Thursday, November 2, 2017 - 17:21

వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రత్తి రైతు విలవిలలాడుతున్నాడు. పెట్టిన పెట్టుబడి రాక..గిట్టుబాటు ధర రాకపోవడంతో ప్రత్తి రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని..ప్రత్తిని కొనుగోలు చేస్తామని మంత్రులు స్వయంగా ప్రకటనలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ విధంగా జరగడం లేదని తెలుస్తోంది. తాజాగా ఓ ప్రత్తి రైతు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన వరంగల్...

Thursday, November 2, 2017 - 13:29

సూర్యపేట : ధనబలం, అధికారబలం చేతులు కలిపాయి. అక్రమాలకు అడ్డేలేకుండా చెలరేగిపోయాయి. వందల ఎకరాల వ్యవసాయ భూముల ఆక్రమణకు తెరతీశారు. పట్టాభూములు, అసైండ్‌ భూములు అనే తేడాలేకుండా కబ్జా చేశారు. వ్యవసాయ భూమూలతోపాటు చివరికి పంచాయతీరాజ్‌ రోడ్లను కూడా ఆక్రమించారు. తెలంగాణ ప్రభుత్వాధినేతతో  సాన్నిహిత్యం.. పైగా ఓ ఆధ్యాత్మిక గురువు ఆశీస్సులు.. ఇంకేం.. ప్రశ్నించేవారే లేరన్నట్టుగా వందల ఎకరాల...

Wednesday, November 1, 2017 - 16:20
Monday, October 30, 2017 - 08:09

వరంగల్ : మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డిపై కార్యకర్తలు తిరుగుబాటుకు దిగారు. ఆయన పార్టీకి రాజీనామా చేయడంపై వరంగల్ పశ్చిమ టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం పెల్లుబికింది. హన్మకొండలో ప్రత్యేకంగా సమావేశమైన కార్యకర్తలు నరేంద్రరెడ్డి వెంట వెళ్లేది లేదని తెగేసి చెప్పారు. 

టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి వేం నరేందర్‌రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామ లేఖను పార్టీ అధినేత...

Thursday, October 26, 2017 - 08:21

వరంగల్ : జిల్లాలోని నర్సంపేట మండలం జయముఖి కాలేజీలో స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ తీవ్ర సంచలనమైంది. జూనియర్లపై సీనియర్లు దాడికి పాల్పడ్డారు. బీటెక్ మెకానికల్ నాలుగో సంవత్సరం చదువుతున్న వారు మూడో సంవత్సరం విద్యార్థులపై దాడి చేశారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి మరీ ఈ ఘటనకు పూనుకోవడం గమనార్హం. ఇద్దరిని చితకబాది అక్కడి నుండి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆ ఆ ఇద్దరిని నర్సంపేట...

Sunday, October 22, 2017 - 19:31

వరంగల్ : కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో మొదటి రోజే 14 దేశ, విదేశీయ సంస్థలు రూ. 3వేల 900 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయన్నారు మంత్రి కేటీఆర్. తద్వారా 65 వేల మందికి మొదటి రోజే ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. టెక్స్‌టైల్ పార్క్‌ నిర్మాణం కోసం 12 వందల ఎకరాల భూములు కోల్పోయిన రైతన్నలకు కేటీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. భూమి కోల్పోయిన రైతు...

Sunday, October 22, 2017 - 19:29

వరంగల్ : అజంజాహీ మిల్లును తలదన్నేలా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అద్భుతంగా రూపుదిద్దుకోబోతోందన్నారు సీఎం కేసీఆర్. అంతర్జాతీయస్ధాయి రెడీమేడ్ దుస్తులు కూడా ఇక్కడ తయారవుతాయని కేసీఆర్ చెప్పారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు....

Sunday, October 22, 2017 - 17:25

వరంగల్ : త్వరలోనే వరంగల్ బంగారు వరంగల్ గా మారుతుందని..తరువాతే బంగారు తెలంగాణ మారుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. దేశ, విదేశీ సంస్థల భాగస్వామ్యంతో.. రూ.11వేల కోట్ల పెట్టుబడులతో.. మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పరిశ్రమ శంకుస్థాపన రోజే రూ. 3,900 కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. 27వేల మందికి ప్రత్యక్ష ఉపాధి.....

Sunday, October 22, 2017 - 16:32

జనగామ : జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులకు తెరలేపారు. మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. అయితే జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, అర్బన్‌ జిల్లాలో ఎక్కడికక్కడ సీపీఎం నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అఖిలపక్షం నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో సీపీఎం,...

Sunday, October 22, 2017 - 13:19

వరంగల్ : జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులతో వాతావరణ వేడెక్కింది. ఈ సాయంత్రం మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అయితే జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌, అర్బన్‌ జిల్లాలో ఎక్కడికక్కడ సీపీఎం, సీపీఐ, టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. సంగంలో మెగా టైక్స్‌టైల్‌ పార్క్‌ నిర్వాసితులు, రైతులు,...

Pages

Don't Miss