Saturday, April 14, 2018 - 06:56

హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్‌ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి...

Monday, April 9, 2018 - 13:26

సూర్యాపేట : జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. అర్వపల్లి మండలం కొమ్మల గ్రామంలో పెళ్లిపనులు చేస్తుండగా విద్యుత్‌షాక్‌ తగిలి ఇద్దరు మృతి చెందారు. పెళ్లికొకుడు తండ్రి సత్యనారాయణ, పెళ్లికొడుకు బావ శోభన్‌బాబు అక్కడిక్కడే చనిపోయారు. కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

 

Monday, April 2, 2018 - 12:07

సూర్యపేట : జిల్లా హుజుర్‌నగర్‌ నియోజకవర్గంలో రాత్రి కురిసిన వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ఈదురుగాలులు, వర్షాల బీభత్సానికి దాదాపు వంద ఎకరాల పంట నేలమట్టం అయింది. ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మామిడితోటలు, బత్తాయి తోటలు కాయరాలిపోయి తీవ్ర నష్టం వాటిళ్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే...

Sunday, April 1, 2018 - 11:44

సూర్యాపేట : హుజూర్ నగర్ మండలంలోని బురుగుగడ్డ గ్రామంలోని ఆది లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మంత్రి జగదీశ్వర్ రెడ్డి సందర్శించారు. స్వామి వారి తిరు కళ్యాణోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

Thursday, March 15, 2018 - 07:12

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు....

Wednesday, February 28, 2018 - 22:01

సూర్యాపేట : కాంగ్రెస్ బస్సు యాత్ర ఆలీబాబా 40 దొంగల్లా ఉందన్న మంత్రి కేటీఆర్.. ఆలీబాబా కాదు.. జానాబాబా 40 దొంగల్లా ఉందన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ప్రగతి సభలో పాల్గొన్న కేటీఆర్.. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు ఇవాళ శుభదినమన్నారు. ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టేందుకు మిషన్ భగీరథను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా 175 జనావాసాలకు మంచినీళ్లు ఇస్తున్నామన్నారు....

Thursday, February 22, 2018 - 08:08

సూర్యపేట : జిల్లా గంజాయి కలకలం రేగింది. గాయత్రి కాలేజీ హాస్టల్ లో అర్ధరాత్రి వంద కేజీల గంజాయి పట్టుబడింది. గంజాయిని విద్యార్థిసంఘాలు పోలీసులకు పట్చించాయి. విద్యాబోధన ముసుగులో యాజమాన్యం గంజాయి వ్యాపారం చేస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నింధితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Friday, January 26, 2018 - 20:58

హైదరాబాద్ : వాడవాడలా.... మువ్వెన్నల జెండా రెపరెపలాడింది. పిల్లలు, పెద్దలు.. గణతంత్ర దినోత్సవంలో భాగమై...దేశ భక్తిని చాటుకున్నారు. ప్రముఖులు జెండాను ఆవిష్కరించి.. రాజ్యాంగం గొప్పదనాన్ని.. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ కృషిని కొనియాడారు. తెలుగు రాష్ట్రాలలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్దలు, ప్రముఖులు ఈ సంబరాల్లో భాగమయ్యారు. తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోనూ... రిపబ్లిక్...

Sunday, January 14, 2018 - 20:56

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. మొదటిరోజు భోగి పండుగను ప్రజలు ఆనందోత్సాల నడుమ జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడాలేకుండా ఉదయమే భోగిమంటలు వేశారు. చిన్నాపెద్దా అందరూ భోగిమంటల చూట్టూచేరి సందడి చేశారు. నగరాల్లో ఉంటున్నవారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెలు పండుగశోభను సంతరించుకున్నాయి. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలు,...

Pages

Don't Miss