Sunday, September 10, 2017 - 17:55

సంగారెడ్డి : జిల్లా పటాన్‌చెరులో ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 60 ప్రైవేట్‌ పాఠశాలలు పాల్గొన్నాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. గురుపూజోత్సవంలో ఎంఈవోలు, స్కూల్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ విలియమ్‌ జెమ్స్‌ వారి టీమ్‌తో పాటు సభ్యులు, టీచర్లు పాల్గొన్నారు.

Sunday, September 10, 2017 - 17:52

సంగారెడ్డి : జిల్లా కొల్లూరులో చెరువు ఆక్రమణ కేసును అధికారులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. యశోద ఆస్పత్రికి చెందిన కొందరు వ్యక్తులు చెరువుశిఖం భూములను ఆక్రమించి రోడ్లు వేస్తున్నా.. అధికారుల పట్టించుకోవడం లేదంటున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే స్థానిక తహశీల్దార్‌, ఇతర అధికారులు కబ్జాదారులపై చర్యలు తీసుకోవడం లేదని కొల్లూరు గ్రామస్తులుతో...

Saturday, September 9, 2017 - 08:35

సంగారెడ్డి : ప్రముఖ జర్నలిస్టు, రచయిత గౌరీ లంకేశ్ దారుణ హత్యకు నిరసనగా సంగారెడ్డిలో జర్నలిస్టులు, పలు ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. గౌరీ లంకేశ్ హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు. 

 

Friday, September 8, 2017 - 16:35

సంగారెడ్డి : బీబీ పాటిల్‌... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ ఎంపీగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజా సేవ చేస్తానని ఎంతో వినమ్రంగా చెబితే.. ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు. పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని నమ్మపలికారు. కరవు నివారించి, వలసలను అరికడతానని ఊదరగొట్టారు. మూడేళ్లు గడిచిపోయినా...

Thursday, September 7, 2017 - 16:33

సంగారెడ్డి : ఎంపీ బీబీ పాటిల్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని, బోర్గిలో రైతుల నుండి నేరుగా భూములు కొనుగోలు చేయలేదని పాటిల్ కన్ స్ట్రక్షన్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అధికారులు వెల్లడించారు. వీరు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ రసాభాస అయ్యింది. ప్రెస్ మీట్ లో బయటి వ్యక్తులు వచ్చి ఎలా ఫొటోలు..వీడియోలు తీస్తారంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తాము ప్రెస్ మీట్ ను బహిష్కరిస్తున్నట్లు...

Thursday, September 7, 2017 - 07:57

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా... కంగ్టి మండలంలో భూ దందా వెలుగులోకి వచ్చింది. కొంతమంది పెద్దలు మూడు వేల ఎకరాలకుపైగా పేదల భూములను కబ్జా చేశారు. బడుగు పేద రైతుల నుంచి...భూములు లాక్కున్నారు. ఇందులో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ హస్తం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీబీ పాటిల్‌ అండతోనే కొంతమంది తమ భూములను సొంతం చేసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఢిల్లీకి చెందిన శర్మ అనే...

Wednesday, September 6, 2017 - 15:53

సంగారెడ్డి : కంగ్టి మండలంలో భూ దందా వెలుగులోకి వచ్చింది. కొంతమంది పెద్దలు 3 వేల ఎకరాలకు పైగా పేదల భూములను కబ్జా చేశారు. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌కు చెందిన కొందరు వ్యక్తులు పేద రైతుల భూముల్లో... నిర్మాణాలకు పూనుకుంటున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలు కోసం వీడియో చూడండి.

Wednesday, September 6, 2017 - 13:38

సంగారెడ్డి : పేదల భూములపై పెద్దలు పంజా విసురుతుండడం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం సంగారెడ్డిలో మూడు వేల ఎకరాల స్థలం వివాదాస్పదమౌతోంది. ఎంపీ బీబీ పాటిల్ అనుచరులపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంగ్టి మండలంలో రైతులకు చెందిన మూడు వేల ఎకరాలను ఢిల్లీకి చెందిన శర్మ కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాడు. ఎకరానికి రూ. 40 వేలు చొప్పున ఇస్తానని..అడ్వాన్స్ గా రూ. 10వేలు చెల్లిస్తానని..పూర్తి...

Sunday, September 3, 2017 - 10:55

సంగారెడ్డి : జిల్లాలో రూ. 100 కోట్ల విలువైన భారీ కుంభకోణం వెలుగుచూసింది. కోట్ల రూపాయల విలువైన కొల్లూరు చెరువును అప్పనంగా నొక్కేసేందుకు హైదరాబాద్‌కు చెందిన కొందరు భూబకాసురులు రంగంలోకి దిగారు. కొల్లూరు గ్రామంలో కొన్ని భూములను కొనుగోలు చేసిన... ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి చెందిన యజమానులు సురేందర్‌రావు, దేవేందర్‌రావు రోడ్డు నిర్మాణం పేరుతో... చెరువును కబ్జా చేసేందుకు యత్నించారు....

Saturday, September 2, 2017 - 09:45

సంగారెడ్డి : జిల్లా ఆందోల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు కోపం వచ్చింది. రైతు సమన్వయ కమిటీల ఏర్పాటుపై పుల్కల్‌ మండలం చౌటుకూర్‌లో జరిగిన అవగాహన సదస్సులో అన్నదాతలపై ఆగ్రహంతో ఊగిపోయారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధినన్న విషయం మర్చిపోయి బూతు పురాణం లంకించుకున్నారు. తాను వేషం వేసి నటిస్తే డబ్బులిస్తారని, మీరేమిస్తారంటూ రైతులను ప్రశ్నించారు.

Friday, September 1, 2017 - 21:56

సంగారెడ్డి : జిల్లాలోని ఆందోల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు కోపం వచ్చింది. రైతు సమన్వయ కమిటీల ఏర్పాటుపై పుల్కల్‌ మండలం చౌటుకూర్‌లో జరిగిన అవగాహన  సదస్సులో అన్నదాతలపై ఆగ్రహంతో ఊగిపోయారు.  బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధినన్న విషయం మర్చిపోయి బూతు పురాణం లంకించుకున్నారు. తాను వేషం వేసి నటిస్తే డబ్బులిస్తారని, మీరేమిస్తారంటూ రైతులను ప్రశ్నించారు.
 

Pages

Don't Miss