Thursday, February 23, 2017 - 10:53

సూర్యాపేట : కేసీఆర్‌ పాలనలో ప్రజలకు కనీస విద్యా, వైద్య సౌకర్యాలు కూడా అందడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సీఎం కేసీఆర్‌ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని తమ్మినేని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చుతున్న కేసీఆర్‌ ఏం పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు...

Wednesday, February 22, 2017 - 13:30

సూర్యాపేట : సీపీఎం నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర విజయంతమైందని టి.కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. మహాజన పాదయాత్ర 129వ రోజుకు చేరుకుంది. నాయకన్ గూడెం, మామిళ్ల గూడెం, హుస్సేనాబాద్, మోతె, నర్సింహుల గూడెం, రేపాల, జగన్నాథపురం, తలకోవలో లో పాదయాత్ర బృందం పర్యటించనుంది. నాయకన్ గూడెం చేరుకున్న అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి, పొన్నాల లక్ష్మయ్యలు సంఘీభావం...

Tuesday, January 10, 2017 - 16:15

సూర్యాపేట : వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో వర్షాభావ పరిస్థితులకు ఎదురొడ్డాడు ఓ రైతు. ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేసుకుంటూ సిరులు కురిపిస్తున్నాడు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా.. బిందు సేద్యంతో అల్లం సాగు చేస్తూ లాభాల దిశగా పయనిస్తున్నాడు. ఓ కొత్త ఆలోచన ఆ రైతుకు సిరులు కురిపిస్తోంది. నీళ్లు లేవని అధైర్యపడకుండా.. పరిస్థితులకనుగుణంగా సాగు చేస్తున్నాడు....

Tuesday, January 3, 2017 - 19:02

సూర్యాపేట : జిల్లాలోని కోదాడలోని పోస్టాఫీస్‌ ఎదుట వృద్ధులు, దివ్యాంగులు ఆందోళనకు దిగారు. రెండు నెలలుగా తపాలా సిబ్బంది తమకు పింఛన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. పోస్టాఫీస్‌ సిబ్బంది తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. పెన్షన్‌ కోసం రెండు నెలలుగా తిరుగుతూనే ఉన్నామని వారు వాపోయారు. నగదు లేదంటూ తమను పోస్టాఫీస్‌ చుట్టూ తిప్పుతున్నారని చెప్పారు. వృద్ధులం, దివ్యాంగులమని కూడా చూడకుండా...

Monday, January 2, 2017 - 13:02

సూర్యాపేట : మునగాల (మం) ఆకుపాముల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. కోదాడ మండలం కోమరబండకు చెందిన ఉపేందర్, లక్ష్మణ్ లు మృతి చెందిన వారిలో ఉన్నారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్వీస్ రోడ్డును నిర్మించాలని కోరుతున్నా జీఎమ్మార్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ప్రజలు పేర్కొంటున్నట్లు...

Thursday, December 15, 2016 - 12:54

సూర్యాపేట : జిల్లాలోని ముకుందాపురంలో దారుణం జరిగింది. మద్యంమత్తులో తండ్రి వెంకన్న 5 నెలల బాలుడిని బండకేసి కొట్టాడు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తరువాత తన భార్యపై గొడ్డలితో దాడి చేయగా ఆమె తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం భర్త వెంకన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Monday, December 12, 2016 - 14:11

వర్ద...అంటే ఏమిటీ ? ఈ పేరు ఎందుకు పెట్టారు..ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. చెన్నైలో 'వార్దా' తుపాన్ బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తీవ్ర తుపాను చెన్నై తీరాన్ని దాటింది. దీనితో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తుపాన్ లు ఏర్పడిన సమయంలో కొన్ని పేర్లు పెడుతుంటారు. రౌనా, హుద్ హుద్, లైలా, పైలిన్, లెెహెర్, హెలిన్, నీలం వంటి పేర్లు పెట్టారు. తాజాగా 'వర్ద'...

Sunday, December 11, 2016 - 18:59

సూర్యాపేట : జిల్లాలోని కోదాడలో దారుణం జరిగింది. వైష్ణవి స్కూళ్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని లోహిత హాస్టల్‌ నాల్గో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో విద్యార్థిని రెండు కాళ్లు విరిగిపోయాయి. దీనిని గమనించిన తోటి విద్యార్థినులు లోహితను వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. లోహిత ఆత్మహత్యాయత్నంపై ప్రిన్సిపాల్‌ చెబుతున్న పొంతనలేని సమాధానాలు అనుమానానికి...

Sunday, December 4, 2016 - 19:35

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లోని రియల్టీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నగదు రూపంలో జరిగిన స్థిరాస్తి లావాదేవీలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు లేక ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడం ఇందుకు నిదర్శనం. విభజన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో రియల్ బూమ్ ఊపందుకొంది. ముఖ్యంగా ఏపీ కొత్త రాజధాని...

Thursday, December 1, 2016 - 09:17

పెద్ద నోట్లు రద్దు..సామాన్యుడిని వణికించేస్తోంది. పేదోడి సమస్య వర్ణనాతీతంగా ఉంది. పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని వాహనదారులకు గత కొన్ని రోజులుగా ట్యాక్స్ కట్టే బాధ తప్పినట్లైంది. చిల్లర సమస్స తలెత్తడం..పలు టోల్ గేట్ల వద్ద ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశ వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తడంతో కేంద్రం కళ్లు తెరిచింది. వెంటనే టోల్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు..కొన్ని రోజుల వరకు ఇది అమల్లోఉ ఉంటుందని...

Wednesday, November 30, 2016 - 08:34

సూర్యాపేట : జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం తాడ్వాయి సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 
మరిన్ని వివరాలను వీడియోలో...

Pages

Don't Miss