Monday, July 17, 2017 - 21:23

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభాంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీవర్షాలు దంచికొడుతుండగా .. ఒడిశాలో కురుస్తున్న భారీవర్షాలకు ఉత్తరాంధ్రలోని నదుల్లో వరద ఉధృతి...

Sunday, July 16, 2017 - 08:13

సూర్యపేట : బకాసురులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ రైతుల భూములు కనిపించినా ఆక్రమించేస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో గ్రామ కంఠం భూముల్ని సైతం వదిలిపెట్టలేదు. కొన్నేళ్లుగా రైతులు వ్యవసాయం చేసుకుంటున్న 117 ఎకరాల భూమిని జువారీ సిమెంట్ యాజమాన్యం కబ్జా చేసింది. అక్కడితో ఆగకుండా సమితి నిధులతో నిర్మించిన రోడ్డును కూడా ఆక్రమించేసారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. 
...

Saturday, July 15, 2017 - 18:55

సూర్యాపేట : జిల్లా మేళ్లచెర్వు మండలం రేవూరు గ్రామకంఠం భూమిని జువారీ సిమెంట్స్‌ ఫ్యాక్టరీ ఆక్రమించుకోవడంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ భూముల్లో కొన్ని సంవత్సరాలు రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే ప్రక్కనే ఉన్న జువారి సిమెంట్స్‌ యాజమాన్యం ఆ భూములను ఆక్రమించుకుంది. ఈ విషయంపై భూ నిర్వాసితుల రాష్ట్ర కన్వీనర్ వెంకట్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు...

Wednesday, July 12, 2017 - 13:57

సూర్యాపేట :  జిల్లా కోదాడలో మైనార్టీ విద్యార్థులకోసం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాల ఇది. ఇక్కడ అరకొర సౌకర్యాలతో నానా అవస్థలు పడుతున్న విద్యార్థులకు.. ఈ బిల్డింగ్‌ ఓనర్‌ పెడుతున్న టార్చర్‌ భరించరానిదిగా తరయారైంది. ప్రస్తుతానికి సొంతభవనం లేకపోవడంతో.. కోదాడ పట్టణంలోని ఓ సంక్షేమ హాస్టల్‌ వార్డెన్‌కు చెందిన ఈ బిల్డింగ్‌లో గురుకుల పాఠశాలను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. అయితే.. బిల్డింగ్‌...

Monday, July 10, 2017 - 19:33

సూర్యాపేట : జిల్లా మద్దిరాల మండలంలో అంగన్ వాడీ సెంటర్ పై పెచ్చులుడి బాలుడి పై పడ్డాయి. దీంతోమ బాలుడికి తీవ్ర గాయమైంది. దీంతో బాలుడి కాలువిరగడంతో బాలున్ని ఆసుపత్రికి తరలించారు. అంగన్ వాడీ సెంటర్ మోన్ననే నిర్మించింది కావడంతో నిర్మాణంలోమ నాణ్యత లేదని ప్రజలు అంటున్నారు. పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

Monday, July 10, 2017 - 12:28

సూర్యాపేట : మానవత్వం మంట గలిసిపోతోంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని మరోసారి రుజువైంది. డబ్బు ముందు అన్నదమ్ముల అనుబంధానికి విలువ లేకుండా పోయింది. అన్న మృతదేహం ముందే ఆస్తి కోసం కొట్టుకున్న ఘటన.. సూర్యాపేట జిల్లా, చింతలపాలెం మండలంలోని కొత్తగూడెంతండాలో జరిగింది. దహన సంస్కారాలు నిర్వహించాల్సినవాళ్లు నిస్సిగ్గుగా ప్రవర్తించారు. రెండు రోజులుగా శవాన్ని ఇంట్లోనే...

Friday, July 7, 2017 - 15:56

సూర్యాపేట : జిల్లాలోని నల్లచెరువులో రైతులు ఆందోళన బాటపట్టారు. సర్వేనెంబర్‌ 671 భూమిలో రైతుల ఆందోళన పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 1975సం.లో 97 ఎకరాల అసైన్డ్‌ భూమిని 45 మంది రైతులకు ఆనాటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. అయితే తాజాగా..అదే స్థలంలో కలెక్టరేట్‌ భవన నిర్మాణ స్థలంగా పేర్కొంటూ 2రోజుల క్రితం అధికారులు బోర్డులను పాతారు. అయితే రైతులు బోర్డులను తొలగించి వాటిని తగులబెట్టారు....

Friday, July 7, 2017 - 09:26

సూర్యాపేట : జిల్లాలోని మైనింగ్ ఏడీ సుధాకర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. తెల్లవారుజామున నుంచి సోదాలు కొనసాగుతోన్నాయి. ఏక కాలంలో ఎడు చోట్ల ఏడు టీంలతో ఏసీబీ తనిఖీలు కొనసాగిస్తోంది. అధికారలు సుధాకర్ రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో దాదాపు 2కోట్ల విలువైన అక్రమా ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ మధుసుధన్ రెడ్డి తెలిపారు. అందులో జనగామలో 37...

Monday, July 3, 2017 - 17:38

సూర్యపేట : జిల్లాలోని కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రీవెన్స్‌ డేలో కలెక్టర్‌ సురేంద్రమోహన్ ఎదుటనే కిరోసిన్ పోసుకొని మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కోర్టులో ఉన్న భూ వివాదంలో క్లర్క్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని...వాయిదాల పేరుతో ఇబ్బందులు పెడుతున్నాడని ఆవేదన చెందింది. డబ్బులు లేకపోతే రాత్రికి రూమ్ రా... అన్నాడని బోరున విలపించింది. గతంలో గ్రీవెన్స్‌ డేలో ఫిర్యాదు...

Sunday, July 2, 2017 - 10:28

సూర్యాపేట : జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలో ఓ యువతి ధర్నాకు దిగింది. ఎంపీపీ అక్ష్మి ఇంటి ముందు ఆమె ఆందోళన చేస్తోంది. ఎంపీపీ కొడుకు తనను మోసం చేశాడని ఆమె ఆరోపిస్తున్నారు. ఎంపీపీ కొడుకు సతీష్ తను ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట మారుస్తున్నాడని యువతి అంటుంది. యువతికి మహిళ సంఘాలు మద్దతు తెలిపాయి. ధర్నా చేస్తున్న యువతి వద్దకు వచ్చిన...

Thursday, June 29, 2017 - 08:40

సూర్యపేట : పట్టపగలు నడుస్తూ వెళ్తున్న ఆమెను వెనక నుంచి వచ్చిన దుండగులు వెంటాడారు...కత్తితో గొంతు కోశారు...కేకలేస్తూ కుప్పకూలిన ఆ యువతి అక్కడే చనిపోయింది..క్షణాల్లో ఆ దుండగులు మాయమయ్యారు...సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలకలం రేపిన ఘటనకు కారణం ఎవరో తెలుసా..? వాచ్‌ దిస్‌ స్టోరీ.. 
నడిరోడ్డుపై పట్టపగలు హత్య..
ఇది సూర్యాపేట జిల్లా కేంద్రం...సూర్యానగర్...

Pages

Don't Miss