Monday, February 27, 2017 - 13:35

సూర్యాపేట : సీపీఎం మహాజన పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ఆత్మకూరు ఎస్ మండలంలోని పలు గ్రామాలు..తండాల్లో పాదయాత్ర బృందం పర్యటిస్తోంది. వట్టికంపాడు, లక్ష్మణ్ నాయక్ తండా, నాచారం, ఆత్మకూరు ఎక్స్ రోడ్డు, దుబ్బగూడెం, నిమికల్, దబ్బకంద గ్రామాలతో పాటు పాతర్లపాడు ఎక్స్ రోడ్డు, గుండ్ల సింగారం, నూతనకల్ ప్రాంతాల్లో పాదయాత్ర జరుగుతోంది. పాదయాత్రకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. పాదయాత్ర...

Monday, February 27, 2017 - 09:33

హైదరాబాద్ : తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, ఈ కుటుంబ పాలనతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. యూనివర్సిటీలు, కళాశాలల్లో అధ్యాపకులు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, కేసీఆర్‌ పాలనలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిందని తమ్మినేని విమర్శించారు. బీసీ, మైనారిటీలకు సబ్‌ప్లాన్‌ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని ఆయన...

Sunday, February 26, 2017 - 21:21

సూర్యాపేట : మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని ప్రభుత్వం పనిచేయాలన్నారు జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పర్యటించారు. హుజుర్‌నగర్‌లో 6 నెలలుగా రెవెన్యూ డివిజన్‌ సాధన కోసం దీక్ష చేస్తున్న వారిచే దీక్షను విరమింపజేశారు. రెవెన్యూ డివిజన్‌ కోసం 6 నెలలుగా...

Saturday, February 25, 2017 - 10:28

సూర్యపేట : సామాజిక న్యాయం కోసం అందరూ కలవాల్సిన అవసరముందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం సామాజిక న్యాయం జరిగినప్పుడే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం అన్నారు. సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న సీపీఎం మహాజన పాదయాత్రకు కాంగ్రెస్‌, వైసీపీ, టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలతో సామాన్యులకు...

Thursday, February 23, 2017 - 10:53

సూర్యాపేట : కేసీఆర్‌ పాలనలో ప్రజలకు కనీస విద్యా, వైద్య సౌకర్యాలు కూడా అందడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సీఎం కేసీఆర్‌ ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని తమ్మినేని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చుతున్న కేసీఆర్‌ ఏం పట్టనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తమ్మినేని మండిపడ్డారు...

Wednesday, February 22, 2017 - 13:30

సూర్యాపేట : సీపీఎం నిర్వహిస్తున్న మహాజన పాదయాత్ర విజయంతమైందని టి.కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. మహాజన పాదయాత్ర 129వ రోజుకు చేరుకుంది. నాయకన్ గూడెం, మామిళ్ల గూడెం, హుస్సేనాబాద్, మోతె, నర్సింహుల గూడెం, రేపాల, జగన్నాథపురం, తలకోవలో లో పాదయాత్ర బృందం పర్యటించనుంది. నాయకన్ గూడెం చేరుకున్న అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి, పొన్నాల లక్ష్మయ్యలు సంఘీభావం...

Tuesday, January 10, 2017 - 16:15

సూర్యాపేట : వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో వర్షాభావ పరిస్థితులకు ఎదురొడ్డాడు ఓ రైతు. ఉన్న కొద్దిపాటి నీటిని సద్వినియోగం చేసుకుంటూ సిరులు కురిపిస్తున్నాడు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా.. బిందు సేద్యంతో అల్లం సాగు చేస్తూ లాభాల దిశగా పయనిస్తున్నాడు. ఓ కొత్త ఆలోచన ఆ రైతుకు సిరులు కురిపిస్తోంది. నీళ్లు లేవని అధైర్యపడకుండా.. పరిస్థితులకనుగుణంగా సాగు చేస్తున్నాడు....

Tuesday, January 3, 2017 - 19:02

సూర్యాపేట : జిల్లాలోని కోదాడలోని పోస్టాఫీస్‌ ఎదుట వృద్ధులు, దివ్యాంగులు ఆందోళనకు దిగారు. రెండు నెలలుగా తపాలా సిబ్బంది తమకు పింఛన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. పోస్టాఫీస్‌ సిబ్బంది తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. పెన్షన్‌ కోసం రెండు నెలలుగా తిరుగుతూనే ఉన్నామని వారు వాపోయారు. నగదు లేదంటూ తమను పోస్టాఫీస్‌ చుట్టూ తిప్పుతున్నారని చెప్పారు. వృద్ధులం, దివ్యాంగులమని కూడా చూడకుండా...

Monday, January 2, 2017 - 13:02

సూర్యాపేట : మునగాల (మం) ఆకుపాముల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ను కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. కోదాడ మండలం కోమరబండకు చెందిన ఉపేందర్, లక్ష్మణ్ లు మృతి చెందిన వారిలో ఉన్నారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్వీస్ రోడ్డును నిర్మించాలని కోరుతున్నా జీఎమ్మార్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ప్రజలు పేర్కొంటున్నట్లు...

Thursday, December 15, 2016 - 12:54

సూర్యాపేట : జిల్లాలోని ముకుందాపురంలో దారుణం జరిగింది. మద్యంమత్తులో తండ్రి వెంకన్న 5 నెలల బాలుడిని బండకేసి కొట్టాడు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తరువాత తన భార్యపై గొడ్డలితో దాడి చేయగా ఆమె తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం భర్త వెంకన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Monday, December 12, 2016 - 14:11

వర్ద...అంటే ఏమిటీ ? ఈ పేరు ఎందుకు పెట్టారు..ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. చెన్నైలో 'వార్దా' తుపాన్ బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తీవ్ర తుపాను చెన్నై తీరాన్ని దాటింది. దీనితో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు తుపాన్ లు ఏర్పడిన సమయంలో కొన్ని పేర్లు పెడుతుంటారు. రౌనా, హుద్ హుద్, లైలా, పైలిన్, లెెహెర్, హెలిన్, నీలం వంటి పేర్లు పెట్టారు. తాజాగా 'వర్ద'...

Pages

Don't Miss