులో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షాపు ప్రధాన రహదారిపై ఉండడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. 

 

Monday, January 29, 2018 - 13:29

సంగారెడ్డి : ఇచ్చిన హామీలను టీసర్కార్ నెరవేర్చడం లేదని ఇంటర్ జేఏసీ చైర్మన్ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఈమేరకు ఆయనతో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. తెలంగాణలో విద్యావ్యవస్ధ ఆశించిన స్ధాయిలో లేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో కేజీ టూ పీజీ అన్న అంశం కనీసం అధ్యయనం చేయకుండా ఇచ్చిన ఆర్భాటపు హామీ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, డీఎస్సీ, ఉపాధ్యాయనియామకాలపై...

Saturday, January 27, 2018 - 17:35

సంగారెడ్డి : వందల సంవత్సరాల చరిత్ర ఉన్న సంగారెడ్డి జైలు మ్యూజియంగా మారాక సందర్శకుల తాకిడి మొదలైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 500రూపాయలు చెల్లించి 24 గంటలపాటు ఇక్కడ జైలులో గడిపే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న కింగ్ యాంగ్ అనే డెంటిస్ట్.. కెల్విన్ ఓంగ్ అనే రెస్టారెంట్ ఓనర్‌ మలేషియా నుంచి ఒకరోజు జైలు జీవితం గడిపేందుకు సంగారెడ్డికి వచ్చారు. ఇలా గడిపే అవకాశం...

Saturday, January 27, 2018 - 17:33

సంగారెడ్డి : సుమారు రెండువందల సంవత్సరాల చరిత్ర ఉన్న సంగారెడ్డి జైలు మ్యూజియంగా మారి రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్లలో వేల సంఖ్యలో టూరిస్టులు మ్యూజియంను సందర్శించారు. సంగారెడ్డి జైలుకి సంబంధించిన విశేషాలు.. జైలుకి సందర్శకులు పెరిగేలా జైలు సిబ్బంది తీసుకుంటున్న చర్యలపై జైలు సూపరింటెండెంట్ సంతోష్‌రాయ్‌తో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Thursday, January 25, 2018 - 20:11

సంగారెడ్డి : జిల్లాలోని నారాయణఖేడ్ పట్టణంలో మాజీ ఎంపీ సురేష్‌ షెట్కార్‌  టెన్‌టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.  ఆరో వసంతంలోకి అడుగుపెడుతున్న టెన్‌టీవీ సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కె.శ్రీనివాస్, తాహెర్, శంకరయ్య స్వామి, బాల్‌కిషన్, ఆనంద్‌స్వరూప్ షెట్కార్‌తోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Tuesday, January 23, 2018 - 16:41

సంగారెడ్డి : జిల్లాలో ఐదు వందల కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైంది. పైసా పైసా పోగేసి కొన్న తమ స్థలాల కోసం ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. కబ్జా చెర నుండి మా స్థలాలు మాకు దక్కేలా చేయాలని కోరుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Tuesday, January 23, 2018 - 07:14

సంగారెడ్డి : ఐదు వందల కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైంది. పైసా పైసా పోగేసి కొన్న తమ స్థలాల కోసం ఇప్పుడు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు. కబ్జా చెర నుండి మా స్థలాలు మాకు దక్కేలా చేయాలని కోరుతోన్న బాధితులతో 10టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Monday, January 22, 2018 - 18:00

సంగారెడ్డి : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటుతున్నా ప్రజల మౌలిక అవసరాలను తీర్చలేని స్థితిలో ఉందని టీ మాస్ రాష్ట్ర నాయకులు చుక్కారాములు అన్నారు. చుక్కా రాములుతో 10 టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు మూతపడ్డాయని ఆయన విమర్శించారు. టీ మాస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై మరింత వత్తిడి పెంచుతామన్నారు. 

Pages

Don't Miss