Wednesday, May 3, 2017 - 14:38

సూర్యాపేట : జిల్లాలో విషాదం నెలకొంది. పెన్‌పహాడ్ మండలం సింగిరెడ్డిపాలెంలో మానస అనే టెన్త్‌ క్లాస్‌ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అవుతానన్న భయంతో ఆత్మహత్య చేసుకుంది. మానస మృతితో సింగిరెడ్డిపాలెంలో విషాదం నెలకొంది. 

Monday, May 1, 2017 - 09:00

సూర్యాపేట : ఐపీఎల్ మ్యాచ్ ఆనందంగా చూశారు... తిరుగు ప్రయాణంలో విషాదం నెలకొంది. మ్యాచ్ ను తిలికించి సంతోషంగా తిరిగివస్తుండగా మృత్యువు వారిని కబళించింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ప్రకాశం జిల్లాకు చెందిన కొంతమంది ఏపీ 27బీఎఫ్ 4653 కారులో ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ కు వచ్చారు. మ్యాచ్ చూసిన అనంతరం అదే కారులో తిరుగుప్రయాణం అయ్యారు. తెల్లవారుజామున విజయవాడ......

Friday, April 28, 2017 - 17:10

సూర్యపేట : కేసీఆర్ మూడేళ్లపాటు వ్యవసాయాన్ని పట్టించుకోలేదని కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సూర్యపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులను నిర్లక్ష్యం చేశారని తెలిపారు. ఇప్పుడు ఎన్నికల కోసం రైతు జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కేసీఆర్ పరామర్శించలేదన్నారు. టీఆర్ ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు....

Tuesday, April 25, 2017 - 16:16

సూర్యపేట : జిల్లాలోని హూజుర్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీలో మరోసారి వర్గ పోరు మొదలైయింది. వరంగల్ బహిరంగ సభ సన్నాహక కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది.శంకరమ్మ మండల స్థాయి నాయకులకు సమాచారం లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది. పరిశీలకునిగా వచ్చిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందే ఇరువర్గాలు గొడవకు దిగారు.దీంతో ఆయన ఇరువర్గాలను సముదాయించే ప్రయత్న చేశారు....

Saturday, April 15, 2017 - 09:24

సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నిర్లక్ష్యంగా నడపడం..మద్యం మత్తులో నడపడం..మితిమీరిన వేగాలతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన రెండు కుటుంబాలు రెండు ఆటోల్లో వెళుతున్నారు. రాజునాయక్‌...

Thursday, April 6, 2017 - 14:48

సూర్యాపేట : చింతలపాలెం మండలం నక్క గూడెం గ్రామంలో నిర్వహించిన ఎడ్ల పందాల్లో అపశృతి చోటుచేసుకుంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఎడ్లపందాల్లో ఒక్కసారిగా ఎద్దులు బెదరిపోయాయాయి. దీంతో ఉత్సవాల్లో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్కసారిగా కిందపడిపోయాడు. దీంతో ఉత్తమ్‌తో పాటు పలువురికి స్పల్ప గాయాలయ్యాయి.  

Wednesday, April 5, 2017 - 06:40

హైదరాబాద్ : లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న మఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఏమైంది..? నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఊదరగొట్టిన నేతలు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలిచ్చారు..? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయి..? ఈమూడేళ్లలో ప్రభుత్వం భర్తీ చేసిన కొలువులెన్ని..? ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఏమంటున్నారు? తెలంగాణలో కొలువుల భర్తీపై 10టీవీ ప్రత్యేక కథనం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీళ్లు,...

Tuesday, March 28, 2017 - 17:30

సూర్యాపేట : జిల్లా చింతలపాలెం మండలం బుగ్గమాధారం వద్ద ప్రమాదం జరిగింది. కృష్ణానదిలో బల్లకట్టుపైన ఉన్న సిమెంట్‌ లోడుతో ఉన్న లారీ ప్రమాదవశాత్తు నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ నీటిలో మునిగిపోగా..లారీ డ్రైవరు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. బల్లకట్టుపై ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

 

Friday, March 3, 2017 - 20:25

సూర్యాపేట : జిల్లాల్లో నిమ్మ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.. పెట్టిన పెట్టుబడిఅయినా తిరిగిరాక నిమ్మకాయల్ని చెట్టుపైనే వదిలేస్తున్నారు రైతన్నలు.. వందల కిలోమీటర్ల దూరంలోఉన్న మార్కెట్‌కు పంట తరలించలేక... ఆ ఖర్చులు భరించలేక కన్నీరు పెట్టుకుంటున్నారు. జిల్లాలో నిమ్మ రైతుల దీనావస్థపై టెన్ టివి స్పెషల్ రిపోర్ట్. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

Pages

Don't Miss