Monday, December 25, 2017 - 11:25

సిద్ధిపేట : జిల్లాలోని కోమటి చెరువుపై మంత్రి హరీష్ రావ్ సోమవారం మార్నింగ్ వాక్ చేశారు. చెరువును మినీ ట్యాంక్ బండ్ లాగా మారుస్తున్నారు. దీనికి సంబంధించి పనులను ఆయన సందర్శించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ ఛైర్మన్ కు సూచించారు. చెరువు పరిసరాల్లో చెత్తా..చెదారం పేరుకపోవడాన్ని గ్రహంచిన మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Monday, December 25, 2017 - 06:29

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు మిన్నంటాయి. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో పండగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్‌కు కొన్ని గంటల ముందు నుంచే అంతటా సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సమేతంగా క్రైస్తవులు క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. క్రీస్తు జన్మదినం సంధర్భంగా క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు....

Tuesday, December 19, 2017 - 09:07

సిద్దిపేట : జిల్లా అక్కన్న పేట మండలం తురుకవాణికుంటులో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ముగ్గురు మృతి చందారు. మృతి చెందిన వారిలో తండ్రి భగవాన్ రెడ్డి, కూతురు రోజా, కొడుకు రాజు ఉన్నారు. భార్య రాజవ్వ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Monday, December 4, 2017 - 21:29

సిద్దిపేట : ఉస్మానియూ యూనివర్సిటీలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన ఎమ్మెస్సీ విద్యార్థి మురళి అంత్యక్రియలు ముగిశాయి. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలంలోని మురళి స్వగ్రామమైన దౌలాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గ్రామస్థులు, మృతుని బంధువులు మినహా ఇతరులెవ్వరినీ గ్రామంలోకి పోలీసులు...

Monday, December 4, 2017 - 12:37

సిద్ధిపేట : నిన్న ఓయూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళీ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం దౌలాబాద్‌కు తరలించారు. ఈసందర్భంగా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ ఎంసీఏ విద్యార్థి మురళీ నిన్న ఓయూ హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  

 

Tuesday, November 28, 2017 - 07:03

సిద్దిపేట : తెలంగాణలో ప్రజా వంచన పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. సామాజిక తెలంగాణ-సమగ్రాభివృద్ధికై చాడ వెంకటరెడ్డి చేపట్టిన పోరుబాట యాత్ర సిద్దిపేట చేరిన సందర్భంగా పట్టణంలో సభ నిర్వహించారు. డబుల్‌ బెడ్‌ రూము ఇళ్లు, లక్షల ఉద్యోగాల...

Friday, November 24, 2017 - 17:25

సిద్దిపేట : జిల్లా కొండపాక మండలం దుద్దెడ శివారులో శిక్షణ విమానం కూలిపోయింది. ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఎయిర్‌ క్రాఫ్ట్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఇద్దరు పైలెట్లు పారాచూట్ల సాయంతో కిందకు దూకారు. చిన్నచిన్న గాయాలతో పైలెట్లు తప్పించుకోలిగారు. హకీంపేట నుంచి వస్తున్న ఈ శిక్షణా విమానం గాలిలోనే పేలినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్సనిమిత్తం...

Pages

Don't Miss