Tuesday, April 25, 2017 - 06:55

సంగారెడ్డి : ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే... ఒకరిపై ఒకరు పోటీ పడి మరి విమర్శలు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధే లేదంటూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి .. రెండేళ్లలో చాలా చేశామని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ .. ఒకరిపై ఇంకొకరు పై చేయి సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో సందర్భంలో స్థాయిల్ని మరిచి తిట్టుకుంటున్నారు.

జగ్గారెడ్డి కాంగ్రెస్‌...

Saturday, April 22, 2017 - 11:54

సంగారెడ్డి : జిల్లాలోని అమీన్‌పూర్‌లో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్ధులు మృతి చెందిన ఘటన ఆలస్యంగా బయటపడింది. మియాపూర్‌ స్టాలిన్‌నగర్‌కు చెందిన రాజు, తరుణ్‌ మరో ఇద్దరు కలిసి నిన్న మధ్యాహ్నం చెరువులో ఈతకు వెళ్లారు. తరుణ్‌ లోతు తెలుసుకోకుండా చెరువులోకి ఈతకు దిగి మునిగిపోయాడు. అతన్ని కాపాడేందుకు రాజు ప్రయత్నించి తానూ మునిగిపోయాడు. ఇది గమనించిన సిద్దు, సమీర్‌లు భయంతో...

Wednesday, April 19, 2017 - 17:20

సంగారెడ్డి : వరంగల్‌ టీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు వెళ్లేందుకు అయ్యే ఖర్చుల నిమిత్తం సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ విరాళాలు సేకరించారు. హోటళ్లు, వస్త్ర దుఖానాల్లో పనిచేసి విరాళాలు సేకరించారు. తన నియోజక వర్గం నుంచి భారీగా జన సమీకరణ జరుగుతోంది అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ తెలిపారు. దారి ఖర్చుల కు కావాల్సిన నిధులను విరాళలు సేకరించినట్లు తెలిపారు. ప్రజల్లో...

Sunday, April 16, 2017 - 06:45

మెదక్ : సంగారెడ్డిలోని కేశవరెడ్డి పాఠశాలలో వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాల ఆవిర్భావం నుండి ఇదే తొలి వార్షికోత్సవం కావడంతో భారీస్థాయిలో వేడుకలు నిర్వహించారు. చదువు, ఆటపాటలతో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తామని పాఠశాల యాజమాన్యం తెలిపింది.

 

Saturday, April 15, 2017 - 18:05

సంగారెడ్డి : జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలు గుక్కెడు నీటి కోసం కాళ్లు అరిగేలా కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 210 గిరిజన తండాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే నియోజకవర్గంలోని మనూరు మండంలోనే మంజీర నది ప్రవహిస్తున్నా గొంతు తడుపుకోవడానికి కూడా నీరు చిక్కని దుస్థితి ఏర్పడింది.
అడుగంటిన భూగర్భ జలాలు
నియోజకవర్గంలో భూగర్భ జలాలన్ని...

Thursday, April 13, 2017 - 16:58

సంగారెడ్డి : ఉమ్మడి మెదక్ జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపేడుతున్నాడు. జిల్లాలో సంగారెడ్డి, సిద్దిపేటలలో ఎండ తీవ్రత సుమారు 42.2 డిగ్రీలుగా నమోదు అవుతుండడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు లోనవుతున్నారు. ఈ సందర్భంగా ఎండ తీవ్రతపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనే ప్రయత్నం చేసింది టెన్ టివి. ప్రజల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలని,...

Saturday, April 8, 2017 - 13:16

సంగారెడ్డి : జిల్లా గ్రంథాలయం సరికొత్త హంగుల్ని సంతరించుకుంటోంది.. కలెక్టర్‌ చొరవతో సమస్యలనుంచి బయటపడుతోంది.. అత్యాధునిక గదులు, అన్నిరంగాలకు సంబంధించిన పుస్తకాలతో ఇక్కడ అడుగుపెట్టగానే కొత్త ప్రపంచంలోకి వెళ్లామన్న అనుభూతి కలిగేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. త్వరలో ఈ లైబ్రరీ ప్రారంభం కానుంది. ఒకప్పుడు సంగారెడ్డి గ్రంథాలయం అంటే ఎవ్వరికీ తెలిసేది కాదు.. తెలిసినవారు పుస్తకాలు...

Friday, March 31, 2017 - 17:48

మెదక్ : ప్రజలు తమ పనులకోసం అధికారులను అడుక్కునే పరిస్థితి రాకూడదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ మాణిక్‌ రాజ్‌కణ్ణన్‌ అన్నారు. వినూత్న విధానాలతో ప్రజలకు చేరువవుతూ, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ జిల్లా అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న సంగారెడ్డి కలెక్టర్ మాణిక్ రాజ్ కణ్ణన్‌ తో టెన్ టివి ముఖాముఖి నిర్వహించింది. ఈమేరకు ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉన్న హక్కులను...

Thursday, March 30, 2017 - 09:44

సంగారెడ్డి : పండుగలు..ఉత్సావాలు వివిధ ప్రాంతాల్లో ఒక్కో విధంగా జరుగుతాయనే విషయం తెలిసిందే. ఉగాది పండుగ సందర్భంగా ఇటీవలే ఓ ప్రాంతంలో పిడకల సమరం చూసిన సంగతి తెలిసిందే. సంగారెడ్డిలో కూడా వినూత్నంగా ఈ పండుగను నిర్వహిస్తుంటారు. పేరుగాంచిన రామమందిర్ లో ప్రసాదాన్ని విసిరేస్తే దానిని పట్టుకోవడానికి భక్తులు పోటీ పడుతుంటారు. బుధవారం రాత్రి రామమందిర్ కు ప్రభుత్వ మాజీ విప్ జగ్గారెడ్డి...

Tuesday, March 28, 2017 - 12:22

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. బెజవాడలో భానుడు విరుచుకుపడుతున్నాడు. ఉదయం 8 గంటలకే ఎండలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. సూర్యుడి ప్రకోపానికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. చల్లధనం కోసం పరుగులు తీస్తూ శీతల పానియాలతో సేద తీరుతున్నారు. పనిలో పనిగా..పళ్ల రసాలు, కూల్‌డ్రింక్స్ వ్యాపారులు దండుకుంటున్నారు. 
ఏపీలో ఎండలు 
ఏపీలో ఎండలు...

Pages

Don't Miss