Thursday, January 18, 2018 - 16:12

సిద్దిపేట : అతితక్కువ సమయంలో అత్యంత ప్రజాదారణ పొందిన చానల్‌ టెన్‌ టీవీ అన్నారు సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి. సిద్దిపేట జిల్లా కేంద్రం స్థానిక గాంధీ సెంటర్‌ వద్ద భవన నిర్మాణ కార్మికులు, సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో.. ఆయన టెన్‌ టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో టెన్‌ టీవీ మరింత అభివృద్ధి చెంది ప్రజల పక్షాన నిలవాలని మల్లారెడ్డి కోరారు.

Thursday, January 18, 2018 - 16:11

సిద్దిపేట : జిల్లా చేర్యాల మండల కేంద్రంలో బ్రిటీష్‌ డిప్యూటి హై కమిషనర్‌ ఆండ్రె ఫ్లెమింగ్‌ పర్యటించారు. చేర్యాల మండల కేంద్రంలోని నకాశి చిత్రకారులను కలిశారు. వారు గీసిన చిత్రాలను తిలకించారు. చిత్రకారుల కుటుంబాలను కలిసి వారితో ఆర్థిక, సామాజిక, వ్యాపార విషయాలను అడిగి తెలుసుకున్నారు. నకాశి చిత్రాలు జీవం ఉట్టి పడేలా ఉన్నాయని ఫ్లెమింగ్‌ ఆనందం వ్యక్తం చేశారు. 

Wednesday, January 17, 2018 - 21:18

హైదరాబాద్/సిద్దిపేట : పీపుల్స్‌ ప్లాజాలో 102, 108 వాహనాలను సీఎం కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. గర్భిణులకు వైద్యసేవలు అందించేందుకు అమ్మఒడి పేరిట 102 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన గర్భిణులను ప్రసవానికి ముందు దవాఖానకు చేర్చడం, తర్వాత పుట్టిన బిడ్డతోపాటు కుటుంబ సభ్యులను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు అమ్మఒడి...

Wednesday, January 17, 2018 - 15:56

సిద్దిపేట : గజ్వేల్‌ నియోజకవర్గంలోని తూప్రాన్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటించారు. తూప్రాన్‌లో 50 పడకల ఆస్పత్రిని కేసీఆర్‌ ప్రారంభించారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామన్నారు. ఈ సందర్బంగా తూప్రాన్‌పై కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. డిగ్రీ కాలేజీతో పాటు.. 500 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మిస్తామన్నారు. మరోసారి నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో...

Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Saturday, January 6, 2018 - 18:21

సిద్ధిపేట : నేరేళ్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సిద్దిపేట నుండి నేరేళ్ల వరకు పాదయాత్ర చేపట్టారు వామపక్ష నేతలు. పాదయాత్రను విజయవంతం చేయాలని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం ప్రజలకు సూచించారు. కేసీఆర్‌ బంధువులే ఇసుక మాఫియాలో ముఖ్య పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. నేరేళ్ల ఘటనపై మంత్రి కేటీఆర్‌ ఇంత వరకు ఎలాంటి చర్యలు...

Monday, January 1, 2018 - 18:14

సిద్దిపేట : జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామస్థులకు... కోతులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను... తీరా చేతికొచ్చే సమయంలో నాశనం చేస్తున్నాయి.. అంతటితో ఆగకుండా గ్రామస్తులపై కూడా దాడి చేస్తున్నాయి. కోతులు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా వచ్చి పొలాలపై తెగబడుతున్నాయి. రైతులు పొలంలో పంటకు కాపలా కాయాలో... తాము తెచ్చుకున్న అన్నం గిన్నెలను...

Saturday, December 30, 2017 - 18:01

సిద్ధిపేట : అడవిలో ఉండాల్సిన కోతులు ఊరి మీద పడ్డాయి.... పొలంలో పంటా... ఇంట్లో వంటా దేన్నీ వదలకుండా నాశనం చేస్తున్నాయి. కోతి చేష్టలతో సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామస్థులు హడలి పోతున్నారు. కోతుల బెడదపై టెన్‌టీవీ ప్రత్యేక కథనం. సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామస్థులకు... కోతులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను......

Pages

Don't Miss