Tuesday, February 28, 2017 - 09:33

సూర్యాపేట : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న డిమాండ్‌తోనే ఈ మహాజన పాదయాత్ర కొనసాగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజాభివృద్ధికి ప్రభుత్వం పాటు పడాలనే ప్రజలను చైతన్యం చేస్తున్నామని తమ్మినేని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినా తెలంగాణలో ప్రజల బతుకులు మారలేదని, ప్రజా సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోయాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని...

Tuesday, February 28, 2017 - 07:18

తెలుగు రాష్ట్రాల్లో మార్చి 1వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనపథంలో 'మ్యాథ్స్ పేపర్ లో టాప్ స్కోరు సాధించడం ఎలా' ? దానిపై జి.వి.రావు విద్యార్థులకు సలహాలు..సూచనలు అందచేశారు. మరి ఆయన ఎలాంటి సలహాలు..సూచనలు అందచేశారో వీడియోలో చూడండి.

Monday, February 27, 2017 - 19:47

సూర్యపేట : జిల్లాలో సీపీఎం మహాజన పాదయాత్ర ఉత్సహంగా సాగుతోంది. ఆత్మకూరు ఎస్‌ మండలంలో పలు గ్రామాలు, తండాల్లో యాత్ర కొనసాగుతోంది. వట్టికంపాడు, లక్ష్మణ్‌నాయక్‌ తండా, నాచారం, ఆత్మకూర్‌ఎక్స్‌రోడ్డు, దుబ్బగూడెం, నిమ్మికల్‌, దబ్బకంద గ్రామాలతోపాటు పాతర్లపాడు ఎక్స్‌రోడ్డు , గుండ్లసింగారం, నూతనక్లు, చిల్పకుంట్ల గ్రామాల్లో యాత్ర కొనసాగుతోంది. ప్రతి గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తూ...

Monday, February 27, 2017 - 13:35

సూర్యాపేట : సీపీఎం మహాజన పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఆత్మకూరు ఎస్ మండలంలోని పలు గ్రామాలు..తండాల్లో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. వట్టికంపాడు, లక్ష్మణ్ నాయక్ తండా, నాచారం, ఆత్మకూరు ఎక్స్ రోడ్డు, దుబ్బగూడెం, నిమికల్, దబ్బకంద గ్రామాలతో పాటు పాతర్లపాడు ఎక్స్ రోడ్డు, గుండ్ల సింగారం, నూతనకల్ ప్రాంతాల్లో పాదయాత్ర జరుగుతోంది. పాదయాత్రకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. పాదయాత్ర...

Monday, February 27, 2017 - 09:33

హైదరాబాద్ : తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, ఈ కుటుంబ పాలనతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. యూనివర్సిటీలు, కళాశాలల్లో అధ్యాపకులు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, కేసీఆర్‌ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిందని తమ్మినేని విమర్శించారు. బీసీ, మైనారిటీలకు సబ్‌ప్లాన్‌ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని ఆయన...

Sunday, February 26, 2017 - 21:21

సూర్యాపేట : మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని ప్రభుత్వం పనిచేయాలన్నారు జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పర్యటించారు. హుజుర్‌నగర్‌లో 6 నెలలుగా రెవెన్యూ డివిజన్‌ సాధన కోసం దీక్ష చేస్తున్న వారిచే దీక్షను విరమింపజేశారు. రెవెన్యూ డివిజన్‌ కోసం 6 నెలలుగా...

Saturday, February 25, 2017 - 10:28

సూర్యపేట : సామాజిక న్యాయం కోసం అందరూ కలవాల్సిన అవసరముందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం సామాజిక న్యాయం జరిగినప్పుడే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం అన్నారు. సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న సీపీఎం మహాజన పాదయాత్రకు కాంగ్రెస్‌, వైసీపీ, టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలతో సామాన్యులకు...

Thursday, February 23, 2017 - 10:53

సూర్యాపేట : కేసీఆర్‌ పాలనలో ప్రజలకు కనీస విద్యా, వైద్య సౌకర్యాలు కూడా అందడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సీఎం కేసీఆర్‌ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని తమ్మినేని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చుతున్న కేసీఆర్‌ ఏం పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు...

Wednesday, February 22, 2017 - 13:30

సూర్యాపేట : సీపీఎం నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర విజయంతమైందని టి.కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. మహాజన పాదయాత్ర 129వ రోజుకు చేరుకుంది. నాయకన్ గూడెం, మామిళ్ల గూడెం, హుస్సేనాబాద్, మోతె, నర్సింహుల గూడెం, రేపాల, జగన్నాథపురం, తలకోవలో లో పాదయాత్ర బృందం పర్యటించనుంది. నాయకన్ గూడెం చేరుకున్న అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి, పొన్నాల లక్ష్మయ్యలు సంఘీభావం...

Tuesday, January 10, 2017 - 16:15

సూర్యాపేట : వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో వర్షాభావ పరిస్థితులకు ఎదురొడ్డాడు ఓ రైతు. ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేసుకుంటూ సిరులు కురిపిస్తున్నాడు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా.. బిందు సేద్యంతో అల్లం సాగు చేస్తూ లాభాల దిశగా పయనిస్తున్నాడు. ఓ కొత్త ఆలోచన ఆ రైతుకు సిరులు కురిపిస్తోంది. నీళ్లు లేవని అధైర్యపడకుండా.. పరిస్థితులకనుగుణంగా సాగు చేస్తున్నాడు....

Tuesday, January 3, 2017 - 19:02

సూర్యాపేట : జిల్లాలోని కోదాడలోని పోస్టాఫీస్‌ ఎదుట వృద్ధులు, దివ్యాంగులు ఆందోళనకు దిగారు. రెండు నెలలుగా తపాలా సిబ్బంది తమకు పింఛన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. పోస్టాఫీస్‌ సిబ్బంది తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. పెన్షన్‌ కోసం రెండు నెలలుగా తిరుగుతూనే ఉన్నామని వారు వాపోయారు. నగదు లేదంటూ తమను పోస్టాఫీస్‌ చుట్టూ తిప్పుతున్నారని చెప్పారు. వృద్ధులం, దివ్యాంగులమని కూడా చూడకుండా...

Pages

Don't Miss