Monday, February 12, 2018 - 07:31

సిద్దిపేట : ప్రభుత్వ విద్యాలయాలు నేటికీ కనీస వసతులు లేక కునారిల్లుతున్నాయి. సౌకర్యాల లేమి, ఉపాద్యాయుల కొరతతోపాటు.. సరిపడా తరగతి గదులు కూడా లేని దుస్థితిలో విద్యా బోధన కొనసాగుతోంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం వల్ల చాలా మంది విద్యార్థులు పాఠశాల విద్యతోనే చదువుకు స్వస్తి చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. విద్యార్ధులకు ఉచిత...

Monday, February 5, 2018 - 20:01

సిద్దిపేట : ఆర్థిక వ్యవస్థకు వేరులాంటి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే... ఆర్థిక రంగమే కుప్పకూలిపోతుందని టీ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌ అన్నారు. దుస్థితిలో ఉన్న వ్యవసాయరంగాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన మంచిర్యాల రైతు సదస్సుకు వెళ్తూ మార్గమధ్యంలో సిద్దిపేట రంగదాంపల్లి చౌరస్తా వద్ద మాట్లాడారు. రైతుకు భరోసా కలిపించి అన్ని విధాలా ఆదుకోవాలన్నారు.

 

Friday, February 2, 2018 - 18:13

సిద్దిపేట : జిల్లా కేంద్రం హౌజింగ్‌ బోర్డ్‌ కాలనీలో ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి చైన్‌ స్నాచింగ్‌ యత్నించారు. ఓ మహిళ మెడలో నుండి మూడు తులాల బంగారం గొలుసు ఎత్తుకెళ్లడానికి యత్నించారు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు గమనించి.. ఒకరిని పట్టుకుని చితక బాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

Wednesday, January 31, 2018 - 12:38

హైదరాబాద్ : జీడిమెట్ల పీఎస్ పరిధిలో గత కొన్ని రోజులు కింద అదృశ్యమైన బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. కిడ్నాపర్లు బాలుడిని వదిలి వెళ్లిపోయారు. ఓ కుటుంబం కుమారుడు ఉదయ్ తేజతో చిత్తారమ్మ జాతరకు వచ్చింది. అనంతరం జాతరలో ఉదయ్ అదృశ్యమయ్యాడు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తల్లిదండ్రులు పలు ప్రాంతాల్లో వెతికినా బాలుడి ఆచూకి లభించలేదు. చివరకు పీఎస్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు....

Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Friday, January 26, 2018 - 13:57

సిద్దిపేట : గణతంత్ర వేడుకల సందర్భంగా సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. కోహెడ మార్కెట్‌ యార్డులో విద్యుత్‌ షాక్‌ తగిలి కాంట్రాక్ట్‌ ఉద్యోగి మృతి చెందాడు. జాతీయ జెండాను సవరించే సమయంలో కరెంట్‌ షాక్‌ తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

 

Tuesday, January 23, 2018 - 17:39

సిద్దిపేట : ప్రజా సమస్యలపై పోరాడే మందకృష్ణ, వంటేరు ప్రతాప్‌ వంటి నేతలను అరెస్ట్‌ చేయడం బాధాకరం అన్నారు జేఏసీ చైర్మన్‌ కోదండరామ్. పౌరవేదికలను ప్రభుత్వం అడ్డుకొని ఆంక్షలు విధిస్తుందని, వారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పౌర వేదికలకు అనుమతి ఇవ్వడం ప్రజాస్వామ్య విరుద్ధం అన్నారు. పౌరవేదికలను ప్రజా స్వామ్యాన్ని రాజ్యాంగ బద్ధంగా కాపాడే బాధ్యత ప్రభుత్వాలదేనని చెప్పారు.

Thursday, January 18, 2018 - 16:12

సిద్దిపేట : అతితక్కువ సమయంలో అత్యంత ప్రజాదారణ పొందిన చానల్‌ టెన్‌ టీవీ అన్నారు సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి. సిద్దిపేట జిల్లా కేంద్రం స్థానిక గాంధీ సెంటర్‌ వద్ద భవన నిర్మాణ కార్మికులు, సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో.. ఆయన టెన్‌ టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో టెన్‌ టీవీ మరింత అభివృద్ధి చెంది ప్రజల పక్షాన నిలవాలని మల్లారెడ్డి కోరారు.

Thursday, January 18, 2018 - 16:11

సిద్దిపేట : జిల్లా చేర్యాల మండల కేంద్రంలో బ్రిటీష్‌ డిప్యూటి హై కమిషనర్‌ ఆండ్రె ఫ్లెమింగ్‌ పర్యటించారు. చేర్యాల మండల కేంద్రంలోని నకాశి చిత్రకారులను కలిశారు. వారు గీసిన చిత్రాలను తిలకించారు. చిత్రకారుల కుటుంబాలను కలిసి వారితో ఆర్థిక, సామాజిక, వ్యాపార విషయాలను అడిగి తెలుసుకున్నారు. నకాశి చిత్రాలు జీవం ఉట్టి పడేలా ఉన్నాయని ఫ్లెమింగ్‌ ఆనందం వ్యక్తం చేశారు. 

Wednesday, January 17, 2018 - 21:18

హైదరాబాద్/సిద్దిపేట : పీపుల్స్‌ ప్లాజాలో 102, 108 వాహనాలను సీఎం కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. గర్భిణులకు వైద్యసేవలు అందించేందుకు అమ్మఒడి పేరిట 102 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన గర్భిణులను ప్రసవానికి ముందు దవాఖానకు చేర్చడం, తర్వాత పుట్టిన బిడ్డతోపాటు కుటుంబ సభ్యులను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు అమ్మఒడి...

Wednesday, January 17, 2018 - 15:56

సిద్దిపేట : గజ్వేల్‌ నియోజకవర్గంలోని తూప్రాన్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటించారు. తూప్రాన్‌లో 50 పడకల ఆస్పత్రిని కేసీఆర్‌ ప్రారంభించారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామన్నారు. ఈ సందర్బంగా తూప్రాన్‌పై కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. డిగ్రీ కాలేజీతో పాటు.. 500 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మిస్తామన్నారు. మరోసారి నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో...

Pages

Don't Miss