Thursday, June 15, 2017 - 08:41

సిద్దిపేట : కుకునూర్‌పల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసు విచాణలో ఎవరూ ఊహించని ట్విస్ట్‌ బయటకు వచ్చింది. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో ఆత్మహత్య చేసుకున్న బ్యూటీషియన్‌ శిరీషతో ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డికి సంబంధం ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

శిరీష ఆత్మహత్యకు కారణం..
ఆదివారం నాడు స్నేహితులు శ్రవణ్‌, రాజీవ్‌లతో కలిసి కుకునూర్‌పల్లి వెళ్లిన శిరీష...

Wednesday, June 14, 2017 - 21:22

సిద్ధిపేట : కుకునూరుపల్లి పీఎస్‌కు వచ్చిన ఎస్సై ప్రభాకర్‌రెడ్డి భార్య రచన..కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శిరీషతో తన భర్తకు సంబంధం లేదన్నారు. పూర్తిగా నిర్ధారణ అయ్యే వరకు తన భర్త మృతదేహాన్ని తీసుకెళ్లనని రచన తేల్చిచెప్పారు.

Wednesday, June 14, 2017 - 19:01

సిద్ధి పేట: కుకునూరు పీఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారుల వేధింపులవల్లే ఎస్సై ఆత్మహత్య చేసుకున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ ఓ మీడియా వాహంనపై దాడికి పాల్పడ్డారు. సిద్దిపేట సీపీ శివశంకర్‌, గ‌జ్వేల్‌ ఏసీపీ గిరిధర్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వారిద్దరి పై చర్యలు తీసుకున్నాకే ఎస్సై మృతదేహాన్ని తరలించాలని...

Wednesday, June 14, 2017 - 16:04

సిద్దిపేట: జిల్లాలో మరో ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అధికార వేధింపులే కారణమని ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితం ఇదే స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి కూడా ఇలాగే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొన్న దుబ్బాక ఎస్సై చిట్టిబాబు కూడా...

Tuesday, June 13, 2017 - 15:31

సిద్దిపేట : జిల్లా కేంద్రం.. కల్వకుంటా కాలనీలో విషాదం చోటు చేసుకుంది. మిషన్‌ భగిరథ పనుల కోసం తీసిన గుంతలో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 20 రోజులు క్రితం పైపులైన్‌ కోసం తవ్విన గుంతలోపడి ఆరేళ్ల షాభన బేగం, మూడేళ్ల జోయా బేగం మృతి చెందారు. కాగా కాలువ తీసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. 

Sunday, June 11, 2017 - 21:39

సిద్దిపేట : సిద్దిపేటలో పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌రావు..ముస్లిం పిల్లలు చదువుకోసం 400 కోట్లతో 200 మైనార్టీ పాఠశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పేదలకోసం 2 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నామని.. పైరవీలకు లంచాలకు తావు లేకుండా నిరుపేదలను గుర్తించి పంపిణీ చేస్తామన్నారు. రంజాన్‌ పండగ...

Wednesday, June 7, 2017 - 20:00

ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయయన్నది అవాస్తవం అని జెవివి నేత రమేష్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బహుళ దేశ కంపెనీలు, మతోన్మాద శక్తులు ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చైనాపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Monday, June 5, 2017 - 08:41

సిద్దిపేట : తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములు లాక్కొంటోందని కాంగ్రెస్‌, లెప్ట్‌, ప్రజాసంఘాల నేతలు ఆరోపించారు. దేశానికి అన్నంపెట్టే రైతుల పొట్టగొట్టి... బడాబాబుల జేబులు నింపేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అరాచక పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రజలే మట్టుబెడతారని హెచ్చరించారు. మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులు చేపట్టిన దీక్షలకు ఏడాది...

Thursday, June 1, 2017 - 10:35

హైదరాబాద్ : తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. అందులో ఎంతవరకూ విజయవంతమైంది? మూడేళ్ల పాలనలో రైతులకు ఏం చేసింది? వ్యవసాయానికి అందిన సాయమెంత? సిఎం కేసీఆర్‌ హామీలు ఎంతవరకూ అమలయ్యాయి? 10 TV ప్రత్యేక కథనం.. తెలంగాణ ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటి వరకు పదిహేడు వందల ఇరవై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో...

Thursday, May 25, 2017 - 20:05

సిద్దిపేట : సిద్ధిపేట జిల్లా కేంద్రానికి చెందిన సంతోషి అనే డిగ్రీ విద్యార్ధిని మరణం సంచలనంగా మారింది. ఆమె మృతికి పద్మావతి అనే మహిళ కారణమంటూ సంతోషి కుటుంబ సభ్యులు, విద్యార్ధులు సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. నిందితుల్ని శిక్షించాలంటూ నినాదాలు చేశారు. తల్లితండ్రులు లేని సంతోషి టీచర్‌గా పనిచేస్తున్న పద్మావతి అనే మహిళ ఇంట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో తీవ్ర అస్వస్థతకు...

Pages

Don't Miss