Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Sunday, February 26, 2017 - 07:23

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో స్వచ్ఛ ఆటోల నిర్వహణ వ్యవస్థ పడకేసింది. విధుల్లో ఉండాల్సిన ఆటోలు... ఇతర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించాల్సిన ఆటోవాలాలు... విధులకు సక్రమంగా హాజరుకావడం లేదు. ప్రతిరోజూ విధుల్లో ఉండాల్సిన 2 వేల ఆటోల్లో... కేవలం 15 వందల ఆటోలు మాత్రమే విధుల్లో కనిపిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బల్దియా స్వచ్ఛ ఆటో...

Friday, February 24, 2017 - 17:17

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో అప్ర్పుడే ఎండలు మండిపోతున్నాయి. శివరాత్రికి చలి శివ..శివ అంటూ వెళ్లిపోతుందని అనంతరం ఎండలు మెల్లిగా అధికమౌతాయని పెద్దలు చెబుతుంటారు. కానీ ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫిబ్రవరి మాసంలోనే ఎండలు అదరగొడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 26-31 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రత శుక్రవారం ఒక్కసారిగా మారిపోయింది. ఫిబ్రవరి నెలాఖరులో పరిస్థితి ఈ...

Tuesday, February 21, 2017 - 17:40

సిద్ధిపేట :యువత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఏదైనా సాధించవచ్చని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. పట్టణంలో 200 మంది నిరుద్యోగులకు పోలీస్ శిక్షణ ఇస్తే అందులో 66 మంది కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారన్నారు. ప్రభుత్వం రంగం కన్నా ప్రైవేట్ రంగంలోనే భవిష్యత్ బాగుంటుందని హరీష్‌ సూచించారు.

Sunday, February 19, 2017 - 10:03

సిద్ధిపేట : అక్కన్నపేట మండలంలో హైనా కలకలం రేపుతోంది. మల్లంపల్లి, మోత్కులపల్లి, కట్కూరు గ్రామాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతులు పాడి పశువులను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 23 లేగదూడలను హైనా చంపేసింది. దీనితో రైతులు తీవ్ర కలత చెందుతున్నారు. అటవీశాఖాధికారులు స్పందించి హైనాను బంధించాలని రైతులు కోరుతున్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ ను కలిసి సమస్యను తెలియచేశారు....

Wednesday, February 15, 2017 - 21:43

సిద్దిపేట : జిల్లాలోని గజ్వేల్‌ వేదికగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార టీఆర్ ఎస్ ప్రభుత్వంపై సమరశంఖం పూరించింది. ప్రభుత్వ వైఫల్యాలపై నిర్వహించిన  ప్రజా పోరు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లు మార్పు,  బలవంతపు భూసేకరణ, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌, ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ...

Wednesday, February 1, 2017 - 18:37

గజ్వేల్ : విద్యార్ధులే రేపటి పౌరులని విద్యార్ధి దశ నుంచే స్టూడెంట్స్‌ అన్ని రంగాల్లో రాణించాలని సిద్ధిపేట పోలీసు కమిషనర్‌ శివకుమార్‌ అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్‌ పాఠశాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాలను ప్రారంభించారు. పాఠశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్ధులను ఆయన ప్రశంసించారు...విద్యార్థులను తీర్చిదిద్దుతూ భావిభారత...

Sunday, January 29, 2017 - 18:40

సిద్ధిపేట : జిల్లాలో పోలీసుల మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. సీపీ శివకుమార్ వేధిస్తున్నాడంటూ హుస్నాబాద్ సీఐ భూమయ్య ఆరోపణలు గుప్పించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసు వాహనం వాడవద్దని..కుర్చీలో కూర్చొవద్దంటూ మానసిక క్షోభకు గురి చేస్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. శివకుమార్ ఎస్పీగా ఉన్న సమయంలో అవకతవకలపై ప్రశ్నించడం జరిగిందని దీనితో ప్రస్తుతం ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు...

Saturday, January 28, 2017 - 08:51

సిద్దిపేట : జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులు అన్నాచెళ్లెళ్ల ప్రాణాలను బలితీసుకున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై అన్నాచెల్లెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లాలోని అక్కన్నపేట మండలం జనగాంలో తల్లిదండ్రులతో పాటు అన్నాచెల్లెలు రాజు, స్వరూప ఉంటున్నారు. స్వరూపకు వివాహం అయింది. ఆమె భర్త దుబాయ్ లో ఉంటున్నాడు. దీంతో ఆమె పుట్టింట్లో ఉంటుంది. అన్నాచెల్లెలు ఇద్దరూ కూలీ...

Pages

Don't Miss