Monday, November 12, 2018 - 19:43

వరంగల్ : రాష్ట్ర విమోచన ఉద్యమ సమయంలో అశువులు బాసిన ఉద్యమ కారుడు శ్రీకాంతాచారి తల్లి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎన్నికల వేళ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న ఆమె తనకు టిక్కెట్ రాకుండా జగదీశ్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తాను బీసీ మహిళను అయినందుకే నాకు టికెట్ రాకుండా మంత్రి జగదీశ్ రెడ్డి అడ్డుకుంటున్నారని శంకరమ్మ ఆరోపించారు. తెలంగాణభవన్ కు  వెళ్లిన శంకరమ్మ...

Thursday, October 11, 2018 - 09:50

సూర్యాపేట : హుజూర్ నగర్ టికెట్ టీఆర్ఎస్ పార్టీలో ఎవరికి దక్కుతుంది ? తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ...ఎన్ఆర్ఐ సైదిరెడ్డికి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. కానీ తనకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారంటూ శంకరమ్మ కంటతడి పెట్టడం కలకలం రేగింది. ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే మాత్రం ఏకంగా...

Monday, October 8, 2018 - 08:18

సూర్యపేట : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ చేసిన అభివృద్ధి యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని... కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటూ  ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. పొరుగు రాష్ట్రమైన ఏపీలోని నెల్లూరు జిల్లా సైదాపురానికి చెందిన లోహిత్‌రెడ్డి ఈ పాదయాత్ర చేపట్టాడు. విజయవాడ నుంచి హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు పాదయాత్రగా బయలుదేరాడు. తన పాదయాత్ర ద్వారా కొందరినైనా టీఆర్‌ఎస్‌కు ఓటు...

Sunday, October 7, 2018 - 13:59

సూర్యాపేట : జిల్లాలో ఆంధ్రాబ్యాంకు ఏటీఎంలో పెట్టే నగదులో అవకతవకలు జరిగాయి. సొంత సంస్థకే క్యాషియర్ కన్నం పెట్టాడు. ఆంధ్రాబ్యాంక్‌ను బురిడీ కొట్టించాడు. ఆంధ్రాబ్యాంకు హుజూర్‌నగర్ బ్రాంచ్‌లో గంగాధర రామకృష్ణ 3 సంవత్సరాలుగా హెడ్ క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. ఈనేపథ్యంలో రామకృష్ణ చేలివాటం ప్రదర్శించారు. రూ.58.89 లక్షలతో రామకృష్ణ పరాయ్యారు. బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు...

Sunday, August 26, 2018 - 21:21

హైదరాబాద్ : అన్నాచెల్లెళ్లు..అక్కాతమ్ముళ్ల.. మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండగను దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రముఖులకు కూడా వారి అక్క చెల్లెలు రాఖీలు కట్టి తమ బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎంపీ కవిత తన సోదరుడైన మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి... తన సోదరుడితో ఉన్న అనుబంధాన్ని...

Sunday, August 19, 2018 - 08:17

నల్గొండ : కళాశాల యాజమాన్యం వేధింపులు..చదువు ఒత్తిడి..కుటుంబ కలహాలు..ప్రేమ వ్యవహారం..ఇతరత్రా కారణాలతో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతూ ఆ కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిలిస్తున్నారు. తాజాగా మరో విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన మఠంపల్లి గురుకుల కళాశాలలో చోటు చేసుకుంది. మఠంపల్లి పెదవీడుకు చెందిన నోముల మౌనిక గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. శనివారం రాత్రి...

Sunday, August 12, 2018 - 21:21

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 24 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌ తడిసి ముద్దైంది. వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు...

Wednesday, August 8, 2018 - 21:15

హైదరాబాద్ : భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైతు బీమా పథకంలో భాగంగా వివిధ జిల్లాల్లోని రైతులకు మంత్రులు బీమా పత్రాలను పంపిణీ చేశారు. రైతు ప్రమాదవశాత్తు గానీ, సహజంగా గానీ మరణిస్తే రైతు కుటుంబం వీధిన పడకుండా ఉండటానికి.. ప్రభుత్వం రైతుబీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయలను చెల్లిస్తుందని తెలిపారు...

Monday, July 30, 2018 - 21:51

సూర్యాపేట : కాంగ్రెస్‌ పాలకులు సాగునీరు, వ్యవసాయ రంగాలను నిర్లక్ష్యం చేశారని  తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. చెరువులను నాశనం చేయడంతో నీరులేక రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన మంత్రి జగదీశ్‌రెడ్డి... పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. టేకుమట్లలో 80 లక్షల రూపాయలతో నిర్మించే సీసీ...

Monday, July 16, 2018 - 21:15

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టుల్లో జలకళ సంతరించుకుంటోంది. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలుప్రాంతాల్లో జనజీవనం స్ధంబించింది. కాగా ఈనెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మరో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల ఒక...

Sunday, July 15, 2018 - 16:57

సూర్యాపేట : జిల్లాలోని కోదాడ మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాటా ఎస్ వాహనం అదుపు తప్పింది. కొమరబండ సమీపంలో వాహనం టైరు పగలడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ముగ్గురు మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. కృష్ణా జిల్లాకు చెందిన 25 మంది సూర్యాపేటలోని దండు మైసమ్మ ఆలయానికి వెళ్లారు. తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ...

Pages

Don't Miss