Friday, November 25, 2016 - 06:36

హైదరాబాద్ : పెద్దనొట్ల రద్దు అంశం ఆర్టీసీపై తీవ్ర ప్రభావాన్నిచూపుతోంది. అసలే నష్టాలతో నడుస్తోన్న సంస్ధలకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. మోదీ తీసుకున్న నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీలకు అక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. దీంతో ఉహించని రీతిలో ఆర్టీసీలు నష్టాలు చవిచూస్తున్నాయి. 500,1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా...

Thursday, November 24, 2016 - 06:42

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని తేలిపోయింది. రాజ్యసభ సాక్షిగా కేంద్రమంత్రి హన్సరాజ్‌ ప్రకటన చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉన్నప్పటికీ.. డీ-లిమిటేషన్‌ చట్టం ప్రకారం 2026 వరకు సంఖ్య పెంచలేమని కేంద్రం స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల పెంపు ఉంటుందని ఆశపడుతున్న తెలంగాణ రాజకీయ నేతలపై...

Sunday, November 20, 2016 - 21:26

హైదరాబాద్ : పాత నోట్లు చెల్లవు.. కొత్త నోట్లు అందుబాటులో లేవు. బ్యాంకులు బంద్. ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకుందామంటే.. చాంతాడంత క్యూలైన్లు. పన్నెండు రోజులవుతున్నా.. ఇదే పరిస్థితి. ఇటు.. పెద్ద నోట్లను ఎవరూ తీసుకోకపోవడం..అటు... కొత్త నోట్లకు చిల్లర లభించకపోవడంతో... సామాన్యులు, పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త నోట్ల కోసం జనం ఇంకా ఏటీఎంల ముందు భారీగా...

Thursday, November 17, 2016 - 17:47

సిద్ధిపేట : ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు మంత్రి మంత్రి హరీశ్‌రావు పాదయాత్ర చేపట్టారు. నగరంలోని గాంధీ సెంటర్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ధోబిగాల్లి, బారఇమాం, కమాన్‌ చేపల బస్తీల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Thursday, November 17, 2016 - 17:28

సిద్ధిపేట : పెద్దనోట్ల రద్దు తమ పాలిట శాపంగా మారిందని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడు రాష్ట్రాల రైతులు హాజరయ్యే సిద్ధిపేట జిల్లా కంకోల్‌ సంత ఎవరూ లేక వెలవెలబోతోంది. చిల్లర లేక పశువుల అమ్మకం, కొనుగోళ్లు ఆగిపోయాయని రైతులు చెబుతున్నారు. ఎడ్లకు మేతాలేదు..మాకు తిండీలేదని పశువుల వ్యాపారులు వాపోతున్నారు. నాయకులు తయారుచేసిందే నల్లధనమని ఓ వ్యాపారి మండిపడ్డాడు....

Wednesday, November 16, 2016 - 09:48

సిద్ధిపేట : జిల్లాలో విషాదం నెలకొంది. మిర్‌దొడ్డి మండంలోని ధర్మారంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Sunday, November 13, 2016 - 14:35

సిద్ధిపేట : తెలంగాణలోని పప్పు దినుసులను కేంద్రప్రభుత్వ సంస్థలతో కొనుగోలు చేపట్టాలని కేంద్రానికి మంత్రి హరీష్‌రావు లేఖ రాశారు. రెండో పంట ఖర్చుల కోసం బ్యాంకుల నుంచి విత్‌ డ్రాల పరిమితి పెంచాలని కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గోదాముల నిర్మాణ పనులను మంత్రి హరీష్‌రావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హరీష్‌ మాట్లాడారు. రైతులకు నగదు మార్పిడితో పాటు రుణాలు...

Saturday, November 12, 2016 - 10:37

సిద్ధిపేట : దుద్దెడ టోల్ గేట్ వద్ద టోల్ ట్యాక్స్ ను సిబ్బంది వసూలు చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఈనెల 14వ తేదీ వరకూ టోల్ ట్యాక్స్ ను కేంద్రం రద్దు చేసింది. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా టోల్ ట్యాక్ వసూలు చేయటంపై వాహనదారులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు చేపట్టారు. 

Friday, November 11, 2016 - 21:20

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నోట్ల రద్దు గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తోంది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ఎక్కడ చూసినా.... జనం భారీగా క్యూ కడుతున్నారు. నిత్యవసరాలన్నీ నగదుతో ముడిపడి ఉండటంతో కొత్త నోట్ల కోసం.. నానా తంటాలు పడాల్సి వస్తోంది. అటు దుకాణాల్లో పాత నోట్లు నిరాకరిస్తుండటం.. ఇటు కొత్త నోట్లు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. నల్లగొండ, యాదాద్రి,...

Wednesday, November 2, 2016 - 20:10

సిద్ధిపేట : వచ్చే రెండేళ్లలో గోదావరి నీళ్లను సిద్ధిపేటకు తెప్పిస్తామని మంత్రి హరీష్‌ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పటి నాయకులు రైతులను పట్టించుకోలేదన్నారు. వచ్చే రెండేళ్లలో సిద్ధిపేటకు రైల్వే లైన్‌ వస్తుందన్న హరీష్‌ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

Pages

Don't Miss