Wednesday, October 18, 2017 - 17:55

సంగారెడ్డి : బాణాసంచా దుకాణాలు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. సోషల్ మీడియా ప్రభావంతో శబ్ద, వాయు కాలుష్యాలకు దూరంగా ఉండాలని చాలామంది భావిస్తున్నారు. దీంతో వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Tuesday, October 17, 2017 - 17:33

సంగారెడ్డి : మల్లన్నసాగర్‌ ముంపు గ్రామం వేముల ఘాట్‌లో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు చేపడుతున్న రిలే నిరాహారదీక్షలు నేటికి 500 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొ. కోదండరాంలు పాల్గొన్నారు. ప్రజలకు అండగా ఉండి... చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని, మల్లన్నల సాగర్ ప్రాజెక్టులో నీళ్లు...

Monday, October 16, 2017 - 13:51

సంగారెడ్డి : జిల్లా, రామచంద్రపురం మండలంలోని భీరంగుడా కమాన్‌ వద్ద.. స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. మల్లికార్జుననగర్‌ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన మంజీరా వైన్స్‌ను.. వెంటనే తొలగించాలని ధర్నాకు దిగారు. వైన్స్‌ షాపు ముందు బైటాయించారు. కాలనీ ఎంట్రెన్స్‌లో వైన్స్‌ షాపు ఉండటంతో మహిళలు, విద్యార్థినులకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా...

Tuesday, October 10, 2017 - 17:59

సంగారెడ్డి : తెలంగాణలో జిల్లాల విభజన జరిగి ఏడాది అవుతోంది. పరిపాలన అందరికీ అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తోంది.. జీరో ఎర్రర్‌ రెవిన్యూ విలేజెస్‌, విద్య, వైద్యం అంశాలపై సంగారెడ్డి కలెక్టర్‌ మాణిక్‌ రాజ్‌ కణ్ణన్‌తో టెన్ టివి ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్న జిల్లాలతో పరిపాలన సులువుగా మారిందన్నారు. విద్య,...

Monday, October 9, 2017 - 11:27

సంగారెడ్డి : హరితహారం అంటూ ప్రభుత్వం చేస్తున్న హడావిడికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు. సంగారెడ్డిజిల్లాలో యథేచ్ఛగా హరిత హననం చేస్తున్నారు. సిర్గాపూర్‌ మండలం నల్లవాగు ప్రాజెక్టు సమీపంలో పెద్ద సంఖ్యలో పచ్చని చెట్లను నేలకూల్చారు. సీఎం పర్యటన సందర్భంగా బహిరంగసభ ఏర్పాట్లో భాగంగా చెట్లను కూల్చివేశారు. అధికారుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రజలకు నీతులు చెప్పడం కాదు...

Monday, October 9, 2017 - 10:13

సంగారెడ్డి : రెవెన్యూ అధికారుల వేధింపులతో సంగారెడ్డి జిల్లా న్యాలక్కల్‌ మండలం  మామిడ్గి  విలేజ్‌లో ఓ మహిళారైతు మృతి చెందింది. జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న నిమ్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోసం భూములను సేకరిస్తున్న అధికారులు న్యాల్‌కల్‌ గ్రామంలో భూములను కూడా సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా  రెవెన్యూ అధికారులు మామిడ్గి విలేజ్‌లో పర్యటించారు. నిమ్జ్‌ కోసం భూములు...

Saturday, October 7, 2017 - 20:46

సంగారెడ్డి : మనిషి రోగాన్ని నయంచేసే ఔషధ కంపెనీ... మనుషుల ప్రాణాలను కబళిస్తోంది. చెరువుల్లో, కుంటల్లో ఫ్యాక్టరీ వ్యర్థ జలాలను యధేచ్చగా వదులుతోంది. దీంతో మొత్తం భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. దీనిపై పలుమార్లు స్థానికులు అధికారులకు, పీసీబీ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. సంగారెడ్డి జిల్లా బోర్బట్ల గ్రామంలో అరబిందో ఫార్మా కంపెనీ సృష్టిస్తోన్న విధ్వంసంపై మరిన్ని...

Saturday, October 7, 2017 - 17:32

 

సంగారెడ్డి : జిల్లా పుల్కాల్ మండలం సింగూర్ ప్రాజెక్టులో ప్రేమ జంట గల్లంతైంది. గల్లంతైనవారు హైదరాబాద్ బోరబండకు చెందిన నాజిరుద్దీన్, శారీంబేగంలుగా గుర్తించారు. నీటిలోకి దిగిన ఈ ఇద్దరు కొట్టుకుపోతుంటే స్థానికులు కాపాడే ప్రయత్నం చేసిన వారిని కాపాడలేకపోయారు. వారి కోసం గజీతగాళ్లతో గాలింపు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Friday, October 6, 2017 - 21:36

సంగారెడ్డి : ఎమ్మెల్యే బాబుమోహన్..మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రజలపై కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవలే ఇలాంటి ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. అందోల్ ప్రజలపై కోపంతో ఊగిపోయారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు గురించి అడిగితే ఎమ్మెల్యే బాబు మోహన్ బూతులు అందుకున్నారు. దీనితో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. నియోజకవర్గానికి వచ్చిన ప్రతిసారి బాబు మోహన్ ఇలాగే వ్యవహరిస్తున్నారంటూ...

Pages

Don't Miss