Tuesday, April 24, 2018 - 14:57

సిద్ధిపేట : జిల్లాలో విషాదం జరిగింది. జిల్లాలోని కొత్తబస్టాండ్‌లో ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు ఇద్దరినీ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రియుడు సంతోష్‌ రెడ్డి మృతి చెందగా, ప్రియురాలు రాణి పరిస్థితి విషమంగా ఉంది. అయితే వీరి కులాలు వేరు అయినందున తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోరని మనస్థాపంతో ఆత్మహత్యకు...

Tuesday, April 24, 2018 - 11:32

సూర్యాపేట : జిల్లాలో టీఆర్‌ఎస్‌.. తలంగాణ జాగృతి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. తుంగతుర్తి నియోజకవర్గంలో ఫ్లెక్సీల రగడ నెలకొంది. హరీష్‌రావు పర్యటన సందర్భంగా తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్‌సాగర్‌ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ అనుచరులు చించివేశారు. తిర్మలగిరి, ఆర్వపల్లి, వెలిశాల, తుంగతుర్తిలో ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. 

Monday, April 16, 2018 - 07:04

హైదరాబాద్ : సీపీఎం జాతీయ మహాసభలకు ఎర్రదండు సిద్ధం అవుతోంది. ఊరూవాడా అరుణపతాకాలు కవాతు తొక్కుతున్నాయి. హైదరాబాద్ బహిరంసభకు ప్రజలు తరలిరావాలని ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగురాష్ట్రాల్లో సీపీఎం శ్రేణులు ర్యాలీలు హోరెత్తుతున్నాయి. ఇటు హైదరాబాద్‌లో మహాసభల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సీపీఎం జాతీయ మహాసభలకు తెలుగు రాష్ట్రాల్లో పార్టీశ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. ఈనెల 22న భారీ...

Sunday, April 15, 2018 - 18:33

స్యూర్యాపేట : స్యూర్యాపేట జిల్లాలో నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ స్థలం వివాదస్పదంగా మారింది. మంత్రి జగదీష్‌రెడ్డి తన అనుయాయులకు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల కోసమే  కలెక్టరేట్‌ భవన సముదాయం నిర్మిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. జనసమ్మర్దం లేని ప్రాంతంలో నిర్మిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో...

Saturday, April 14, 2018 - 07:03

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...

Saturday, April 14, 2018 - 06:59

హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్‌ ఓ సజీవ సాక్ష్యం.

ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల...

Saturday, April 14, 2018 - 06:56

హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్‌ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి...

Monday, April 9, 2018 - 13:26

సూర్యాపేట : జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. అర్వపల్లి మండలం కొమ్మల గ్రామంలో పెళ్లిపనులు చేస్తుండగా విద్యుత్‌షాక్‌ తగిలి ఇద్దరు మృతి చెందారు. పెళ్లికొకుడు తండ్రి సత్యనారాయణ, పెళ్లికొడుకు బావ శోభన్‌బాబు అక్కడిక్కడే చనిపోయారు. కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

 

Monday, April 2, 2018 - 12:07

సూర్యపేట : జిల్లా హుజుర్‌నగర్‌ నియోజకవర్గంలో రాత్రి కురిసిన వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ఈదురుగాలులు, వర్షాల బీభత్సానికి దాదాపు వంద ఎకరాల పంట నేలమట్టం అయింది. ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మామిడితోటలు, బత్తాయి తోటలు కాయరాలిపోయి తీవ్ర నష్టం వాటిళ్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే...

Sunday, April 1, 2018 - 11:44

సూర్యాపేట : హుజూర్ నగర్ మండలంలోని బురుగుగడ్డ గ్రామంలోని ఆది లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మంత్రి జగదీశ్వర్ రెడ్డి సందర్శించారు. స్వామి వారి తిరు కళ్యాణోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

Thursday, March 15, 2018 - 07:12

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు....

Pages

Don't Miss