Wednesday, October 11, 2017 - 21:52

సిరిసిల్ల : సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణాలకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామన్న కేసీఆర్‌... రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. తనను అన్ని విధాలుగా తీర్చిదిద్దిన సిద్దిపేటను... జిల్లా చేయడమే కాకుండా... తన చేతుల మీదుగా కలెక్టరేట్‌ భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇక...

Wednesday, October 11, 2017 - 15:51

సిద్దిపేట : తనకు రాజకీయ జన్మనిచ్చిన సిద్దిపేటకు ఎంత చేసినా తక్కువేనని..తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టిచ్చినా తక్కువే అని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్దిపేటలో కలెక్టరేట్‌, పోలీస్‌ కమిషనరేట్‌, మెడికల్‌ కాలేజీలకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. సిద్దిపేట ప్రజలు ఏది కోరినా కాదనని తెలిపారు. సిద్దిపేట జిల్లాకు స్పెషల్ పోలీస్ బెటాలియన్ ఏర్పాటు...

Wednesday, October 11, 2017 - 15:00

సిద్దిపేట : సిద్దిపేటలో సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దుద్దెడలో కలెక్టరేట్‌ నిర్మాణం, మెడికల్‌ కాలేజీ, పోలీస్‌ కమిషనరేట్‌లకు శంకుస్థాపన చేశారు. భవన నమూనాలను పరిశీలించిన అనంతరం.. శిలాఫలకాలను ఆవిష్కరించారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు భారీ ఏర్పాటు చేశారు. 

 

Wednesday, October 11, 2017 - 08:12

 

కరీంనగర్/సిరిసిల్ల/సిద్దిపేట : సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో సిరిసిల్ల, సిద్దిపేటలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసులు సీపీఎం నేతలను ముందుస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. సీఎం పర్యటను అడ్డుకుంటారన్న సమాచారంతో ఆర్ధరాత్రి నుంచే అరెస్ట్ లు చేస్తున్నారు. సీపీఎం జిల్లా...

Wednesday, October 4, 2017 - 20:54

సిద్దిపేట : గోదావరి జలాలు సిద్దిపేట జిల్లాను తాకాయి. తపాస్‌పల్లి రిజర్వాయర్‌ ఎడమ కాల్వ ద్వారా 20 గ్రామాలకు మంత్రి హరీష్‌రావు గోదావరి జలాలను విడుదల చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు హరీశ్. 

సిద్దిపేట జిల్లాలో తొలిసారిగా గోదావరి జలాలు ప్రవేశించాయి. తపాస్‌ పల్లి రిజర్వాయర్ ఎడమ కాల్వ ద్వారా సిద్దిపేట, కొండపాక మండలాల్లోని 20 గ్రామాలకు గోదావరి జలాలను...

Wednesday, October 4, 2017 - 17:51

సిద్దిపేట : గోదావరి నీళ్లు మొదటిసారి సిద్దిపేట జిల్లాను ముద్దాడాయని.. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజన్నారు మంత్రి హరీష్‌రావు . సిద్దిపేట జిల్లా తపాస్‌పల్లి రిజర్వాయర్ ఎడమకాల్వ ద్వారా సిద్దిపేట, కొండపాక మండలాల్లోని 20 గ్రామాలకు ఈరోజు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరయ్యారు. 2001లోనే కొండపాక...

Saturday, September 30, 2017 - 15:40

సిద్ధిపేట : పరస్పర సహాయ, సహకారాలతోనే మత సామరస్యాన్ని కాపాడుకోవచ్చునన్నారు మంత్రి హరీష్‌రావు. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. విజయదశమి పండుగ సందర్భంగా సిద్దిపేట కోటి లింగేశ్వర ఆలయంలోని జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. సిద్దిపేట ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 500 మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

Thursday, September 28, 2017 - 20:53

సిద్ధిపేట : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం వచ్చిందన్నారు మంత్రి హరీష్‌రావు. సిద్దిపేట జిల్లా సిద్దిపేటలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. పలు వీధుల్లో బతుకమ్మ కోలాటాలను తిలకించిన హరీష్‌రావు ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు ప్రదానం చేశారు. వేడుకల్లో హరీష్ రావు సతీమణి శ్రీనిత, కుమార్తె వైష్ణవి పాల్గొని బతుకమ్మ ఆడారు. 

 

Pages

Don't Miss