Tuesday, January 10, 2017 - 18:00

సంగారెడ్డి: ఓ వింత వ్యాధి ఆ గ్రామాన్ని వణికిస్తోంది. వింత వ్యాధితో అభం శుభం తెలియని చిన్నారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వింత లక్షణాలతో చిన్నారుల చేతి వేళ్లు వికారంగా మారుతుండడంతో ఇప్పుడా ఆగ్రామం భయంతో వణికిపోతుంది. ఇంతకీ ఆ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న ఆ వింత జబ్బేంటి ? వాచ్‌ దిస్‌ స్టోరీ.

సంగారెడ్డి జిల్లా శెల్గిరాలో వింతవ్యాధి...

Saturday, December 31, 2016 - 21:49

కరీంనగర్ : సీపీఎం తీసుకున్న సామాజిక న్యాయం ఎజెండాపై కేసీఆర్ ప్రభుత్వం భయపడిందని పేర్కొన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించామన్నారు. ప్రభుత్వంపై ప్రశ్నించాలనే చైతన్యం ప్రజల్లో వచ్చిందనీ. సీపీఎం మహాజన పాదయాత్ర విజయమని తెలిపేందరు ఇదే నిదర్శనమని తమ్మినేని పేర్కొన్నారు. అలాగే పాదయాత్ర సందర్భంగా కేసీఆర్ కు రాసిన లేఖలకు కూడా భారీగా ప్రభుత్వం...

Thursday, December 29, 2016 - 06:53

సంగారెడ్డి : మళ్లీ ముత్తూట్‌ ఫైనాన్స్‌లో భారీ లూటీ జరిగింది...ఇది జరగడం రెండోసారి... సంగారెడ్డి జిల్లాలో జరిగిన భారీ చోరీ కలకలం రేపుతోంది..సీబీఐ ఆఫీసర్లమంటూ వచ్చి తనిఖీలు చేస్తున్నట్లు చేస్తూనే లాకర్లలో కిలోల కొద్దీ బంగారాన్ని దోచుకెళ్లారు... అడ్డుకున్న సిబ్బందిపై మారణాయుధాలు గురిపెట్టి బెదిరించారు.. ఐదుగురు ఐదు నిమిషాల్లోనే మొత్తం లూటీ చేసి వెళ్లడం వెనక ఉన్న...

Wednesday, December 28, 2016 - 11:52

సంగారెడ్డి : జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. పట్టపగలే ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి చొరబడి భారీ దోపిడీ చేశారు. ఆర్సీపురం మండలం బీరంగూడ కమాన్ వద్ద ముంబాయి జాతీయ రహదారి పక్కనున్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయ సిబ్బందిని రివాల్వర్‌తో బెదిరించి కార్యాలయంలోని రూ.8 కోట్ల 22 లక్షల విలువైన బంగారం అపహరించుకుని పోయారు. స్కార్పియోలో ఐదుగురు దుండగులు వచ్చారని సిబ్బంది చెబుతున్నారు....

Sunday, December 18, 2016 - 06:31

సంగారెడ్డి : జిల్లా రామచంద్రాపురంలోని పెన్నారు పరిశ్రమ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో సీఐటీయూ ఘన విజయం సాధించింది. సమీప టీఆర్ఎస్ కేవీ అభ్యర్థి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై సీఐటీయూ అభ్యర్థి చుక్కారాములు 42 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సీఐటీయూ ఘన విజయంతో పెన్నారు పరిశ్రమ ముందు కార్మికులు సంబరాలు చేసుకున్నారు.

Wednesday, December 14, 2016 - 18:46

సంగారెడ్డి : పెద్దనోట్ల రద్దుతో సామాన్యుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. సామాన్యుని సాధారణ కష్టాలకు....ఇప్పుడు కరెన్సీ కష్టాలు తోడయ్యాయి. 36 రోజులు గడుస్తున్నా ఇక్కట్లు తీరకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో చిల్లర దొరక్క నానా అవస్థలు పడుతున్న సామాన్య ప్రజల కష్టాలపై ప్రత్యేక కథనం.

నెల దాటినా తీరని...

Wednesday, December 14, 2016 - 13:35

సంగారెడ్డి : జిల్లాలోని పటాన్ చెరు ఎస్ బీహెచ్ వద్ద తోపులాట జరిగింది. డబ్బుల కోసం పటాన్ చెరులోని ఎస్ బీహెచ్ వద్దకు భారీగా జనం తరలివచ్చారు. ఉదయం 6 గంటల నుంచి వందలాది మంది క్యూలో నిల్చున్నారు. అయితే బ్యాంక్ గేట్లు తెరవడంతో ఒక్కసారిగా జనం దూసుకెళ్లారు. దీంతో బ్యాంకు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈనేపథ్యంలో కిందపడి ఒకరికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

Pages

Don't Miss