Sunday, September 17, 2017 - 19:19

సంగారెడ్డి : కాలుష్య భూతం వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పచ్చని పల్లెల మధ్య పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో.. అక్కడి జనం ఊర్లను ఖాళీ చేసే పరిస్థితి నెలకొంది. ప్రశాంతమైన జీవనం కాస్తా.. పొగ కాలుష్యంతో పొగచూరిపోయింది. సంగారెడ్డి జిల్లా, కొండాపూర్‌ మండలంలోని కాలుష్య కారక పరిశ్రమలపై స్పెషల్ ఫోకస్. 

జనావాసాల మధ్య కాలుష్య కారక పరిశ్రమల్ని ఉంచబోమని.. మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన...

Saturday, September 16, 2017 - 15:42

సంగారెడ్డి : జిల్లాలోని తున్కల్‌ మండలం సుల్తాన్‌పూర్‌లోని జేఎన్ టీయూ వద్ద విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు తరగతులు బహిష్కరించి క్యాంపస్‌ ముందు నిరసన ర్యాలీ చేపట్టారు. 15 మంది విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ఆందోళనకు దిగారు. ప్రిన్సిపల్‌ ఈశ్వర ప్రసాద్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. 

 

Saturday, September 16, 2017 - 13:39

సంగారెడ్డి : అన్నా.. సోలో ఆంధ్రాకి అందగాడిని అంటూ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన నటుడు బాబుమోహన్‌ని ఇప్పటికి తెలుగు ప్రేక్షకులు మర్చిపోరు.. సినీ రంగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన చాలాకాలం టీడీపీలో పనిచేశారు. ఎమ్మెల్యేగా.. మంత్రిగా పదవులు నిర్వహించారు. గత ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా ఆందోల్ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు....

Monday, September 11, 2017 - 21:34

సంగారెడ్డి : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు చిన్నారుల పాలిట విలన్లుగా మారుతున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం- భారతినగర్‌లోని రావూస్‌ స్కూల్‌లో చిన్న తప్పుకు విద్యార్థినికి దారుణమైన పనిష్‌మెంట్ ఇచ్చారు. శనివారం యూనిఫాం వేసుకొని రాలేదంటూ పదకొండేళ్ల బాలికను అబ్బాయిల టాయ్‌లెట్‌ముందు నిలబెట్టారు.. గంటసేపు అక్కడే ఉన్న బాలిక... తీవ్ర మనో వేదనకు గురైంది....

Monday, September 11, 2017 - 19:08

సంగారెడ్డి : రావూస్‌ స్కూల్‌ ఘటనలో ప్రిన్సిపల్, పీఈటీపై ఆర్సీపురం పీఎస్‌లో కేసు నమోదైంది. ఐపీసీ 342, 324, 506, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉదయం రావూస్ స్కూల్ సిబ్బంది యూనిఫామ్ వేసుకురాలేదని విద్యార్థినిని.. టాయ్‌లెట్‌ వద్ద నిల్చోబెట్టారు. ఆ తరువాత నుంచి స్కూల్‌కు వెళ్లేందుకు చిన్నారి భయపడుతోంది. ఇంట్లోనే ఒంటరిగా ఉంటోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. 

Monday, September 11, 2017 - 15:45

సంగారెడ్డి : జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌ భూ కబ్జాలకు వ్యతిరేకంగా 15 గ్రామాల ప్రజలు పోరుబాట పట్టారు. తమకు న్యాయం చేయాలని బాధితులు సంగారెడ్డి కలెక్టరేట్‌ ముందు ధర్నాకు దిగారు. బాధిత రైతులకు సీపీఎంపార్టీతోపాటు, రైతు, వ్యవసాయ కార్మికసంఘం, కేవీపీఎస్‌ సంఘాలు మద్దతు తెలిపాయి. బీబీపాటిల్‌ భూ బాగోతాలపై సిట్టింగ్‌జడ్జితో విచారణ జరిపించాలని కోరుతున్న ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం...

Monday, September 11, 2017 - 13:02

సంగారెడ్డి : యూనిఫాం వేసుకురాలేదని స్కూల్ సిబ్బంది 5వ తరగతి విద్యార్ధినిని బాయిస్ టాయిలెట్‌లో గంట సేపు  నిలబెట్టిన ఘటనపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. స్కూలుకు నోటీసులు ఇవ్వమంటూ డిప్యూటీ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బీహెచ్ ఈఎల్ లోని రావూస్‌ హైస్కూల్‌లో ఓ విద్యార్ధిని యూనిఫాం వేసుకుని రాకుండా స్కూలుకు వచ్చింది. స్కూలు సిబ్బంది ఆమెను బాయిస్ టాయిలెట్‌లో గంటసేపు నిలబెట్టారు...

Monday, September 11, 2017 - 12:19

సంగారెడ్డి : యూనిఫాం వేసుకురాలేదని స్కూల్ సిబ్బంది ఓ విద్యార్ధినిని బాయిస్ టాయిలెట్‌లో గంట సేపు నిలబెట్టిన ఘటనపై ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. స్కూలుకు నోటీసులు ఇవ్వమంటూ డిప్యూటీ సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బీహెచ్ ఈఎల్ లోని రావూస్‌ హైస్కూల్‌లో ఓ విద్యార్ధిని యూనిఫాం వేసుకుని రాకుండా స్కూలుకు వచ్చింది. స్కూలు సిబ్బంది ఆమెను బాయిస్ టాయిలెట్‌లో గంటసేపు నిలబెట్టారు. దాంతో...

Monday, September 11, 2017 - 11:52

సంగారెడ్డి : బీహెచ్ ఈఎల్ రావూస్ హైస్కూల్ యాజమాన్యం నిర్వాకం బయటపడింది. యూనిఫాం వేసుకురాలేదని విద్యార్థినిని గంటసేపు బాయిస్ టాయిలెట్ లో నిలబెట్టారు. తీవ్ర మనస్తాపానికి లోనై విద్యార్థిని స్కూలుకు వెళ్లనని చెప్పింది. స్కూలులో విద్యార్థిని తల్లి బోధనేతర సిబ్బందిగా పని చేస్తోంది. తన కూతురికి జరిగిన అవమానంపై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడంతో స్కూలు...

Sunday, September 10, 2017 - 17:55

సంగారెడ్డి : జిల్లా పటాన్‌చెరులో ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 60 ప్రైవేట్‌ పాఠశాలలు పాల్గొన్నాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. గురుపూజోత్సవంలో ఎంఈవోలు, స్కూల్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ విలియమ్‌ జెమ్స్‌ వారి టీమ్‌తో పాటు సభ్యులు, టీచర్లు పాల్గొన్నారు.

Sunday, September 10, 2017 - 17:52

సంగారెడ్డి : జిల్లా కొల్లూరులో చెరువు ఆక్రమణ కేసును అధికారులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. యశోద ఆస్పత్రికి చెందిన కొందరు వ్యక్తులు చెరువుశిఖం భూములను ఆక్రమించి రోడ్లు వేస్తున్నా.. అధికారుల పట్టించుకోవడం లేదంటున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే స్థానిక తహశీల్దార్‌, ఇతర అధికారులు కబ్జాదారులపై చర్యలు తీసుకోవడం లేదని కొల్లూరు గ్రామస్తులుతో...

Pages

Don't Miss