Saturday, April 14, 2018 - 19:07

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా లెక్కకు మించి వెంచర్లను పూర్తి చేసుకుని ఎందరో కష్టమర్ల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న సంస్థ సుఖీభవ ప్రాపర్టీస్‌. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా హైదరాబాద్-వరంగల్‌లో కొత్త వెంచర్లతో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వనమాలి వెంచర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను సుఖీభవ ప్రాపర్టీస్‌ సంస్థ 'సీఎండీ ... రియల్ ఎస్టేట్‌...

Saturday, April 14, 2018 - 07:03

హైదరాబాద్ : అంటరానివాడని హేళన చేస్తే అక్షరాలపై పట్టును సాధించాడు. అస్పృశ్యుడని గేలి చేస్తే దేశమే గర్వించే కెరటమై ఎగిశాడు. అందుకే ప్రతి నిరుపేద దళితుడి తలరాత అంబేద్కర్‌. ప్రపంచ దేశాలు కీర్తిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌. గతాన్ని సమీక్షించుకుని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్‌ను బేరీజు వేసుకుంటూ సాగిపోయిన అంబేద్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు.ఎంతో విలువైనది...

Saturday, April 14, 2018 - 06:59

హైదరాబాద్ : పాశవికంగా దాడి చేసింది. ఎల్లలు దాటి సంపాదించిన ప్రతిభ కులం ముందు నిలువలేకపోయింది. నడుముకు తాటాకులు, మెడకు ముంతలు కట్టిన దుర్భర రోజులు దళితులను నిలువులా తెగనరికాయి. నిండైన ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే దళితజాతి మనువు ముందు విలవిలలాడిపోయింది. ఇందుకు అంబేద్కర్‌ ఓ సజీవ సాక్ష్యం.

ఎన్నో అవమానాలు, మరెన్నో అనుమానాలు అంబేద్కర్‌ను కలిచివేశాయి. నిచ్చెనమెట్ల కుల...

Saturday, April 14, 2018 - 06:56

హైదరాబాద్ : చరిత్రలో ఆయన స్ధానం అత్యంత విశిష్ఠమైనది. ఎన్ని ఏళ్లు గడిచినా తరగని స్ఫూర్తి నింపే గుండెధైర్యం ఆయనది. తాడిత, పీడిత వర్గాలకు ఆయనే వెలుగు రేఖ. తోటి మనిషిని సాటి మనిషే తాకనివ్వకుండా చేసిన కులవ్యవస్ధను చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు. మత్తులాంటి మతం నిజస్వరూపాన్ని యావత్‌ ప్రపంచానికి బట్టబయలు చేశాడు. వెలివాడల గుండెల్లో వెలుగురేఖలు నింపాడు. దళితుల తలరాతలు మార్చి వారి...

Sunday, April 8, 2018 - 16:20

వరంగల్‌ : జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో గురుకుల ప్రవేశ పరీక్ష కేంద్రంలో గందరగోళం చోటు చేసుకుంది. జిల్లాలో ఒకే పేరుతో రెండు రాయపర్తిలు ఉండటంతో హాల్ టికెట్ల ముద్రణలో తప్పుజరిగింది. పరకాల మండలం రాయపర్తిగ్రామ ప్రభుత్వ పాఠశాలకి బదులుగా వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి హై స్కూల్‌ అని ఉండటంతో 200 మంది విద్యార్థులు, వారి తల్లి దండ్రులు రాయపర్తి హై స్కూల్‌ ఉదయమే చేరుకున్నారు. కాగా...

Monday, April 2, 2018 - 18:50

వరంగల్ రూరల్ : దళితుల ఆగ్రహానికి ప్రధాని మోదీ గురికాక తప్పదని.. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలలో దళితులు సంఘాలు హెచ్చరించాయి. ఎస్సీ ఎస్టీ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని నేతలు మండిపడ్డారు. పరకాలలో జరిగిన ఆందోళనలో దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

 

Sunday, April 1, 2018 - 13:13

వరంగల్ : సీపీఎం అఖిల భారత మహాసభల విజయవంతం కోసం సీపీఎం చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతోంది. వివిధ జిల్లాలో జరుగుతున్న బస్సు యాత్ర ఆదివారం వరంగల్ రూరల్ జిల్లాల్లోకి ప్రవేశించింది. బస్సు యాత్రకు మంచి స్పందన వస్తోందని సీపీఎం నేతలు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం.....

Friday, March 30, 2018 - 12:54

వరంగల్‌ రూరల్‌ : వర్ధన్నపేటలో టీఆర్‌ఎస్‌ - కాంగ్రెస్‌ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నా రు. చెప్పులతో కొట్టుకున్నారు. వరంగల్‌ రూరల్‌లో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ ప్రకటించడంతో వర్ధన్నపేటలో టీఆర్‌ఎస్‌ నాయకులు పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. బాణాసంచా పేల్చారు. నాలుగేళ్ల పాలనలో...

Thursday, March 15, 2018 - 07:12

విజయవాడ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది... మార్చి 15 నుంచి 29వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. వీఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం జంబ్లింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలోని పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు....

Friday, March 9, 2018 - 09:11

ఖమ్మం : పారాణి ఆరకముందే వరుడు విగతజీవిగా మారగా...వధువు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోరమైన దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పచ్చటి పందిళ్ల మధ్య బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దుర్గతో వరంగల్ జిల్లా వర్దన్నపేటకు చెందిన రామకృష్ణతో వివాహం నిశ్చయమైంది. గురువారం రాత్రి తణుకులో వివాహం చేసుకున్న అనంతరం ఇన్నోవా వాహనంలో వధువు.....

Friday, March 9, 2018 - 08:14

ఖమ్మం : అప్పటి వరకు పెళ్లి ఇంట బంధువులతో ఆనందంగా గడిపారు. పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా గడిపారు. పెళ్లి వేడుకులను ముగించుకుని స్వగ్రామానికి బయలుదేరిన వారు వారి వారి ఇళ్లకు చేరుకోకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట వాసులు ఖమ్మంలోని బంధువుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఏడుగురు ఇన్నోవా వాహనంలో వెళ్లారు....

Pages

Don't Miss