Thursday, January 19, 2017 - 16:41

సిద్ధిపేట : ట్రాఫిక్‌ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు కొత్త రకమైన శిక్ష వేశారు. ట్రాఫిక్స్‌ రూల్స్‌ పాటించని యువకులను అదుపులోకి తీసుకుని.. కౌన్సెలింగ్‌ నిర్వహించి.. వారిని ట్రాఫిక్‌ వాలంటీర్‌గా మారుస్తున్నారు. దీంతో వారు కొన్ని గంటలపాటు వాహనాలపై వెళ్లే  వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనల గురించి.. భద్రత గురించి...

Sunday, January 15, 2017 - 15:13

సిద్ధిపేట : జిల్లాలోని హుస్నాబాద్ మండలం పొట్లపల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయంలో అగ్నిగుండాల కార్యక్రమం ఘనంగా జరిగింది. కనుమ పండుగ సందర్భంగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. సెగలు కక్కుతున్న నిప్పులపై నడుస్తూ మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి కళ్యాణోత్సవం, అగ్నిగుండాలు వేయడం ఆనవాయితీగా...

Sunday, January 8, 2017 - 15:57

సిద్ధిపేట : వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సిద్ధిపేట లోని మోహినిపుర వెంకటేశ్వర ఆలయంలో మంత్రి హరీష్‌రావు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయసిబ్బంది మంత్రి హరీష్‌రావుకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేకుమజాము నుంచే ఆలయానికి బారులు తీరారు. 

 

Thursday, January 5, 2017 - 12:48

సిద్ధిపేట : చిన్న చిన్న విషయాలకే విద్యార్థినీ, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారనే దానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకునే ఘటన సిద్ధిపేట జిల్లాలో జరిగింది. పుల్లూరులోని సాయి చైతన్య కళాశాలలో సీఈసీ ఇంటర్ చదువుతున్న భవానీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం కళాశాలకు వచ్చిన భవాని భవనంపైకి ఎక్కి దూకి ఆత్మహత్యకు చేసుకుంది. భవానీతో కలిసి చదువుకుంటున్న మరో...

Sunday, January 1, 2017 - 21:31

సిద్ధిపేట : నగదు రహిత లావాదేవీల్లో సిద్దిపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపుతామని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 100శాతం నగదు రహిత లావాదేవీల కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ఇవాళ సిద్ధిపేటలో మహిళా సంఘాలకు ఉచితంగా మినీ ఏటీఎంలు పంపిణీ చేశారు. అంతకుముందు సిద్ధిపేట పోలీస్‌ కమిషనరేట్‌లో హ్యాక్‌ఐ యాప్‌ను ప్రారంభించారు.

సిద్దిపేట...

Thursday, December 29, 2016 - 15:56

సిద్దిపేట : అసెంబ్లీలో సీపీఎంపై సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు బాధకరమన్నారు.. సిద్ధిపేట్‌ జిల్లా పార్టీ కార్యదర్శి మల్లారెడ్డి.. 2013 భూసేకరణ చట్టం ఉన్నప్పటికీ మళ్లీ కొత్త చట్టం తేవాల్సిన అవసరం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. ప్రజలను ఇబ్బందిపెట్టేలాఉన్న ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. కేసీఆర్‌ కామెంట్స్‌కు నిరసనగా సిద్ధిపేట్‌ పాత బస్టాండ్‌ దగ్గర పార్టీ...

Sunday, December 25, 2016 - 17:42

సిద్దిపేట : జిల్లాలోని ప్రజలకు మంత్రి హరీశ్‌రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని సీఎస్‌ఐ చర్చిలోని క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్‌చేసి...శుభాకాంక్షలు చెప్పారు. 

Friday, December 23, 2016 - 15:49

సిద్దిపేట : ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్త గ్రామాలు రెండూ సంపూర్ణ నగదు రహిత గ్రామాలయ్యాయి. స్వయంగా సీఎం కేసీఆర్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.  ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నసీఎం.. నగదు రహిత లావాదేవీల అమలులో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామాలు స్వయం సహాయకంగా మారాలని సూచించారు. 
ఎర్రవల్లి, నర్సన్నపేటలలో...

Thursday, December 22, 2016 - 18:46

సిద్ధిపేట : కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ ఆందోళనబాట పట్టారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్‌ చేస్తూ "బతుకుపోరు పాదయాత్ర'' పేరుతో గజ్వేల్‌ నుంచి సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వరకు పాదయాత్రగా బయలుదేరారు. రెగ్యులరైజేషన్‌పై ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా...సీఎం మా సమస్యలను పట్టించుకోలేదని.. దీంతో ఈ పాదయాత్ర మొదలుపెట్టామని.. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కొప్పిశెట్టి సురేష్‌ అన్నారు....

Wednesday, December 14, 2016 - 18:46

సంగారెడ్డి : పెద్దనోట్ల రద్దుతో సామాన్యుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. సామాన్యుని సాధారణ కష్టాలకు....ఇప్పుడు కరెన్సీ కష్టాలు తోడయ్యాయి. 36 రోజులు గడుస్తున్నా ఇక్కట్లు తీరకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో చిల్లర దొరక్క నానా అవస్థలు పడుతున్న సామాన్య ప్రజల కష్టాలపై ప్రత్యేక కథనం.

నెల దాటినా తీరని...

Pages

Don't Miss