Thursday, July 13, 2017 - 19:17

వరంగల్ : జిల్లాలోని హన్మకొండ కుమార్ పల్లి బుద్ధభవన్ వద్ద దారుణం జరిగింది. టీఆర్ఎస్ కార్పొరేటర్ మురళి దారుణ హత్య జరిగింది. మురళి హత్య అతను హత్యకు గురైయ్యాడు. ముగ్గురు దుండగులు మురళిని కత్తులతో నరికి చంపారు. దుండగులు మురళి తల, మొండం వేరు చేశారు. దుండుగులు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

Wednesday, July 12, 2017 - 13:03

వరంగల్ : కాకతీయ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్య ధోరణి... విద్యార్థుల పాలిట శాపంగా మారింది. కేయూ అధికారులు ఈ ఏడాది పరీక్షా ఫలితాలలో విద్యార్థులకు చుక్కలు చూపించారు. విద్యార్థుల ఫలితాలు తప్పులు తడకలుగా విడుదల చేశారు. దీంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీనిపై అధికారులను నిలదీశారు.. ఆందోళనలు చేశారు. గత నెల 12న యూనివర్సిటీ అధికారులు డిగ్రీ ఫలితాలను విడుదల చేశారు....

Monday, July 10, 2017 - 18:58

వరంగల్ : ఇది వరంగల్ ట్రై సిటీలోని కాజీపేట లో వున్న బాలుర పాఠశాల. ఈ పురతన భవనానికి సుమారు 60 యేళ్ల చరిత్ర వుంది. తెలంగాణరాష్ట్ర ఉద్యమ సిద్దాంత కర్త ప్రొఫెసర్‌ జయశంకర్ ఈ బడిలో పిల్లలకు పాఠాలు బోధించారు. అంతటి ఘనత కలిగిన ఈ విద్యాసౌధం ఇపుడు వెలవెలబోతోంది. వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఈ బడిలో ఇప్పుడు కేవాలం 67 మంది విద్యార్థులు మాత్రమే వున్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా...

Monday, July 10, 2017 - 14:36

వరంగల్ : జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. రిజిస్ట్రార్ ను తొలగించాలంటూ గత వారంఓ రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఈ రోజు ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యలను పరిష్కరించాలని, పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన వారి వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కాన్వకేషన్ నిర్వహించవద్దంటూ ఒకవేళ నిర్వహిస్తే అడ్డుకుంటామని విద్యార్థుఉల హెచ్చరించారు. వీసీ...

Sunday, July 9, 2017 - 19:52

వరంగల్ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా దేశంలోనే నెంబర్ వన్‌గా మారిందన్నారు డిప్యూటి సీఎం కడియం శ్రీహరి. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండలంలోని గుడేప్పాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్‌రూంల శంఖుస్థాపన కార్యక్రమములో పరకాల ఎమ్మెల్యేల చల్లా ధర్మారెడ్డి, మంత్రి కడియం శ్రీహరి మాట్లాడారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలకు 40...

Tuesday, July 4, 2017 - 06:42

హైదరాబాద్ : దొరతనాన్ని, రాజరికాన్ని ఎదిరించి.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఓ అమరత్వం తిరగబడే పిడికిలైంది. ఆధిపత్య వ్యవస్థను కూకటివేళ్లతో పెకలించిన ఆ విప్లవానికి ఓ మనిషి చేసిన త్యాగం ప్రశ్నించే గొంతుకైంది. భూమి కోసం భుక్తి కోసం ..పేద ప్రజల విముక్తి కోసం ఓ సామాన్యుడు సమరం సాగించాడు. అతను మరెవరో కాదు రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. ఇవాళ తెలంగాణ సాయుధ పోరాట...

Monday, July 3, 2017 - 08:35

వరంగల్ : మనిషి ప్రాణాలతో ఉందీ లేనిదీ.. మామూలు జనంకంటే.. మెడలో స్టెతస్‌స్కోపు వేసుకున్న వైద్యులు కచ్చితంగా చెప్పగలరు. కాని.. వరంగల్‌ డాక్టర్లు మాత్రం.. బతికుండగానే చనిపోయినట్టు తేల్చిపారేస్తున్నారు. కాజీపేటకు చెందిన స్వప్న 3 రోజుల క్రితం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. చిన్నారి తక్కువ బరువతో పుట్టడంతో తల్లిండ్రులు పాపను వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అక్కడ వైద్యులు...

Sunday, July 2, 2017 - 18:29

వరంగల్‌ : భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. ఉత్సవాల్లోభాగంగా ఎనిమిదోరోజు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.. అమ్మవారు ఉగ్రప్రభ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.. భద్రకాళి దర్శనానికి భక్తులు పోటెత్తారు.. అమ్మవారి నామస్మరణచేస్తూ దర్శనంకోసం ఆలయంలో బారులు తీరారు..

Friday, June 30, 2017 - 12:51

నమ్మకం అనేది మనిషి ఏర్పరచుకున్నది..వ్యక్తిగతంగా నమ్మకాలపై ఎవరి అభిప్రాయాలు వారివి ఉంటాయి. కానీ ఇందులో 'మూఢనమ్మకం' కూడా ఒకటి. శాస్త్రీయంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. ఈ నమ్మకాల చాటున ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటున్నాయనేది తెలిసిందే. తాజాగా ఓ చర్చీలో మేరీమాత విగ్రహం నుండి రక్తం కారుతోందని ప్రచారం జరిగింది. దీనితో చాలా మంది ఈ ఘటనపై ఆసక్తి కనబరిచారు. ఈ...

Monday, June 19, 2017 - 21:23

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. వానల కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణలో విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్‌ జిల్లాలోని... ఉట్నూరు ఏరియాలో భారీ వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితి...

Pages

Don't Miss