Saturday, September 2, 2017 - 17:48

సూర్యపేట : ఏపూరి సోమన్న పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. సోమన్నను పోలీసులు గొలుసులతో బంధించడాన్ని టీ-పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, టీడీపీ నేత రేవంత్‌రెడ్డితో పాటు పలువురు నేతలు దారుణమని అభిప్రాయపడుతున్నారు. ఆయన కుటుంబ వ్యవహారంలో ఎమ్మెల్యే వీరేశం భార్య పుష్ప కలుగజేసుకుని... సోమన్నను దూషించడం సరికాదన్నారు. ఇదంతా పోలీస్‌స్టేషన్‌లోనే జరగడం దారుణమన్నారు. ఇక ఈ...

Friday, August 25, 2017 - 07:05

సూర్యాపేట : జిల్లాలో వినూత్న రీతిలో గణేశ్‌ చతుర్థి పండుగను నిర్వహిస్తున్నారు. జనహిత పేరులో పదివేల మట్టి విగ్రహాలను తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. వీఐపీలు ఎవరూ రంగు విగ్రహాలను పూజించకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 
 

Monday, August 14, 2017 - 17:56

సూర్యాపేట : జిల్లా తిరుమలగిరి వాసవి క్లబ్‌ ఆధ్వర్యంలో 104 మీటర్ల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారీ జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నేటి తరం విద్యార్థుల్లో జాతీయ సమగ్రత మరియు జాతీయ జెండా యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

Saturday, August 5, 2017 - 19:36

సూర్యపేట : టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌ ఇంటి ముట్టడికి ప్రయత్నించి దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక అనవసరంగా ఉత్తమ్‌ నోరుపారేసుకుంటున్నాడంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి పనులను ఎవరు అడ్డుకున్నా ఉరుకోనేది లేదని...

Saturday, August 5, 2017 - 15:54

సూర్యాపేట : జిల్లాలోని మోతె మండలంలో విషాదం నెలకొంది. రాఘావాపురానికి చెందిన ఇద్దరు యువకులు విద్యుత్‌షాక్‌తో మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంటడంతో ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలవాల్సి ఉంది. 

 

Tuesday, July 18, 2017 - 21:44

హైదరాబాద్ : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. వరద ప్రవాహంతో అన్ని జిల్లాల్లో ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. 
జోరుగా..
జోరువానలతో హైదరాబాద్‌లో జనజీవనం అతలాకుతలమవుతోంది. నగరంలోని పలు చెరువుల్లోకి భారీగా...

Monday, July 17, 2017 - 21:23

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభాంతో ఏపీ తెలంగాణలో పలు చోట్ల భారీవర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో భారీవర్షాలు దంచికొడుతుండగా .. ఒడిశాలో కురుస్తున్న భారీవర్షాలకు ఉత్తరాంధ్రలోని నదుల్లో వరద ఉధృతి...

Sunday, July 16, 2017 - 08:13

సూర్యపేట : బకాసురులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ రైతుల భూములు కనిపించినా ఆక్రమించేస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో గ్రామ కంఠం భూముల్ని సైతం వదిలిపెట్టలేదు. కొన్నేళ్లుగా రైతులు వ్యవసాయం చేసుకుంటున్న 117 ఎకరాల భూమిని జువారీ సిమెంట్ యాజమాన్యం కబ్జా చేసింది. అక్కడితో ఆగకుండా సమితి నిధులతో నిర్మించిన రోడ్డును కూడా ఆక్రమించేసారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. 
...

Saturday, July 15, 2017 - 18:55

సూర్యాపేట : జిల్లా మేళ్లచెర్వు మండలం రేవూరు గ్రామకంఠం భూమిని జువారీ సిమెంట్స్‌ ఫ్యాక్టరీ ఆక్రమించుకోవడంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ భూముల్లో కొన్ని సంవత్సరాలు రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే ప్రక్కనే ఉన్న జువారి సిమెంట్స్‌ యాజమాన్యం ఆ భూములను ఆక్రమించుకుంది. ఈ విషయంపై భూ నిర్వాసితుల రాష్ట్ర కన్వీనర్ వెంకట్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు...

Wednesday, July 12, 2017 - 13:57

సూర్యాపేట :  జిల్లా కోదాడలో మైనార్టీ విద్యార్థులకోసం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాల ఇది. ఇక్కడ అరకొర సౌకర్యాలతో నానా అవస్థలు పడుతున్న విద్యార్థులకు.. ఈ బిల్డింగ్‌ ఓనర్‌ పెడుతున్న టార్చర్‌ భరించరానిదిగా తరయారైంది. ప్రస్తుతానికి సొంతభవనం లేకపోవడంతో.. కోదాడ పట్టణంలోని ఓ సంక్షేమ హాస్టల్‌ వార్డెన్‌కు చెందిన ఈ బిల్డింగ్‌లో గురుకుల పాఠశాలను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. అయితే.. బిల్డింగ్‌...

Pages

Don't Miss