Friday, April 7, 2017 - 12:23

హైదరాబాద్ : 'మా నాన్న చనిపోయిందే మంచిదైంది..ఇష్టం వచ్చినట్లు కొట్టారు..గడ్డపారలు..పారలు..ఇనుప రాడ్లతో చావబాదారు..ఆస్తి కోసం ఇదంతా చేశారు' అంటూ దుబ్బాక ఘటనలో సజీవదహనమైన దంపతుల పెద్ద కూతురు రేణుక పేర్కొంది. సుదర్శన్..రాజేశ్వరీ దంపతులను కుటుంబసభ్యులు సజీవదహనం చేసిన సంగతి తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం వీరు మృతి చెందారు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి వద్ద...

Friday, April 7, 2017 - 10:16

సిద్ధిపేట : మంత్రాల నెపం అనే మూఢనమ్మకం ఇంకా కొంతమంది ప్రజలను వీడడం లేదు. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో కొంతమంది దాడులు చేయడం..హత్యలు చేస్తుండడం తెలిసిందే. తాజాగా సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాకలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దంపతులిద్దరినీ బంధువులు నిర్బందించి సజీవదహనం చేశారు. సుదర్శన్..రాజేశ్వరీ అనే దంపతులకు ముగ్గురు కుమార్తెలు..ఒక కుమారుడున్నాడు. కానీ ఇంట్లో తరచూ జరుగుతున్న...

Thursday, April 6, 2017 - 17:36

సిద్దిపేట : కొమురవెళ్లి మండలంలో వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఐనాపూర్‌, గురువన్నపేట, తపాస్‌పల్లి గ్రామాల్లో వరి పంటలు, మామిడి తోటలను పరిశీలించారు. రైతులు అధైర్యపడొద్దని ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని..విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. పంటనష్టపోయిన కౌలు రైతులకు పరిహారం చెల్లించేలా నివేదిక తయారు చేయాలని...

Wednesday, April 5, 2017 - 06:40

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఏమైంది..? నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఊదరగొట్టిన నేతలు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలిచ్చారు..? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి..? ఈమూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన కొలువులెన్ని..? ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఏమంటున్నారు? తెలంగాణలో కొలువుల భర్తీపై 10టీవీ ప్రత్యేక కథనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీళ్లు,...

Monday, April 3, 2017 - 17:52

సిద్ధిపేట : నీటి ఎద్దడితో పంటలు ఎండిపోయిన రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. అనంతరం వినతిపత్రాన్ని ఆర్డీఓ శంకర్ కుమార్‌కు అందజేశారు. రాష్ట్రంలో ఓవైపు రైతులు ఇబ్బందులు పడుతుంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం సభ్యత్వ నమోదు కార్యక్రమంపై దృష్టిసారించడం దారుణమని కాంగ్రెస్...

Thursday, March 30, 2017 - 18:50

సిద్ధిపేట : మల్లన్న సాగర్‌కు వ్యతిరేకిస్తూ వేములఘాట్‌ గ్రామస్తులు చేపట్టిన దీక్ష మూడువందల రోజులకు చేరింది. దీక్షకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో సిద్ధిపేట్‌ నుంచి వేములఘాట్‌వరకూ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి పాల్గొన్నారు.. ఇవాళ సాయంత్రం వేములఘాట్‌లో భారీ బహిరంగసభ జరగనుంది.. ఈ కార్యక్రమానికి సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం...

Monday, March 27, 2017 - 06:45

సిద్దిపేట: నగరంలో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. తాగిన మైకంలో కానిస్టేబుల్స్‌పైనే చేయి చేసుకున్నాడు. నానా దుర్బాషలాడాడు. సిద్దిపేటలోని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లోకి.... నంగునూరు మండలం దర్గపల్లికి చెందిన కిషన్‌ తాగి వచ్చాడు. పీకలదాకా తాగిఉన్న కిషన్‌... పోలీసులను తిడుతూ హల్‌చల్‌ చేశాడు. మందలించిన ఇద్దరు కానిస్టేబుల్స్‌పై చేయి చేసుకున్నాడు. దీంతో పోలీసులు కిషన్‌పై కేసు నమోదు...

Sunday, March 26, 2017 - 21:31
Sunday, March 26, 2017 - 17:22

మెదక్ : సంగారెడ్డిలోని వ్యవసాయ జూనియర్ కాలేజీలో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వ లేదని టి.కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ రేపు అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని, మూడు సంవత్సరాల నుండి వ్యవసాయ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు నిరసనలు..ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. మంత్రులను.....

Monday, March 13, 2017 - 18:44

p { margin-bottom: 0.21cm; }

సూర్యాపేట్‌ : అనంతగిరి తహసిల్దార్‌ వేధింపులు భరించలేక ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.. గోండ్రియాలకు చెందిన రాజేంద్ర ప్రసాద్‌ దాదాపు పద్దెనిమిదేళ్లక్రితం తన పొలంలో బోరు వేసుకున్నాడు.. ఆ నీటితో భూమి సాగుచేసుకుంటున్నాడు.. ఈ బోర్‌ను సీజ్‌ చేస్తున్నామంటూ తహసిల్దార్‌ రమణ రైతుకు నోటీసులు పంపాడు.. ఈ విషయంపై...

Pages

Don't Miss