షాకింగ్ వీడియో : అంతా చూస్తుండగానే బస్సు చక్రాల కింద నలిగిపోయారు

Submitted on 16 July 2019
two dead after falling under bus while riding triples on bike

చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రిపుల్ రైడింగ్ ప్రాణాలు తీసింది. ఓవర్ టేక్ చేయాలనే తొందరపాటు తిరిగిరాని లోకాలకు పంపింది. బైక్ లో ఓ వ్యక్తి ఇద్దరు మహిళలు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బైక్ కంట్రోల్ తప్పడంతో పక్కనే వేగంగా వస్తున్న సిటీ బస్సు కింద పడిపోయారు. బస్సు చక్రాలు వారి మీద నుంచి వెళ్లాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు స్పాట్ లోనే చనిపోయారు. బైక్ నడుపుతున్న వ్యక్తి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ యాక్సిడెంట్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. 

నగరంలోని నందనం ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. 20 ఏళ్ల శిశ బండి నడుపుతున్నాడు. అతడి వెనకాల భవాని, నాగలక్ష్మి ఉన్నారు. శివ హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. ఎగ్మోర్ లో ఓ ప్రైవేట్ కంపెనీలో భవాని, నాగలక్ష్మి ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. ఓవర్ టేక్ చేయాలనే తొందరే ప్రాణాలు తీసింది. బస్సుని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో శివ నడుపుతున్న బైక్ మరో బైక్ ని ఢీకొట్టింది. దీంతో కంట్రోల్ తప్పి బస్సు కింద పడ్డారు. ఈ ప్రమాదంలో మరో బైకర్ తృటిలో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడిన శివ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. శివ, ఆ ఇద్దరు మహిళలు వేలచెర్రిలో నివాసం ఉంటున్నారు. ముగ్గురూ ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. వీరు ముగ్గురూ ఏపీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బండి ఏపీ నెంబర్ మీద రిజిస్ట్రర్ అయి ఉంది.

ఈ యాక్సిడెంట్ రోడ్డు మీద వెళ్తున్న వారిని షాక్ కి గురి చేసింది. కళ్ల ముందే వారు బస్సు చక్రాల కింద నలిగిపోవడం తట్టుకోలేకపోయారు. అయ్యో పాపం అని కంటతడి పెట్టారు. ట్రిపుల్ రైడింగ్ నేరం. పైగా ఓవర్ స్పీడ్. దానికి తోడు ఓవర్ టేక్ చేయాలనే తొందర. ఈ కారణాలతో ఇద్దరి ప్రాణాలు పోయాయి. మరొకరు చావు బతుకులతో ఆసుపత్రిలో పోరాడుతున్నారు. ట్రిపుల్ రైడింగ్ ప్రమాదకరం అని పోలీసులు చెప్పారు. ఓవర్ స్పీడ్ గా వెళ్లడం, ఓవర్ టేక్ చేయాలని చూడటం మంచిది కాదన్నారు. రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్లాలని వాహనదారులకు సూచించారు. చిన్న పొరపాటు చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.

women dead
falling
under bus
Riding
triples
Bike
Chennai
over take
road accident

మరిన్ని వార్తలు