మే 29, 30 తేదీల్లో TSRJC కౌన్సెలింగ్

Submitted on 26 May 2019
 TSRJC CET Admission Counselling Certificates Verification On May 29, 30

తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలలో సీట్ల భర్తీకి ఈ నేల (మే 19, 2019)న నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంటన్స్ టెస్ట్ (TSRJC CET-2019) ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు MPCలో 31,527 మంది, BPC లో 28,638 మంది, MECలో 4,159 మంది అభ్యర్ధులు హాజనయ్యారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యప్తంగా 64,324 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. అభ్యర్ధులకు మార్కుల లిస్ట్ SMS ద్వారా పంపించారు.  

తెలంగాణ రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో MPC లో 1,300 ఖాళీలు, MECలో 60 ఖాళీలు, BPCలో 1,640 ఖాళీలు ఉన్నాయని TSRJC కార్యదర్శిని సత్యనారాయణ రెడ్డి తెలిపారు. అయితే ఈ సీట్ల భర్తీ కోసం మే 29, 30 తేదీల్లో అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

TSRJC CET
Certificates Verification
counselling
2019

మరిన్ని వార్తలు