Sunday, December 18, 2016 - 06:31

సంగారెడ్డి : జిల్లా రామచంద్రాపురంలోని పెన్నారు పరిశ్రమ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో సీఐటీయూ ఘన విజయం సాధించింది. సమీప టీఆర్ఎస్ కేవీ అభ్యర్థి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై సీఐటీయూ అభ్యర్థి చుక్కారాములు 42 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సీఐటీయూ ఘన విజయంతో పెన్నారు పరిశ్రమ ముందు కార్మికులు సంబరాలు చేసుకున్నారు.

Wednesday, December 14, 2016 - 18:46

సంగారెడ్డి : పెద్దనోట్ల రద్దుతో సామాన్యుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. సామాన్యుని సాధారణ కష్టాలకు....ఇప్పుడు కరెన్సీ కష్టాలు తోడయ్యాయి. 36 రోజులు గడుస్తున్నా ఇక్కట్లు తీరకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో చిల్లర దొరక్క నానా అవస్థలు పడుతున్న సామాన్య ప్రజల కష్టాలపై ప్రత్యేక కథనం.

నెల దాటినా తీరని...

Wednesday, December 14, 2016 - 13:35

సంగారెడ్డి : జిల్లాలోని పటాన్ చెరు ఎస్ బీహెచ్ వద్ద తోపులాట జరిగింది. డబ్బుల కోసం పటాన్ చెరులోని ఎస్ బీహెచ్ వద్దకు భారీగా జనం తరలివచ్చారు. ఉదయం 6 గంటల నుంచి వందలాది మంది క్యూలో నిల్చున్నారు. అయితే బ్యాంక్ గేట్లు తెరవడంతో ఒక్కసారిగా జనం దూసుకెళ్లారు. దీంతో బ్యాంకు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈనేపథ్యంలో కిందపడి ఒకరికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

Tuesday, December 13, 2016 - 14:09

సంగారెడ్డి : 'రూ.4వేలు ఇస్తే ఏం చేసుకోవాలి ? పిల్లల ఫీజులు..సరుకులు..ఇతరత్రా ఎలా తెచ్చుకోవాలి ? తమ డబ్బు తీసుకోవాలంటే ఇన్ని నిబంధనలు పెడుతరా' అంటూ ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి ఎస్ బీహెచ్ వద్ద ఖాతాదారులు ధర్నా నిర్వహించారు. గత మూడు రోజుల నుండి బ్యాంకులకు సెలవు కావడంతో మంగళవారం ఉదయం బ్యాంకు వద్దకు భారీగా ప్రజలు చేరుకున్నారు. కేవలం రూ. 4వేలు ఇస్తామని బ్యాంకు...

Tuesday, December 13, 2016 - 13:04

సంగారెడ్డి : ఎస్బీహెచ్ బ్యాంక్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. మూడు రోజులు బ్యాంకులకు సెలవు కావడంతో ఖాతాదారులు బ్యాంకుకు భారీగా వచ్చారు. 4 వేల రూపాయలే ఇస్తామని బ్యాంకులో బోర్డు పెట్టడంతో..ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు ముందు బైఠాయించి , కనీసం 10 వేల రూపాయలైనా ఇవ్వాలని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Tuesday, December 13, 2016 - 11:32

సంగారెడ్డి : పెద్ద నోట్ల రద్దుతో పల్లె కన్నీరు పెడుతోంది. యాసంగి పంటను నమ్ముకున్న రైతన్నలు పెట్టుబడికి డబ్బులు లేక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బ్యాంకులు, ఏటీఎంలలో మనీ లేకపోవడంతో అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై సంగారెడ్డి జిల్లాలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరింత సమాచారానికి వీడియో చూడండి..

Monday, December 12, 2016 - 14:11

వర్ద...అంటే ఏమిటీ ? ఈ పేరు ఎందుకు పెట్టారు..ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. చెన్నైలో 'వార్దా' తుపాన్ బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తీవ్ర తుపాను చెన్నై తీరాన్ని దాటింది. దీనితో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తుపాన్ లు ఏర్పడిన సమయంలో కొన్ని పేర్లు పెడుతుంటారు. రౌనా, హుద్ హుద్, లైలా, పైలిన్, లెెహెర్, హెలిన్, నీలం వంటి పేర్లు పెట్టారు. తాజాగా 'వర్ద'...

Monday, December 12, 2016 - 07:36

నారాయణ్ ఖేడ్ :  క్కడ ఏ ఎన్నికలు లేవు.. నాయకుల ప్రచారాలు అంతకంటే లేవు.. అయినా అక్కడ పెద్దపెద్ద ఫ్లెక్సీలు, కటౌట్‌లు దర్శనమిస్తున్నాయి. రోడ్డు, చౌరస్తాలు అనే తేడాలేకుండా గులాబీ బ్యానర్లు వెలిశాయి. ఇంతకీ   ఎక్కడా ఆ ఫ్లెక్సీల హడావుడి... ఎందుకా బ్యానర్ల బారు...  తెలుసుకోవాలంటే  ఈ స్టోరీ చూడాల్సిందే.. మెయిన్‌రోడ్డు, గల్లీలు అనే తేడాలేదు. రోడ్డు కనిపిస్తే చాలు.. ఇరువైపుల ఫ్లెక్సీలతో...

Sunday, December 11, 2016 - 18:00

సంగారెడ్డి : పెద్దనోట్ల రద్దు తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పరిస్ధితులు దారుణంగా మారిపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని ఆరువేల జనాభా గల ఫసల్ వాడి గ్రామంలో బ్యాంకు కానీ, ఏటీఎం లేకపోవడంతో గ్రామస్తుల ఆర్థిక పరిస్థితులు దుర్భరంగా మారాయి. డబ్బుల కోసం పడరాని పాట్లు పడుతున్న ఫసల్ వాడి గ్రామస్తులు టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Pages

Don't Miss