Monday, November 6, 2017 - 17:30

మెదక్ : సింగూరు డ్యామ్ 15 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్ కు విడుదల చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. అందులో కొన్ని టీఎంసీల నీటిని ఇప్పటికే విడుదల చేసింది. సింగూర్ ప్రాజెక్టు స్టోరేజ్ 29 టీఎంసీలగా ఉందనే విషయం తెలిసిందే. దీనిపై టి.కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద టి.కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి..కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ...

Monday, November 6, 2017 - 17:29

సంగారెడ్డి : అమీన్ పూర్ వందనపురి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అరవింద క్లాసిక్ అపార్ట్ మెంట్ లో పక్క ప్లాట్ లో ఉన్న వారిపై ఓ వ్యక్తి కెమికల్ ప్రయోగం చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు..ఒక బాబుకు గాయాలయ్యాయి.

అపార్ట్ మెంట్ లో నరసింహరావు సోసైటీ ప్రెసిడెంట్ గా ఉండేవాడు. ఇటీవలే ఓ వివాదంలో నరసింహరావు ప్రెసిడెంట్ నుండి తొలగించారు. దీనితో అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ఓ...

Sunday, November 5, 2017 - 13:55

సంగారెడ్డి : ఉదయం లేచింది మొదలు వాళ్ల కళ్లు ఖాజీ స్థలాల కోసం వెదుకుతాయి. జాగా కనిపిస్తే చాలు అడ్డంగా కబ్జా చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ స్థలాలే కాదు.. చెరువులు, కాలువలను సైతం వదలరు. అధికారుల అండదండలతో వీరి అక్రమాలకు అడ్డూ అదుపే లేదు. అయితే... భూకబ్జాదారుల అక్రమాలపై తెర్లాపూర్‌ గ్రామస్తులు స్పందించారు. అందరూ ఏకమై ఎన్జీటీని ఆశ్రయించారు. కబ్జాదారుల చెరలో ఉన్న భూములను విడిపించడమే...

Saturday, November 4, 2017 - 21:20

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. తెల్లవారు జామునుంచే శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తాయి. కార్తీక స్నానాలు, కార్తీక పూజలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్‌- ఎల్‌బీ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటల...

Thursday, October 26, 2017 - 18:46

సంగారెడ్డి : ఆందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్‌ తీరుపై సంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు మండిపడుతున్నారు. రెవెన్యూ అధికారులతో టెన్ టివి ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. మూడురోజుల క్రితం పుల్కల్ ఎమ్మెర్వోపై బాబుమోహన్ నోరు పారేసుకోవడాన్ని వారు తప్పుపట్టారు. అందుకు నిరసనగా జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ అధికారులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. బాబుమోహన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని...

Wednesday, October 25, 2017 - 18:09

సంగారెడ్డి : ఆందోల్‌ ఎమ్మెల్యే బాబు మోహన్‌ పై వెంటనే చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేనిఎడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పూనుకుంటామని ఉద్యోగులు హెచ్చరించారు. బాబు మోహన్‌ ఎమ్మార్వోపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు సంగారెడ్డి కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపట్టారు. ఈమేరకు ఉద్యోగులతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఉద్యోగుల పట్ల పదే పదే...

Wednesday, October 25, 2017 - 14:34

సంగారెడ్డి : జిల్లా జోగిపేటలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని బీఈడీ విద్యార్థులు అడ్డుకున్నారు. టీఆర్ టీ తమకు అవకాశమివ్వాలని వారు డిమాండ్ చేశారు. వినతపత్రం ఇచ్చేందుకు విచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Tuesday, October 24, 2017 - 18:04

సంగారెడ్డి : జిల్లాలోని నానల్‌కల్ మండలంలోని మామిడ్గి గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. నిమ్జ్‌ కోసం రైతుల వద్ద నుండి భూములు సేకరించేందుకు నిర్వహించిన గ్రామసభకు.. జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ పరశురాం, ఆర్డీవో అబ్దుల్లా హాజరయ్యారు. తాము నిమ్జ్‌ కోసం భూములు ఇచ్చేది లేదని.. రెండు రకాల పంటలు పండిస్తామని రైతులు చెప్పారు. తాము అడిగే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పకపోవడంతో రైతులు...

Pages

Don't Miss