Sunday, March 12, 2017 - 18:53

హైదరాబాద్ : రంగుల కేళీ హోలీ.. మరోసారి తెలంగాణలో సందడి చేసింది. చిన్నపిల్లల దగ్గరి నుంచి ముసలివారి వరకు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. రాజ్‌ భవన్‌లో జరిగిన సంబరాల్లో గవర్నర్ దంపతులతో పాటు... నేతలు పాల్గొని సందడి చేశారు. రాజ్‌భవన్‌లో హోలీ సంబరాలు ఉత్సాహంగా సాగాయి. గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సంబరాలు ప్రారంభించారు. గవర్నర్‌ అందరికీ రంగులు...

Friday, March 10, 2017 - 19:08

సిద్దిపేట : దుబ్బాకలో సినీనటి సమంత సందడిచేశారు. చేనేత సహకార సంఘాన్ని సందర్శించారు. చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలను పరిశీలించారు. తాను అధికారికంగా ఇక్కడకు రాలేదన్న ఈ హీరోయిన్‌... కొన్ని చేనేత వస్త్రాలను శాంపిల్‌గా తనవెంట తీసుకువెళ్లారు.. 

Tuesday, March 7, 2017 - 17:32

సిద్ధిపేట : వచ్చేనెల చివరివరకు నాలుగోవిడత రుణమాఫీ పూర్తిచేస్తామన్నారు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు. సాదాబైనామ కార్యక్రమం ద్వారా రైతులకు పైసా ఖర్చు లేకుండా పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో.. రామసముద్రం చెరువు కట్టను మినీ ట్యాంక్‌ బండ్‌గా ఏర్పాటు చేస్తున్న పనులను మంత్రి పరిశీలించారు...

Monday, March 6, 2017 - 21:26

హైదరాబాద్: గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ప్రజాప్రతినిధులు, అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాల మంజూరు బాధ్యత తాను తీసుకుంటానని... వాటి అమలు బాధ్యతను స్వీకరించాలని కోరారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కార బాధ్యతల్ని శాఖలవారీగా అధికారులకు అప్పగించారు.

విద్యుత్...

Friday, March 3, 2017 - 15:55

సిద్దిపేట : దుబ్బాకలో ఎస్సై చిట్టిబాబు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సర్వీస్‌ రివాల్వర్‌తో భార్యను కాల్చి తాను కూడా కాల్చుకున్నాడు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా..  ఎస్‌ఐ చిట్టిబాబు పరిస్థితి విషమంగా ఉంది. చిట్టిబాబును ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Thursday, March 2, 2017 - 16:38

హైదరాబాద్ : డబుల్ బెడ్ రూం. ఇది ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కడికి వెళ్లినా చెబుతున్న మాట. ఎక్కడ ఏ సమావేశం జరిగినా, ఏవర్గంతో సమావేశమైనా ఆయా వర్గాలకు డబుల్ బెడ్ రూంలలో కోటా ఇస్తామంటూ ఆశ పెడుతున్నారు. కానీ, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాల విషయంలో క్షేత్ర స్థాయి వాస్తవాలు మరో రకంగా వున్నాయి. ఈ అంశంపై స్పెషల్ ఫోకస్..
కరీంనగర్ లో..
ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న...

Wednesday, March 1, 2017 - 20:47
Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Sunday, February 26, 2017 - 07:23

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో స్వచ్ఛ ఆటోల నిర్వహణ వ్యవస్థ పడకేసింది. విధుల్లో ఉండాల్సిన ఆటోలు... ఇతర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించాల్సిన ఆటోవాలాలు... విధులకు సక్రమంగా హాజరుకావడం లేదు. ప్రతిరోజూ విధుల్లో ఉండాల్సిన 2 వేల ఆటోల్లో... కేవలం 15 వందల ఆటోలు మాత్రమే విధుల్లో కనిపిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బల్దియా స్వచ్ఛ ఆటో...

Pages

Don't Miss