సెల్ఫీ దిగుతూ సాగర్ లో గల్లంతైన యువకుడు

Submitted on 13 August 2019
two men missing in nagarjuna sagar

నాగార్జున సాగర్‌లో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. సెల్ఫీ దిగుతూ ఒకరు సాగర్‌లో వరద ఉధృతికి మరొకరు కొట్టుకుపోయారు. జహీరాబాద్‌కు చెందిన నర్సింహ.. స్నేహితులతో కలిసి సాగర్‌కు వెళ్లాడు. నీటి ఉధృతిని పట్టించుకోకుండా శివాలయం ఘాట్‌ దగ్గర నీళ్లలోకి దిగి ప్రవాహానికి నిలబడలేక కొట్టుకుపోయాడు.

ప్రవాహానికి అటువైపు మరొకరు:

గుంటూరు జిల్లా గురజాలకు చెందిన నాగుల్‌ మీరా కూడా సాగర్‌ వరద నీటిలో గల్లంతయ్యాడు. క్రస్ట్‌ గేట్లకు సమీపంలోని పాత బ్రిడ్జిపై సెల్ఫీ దిగుతుండగా.. నాగుల్‌ మీరా కాలు జారి నదిలో పడిపోయాడు. నరసింహ గల్లంతైన శివాలయం ఘాట్‌కు సరిగ్గా ఎదురుగా ఉన్న అవతలి ఒడ్డున ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీ కోసం ప్రయత్నించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. గతంలో కూడా నదులు, వాగుల దగ్గర సెల్ఫీ దిగుతూ కొట్టుకుపోయిన సందర్భాలు కోకొల్లలు. వరదలకు ప్రాణాలు కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతుంటే ప్రయోగాలు చేస్తూ సెల్ఫీ దిగాలని యువత తప్పుదోవ పడుతుండటం శోచనీయం.

Also Read : బీజేపీలోకి 10మంది ఎమ్మెల్యేలు : ఒక్క సీటు గెలవకపోయినా రెండో అతిపెద్ద పార్టీగా గుర్తింపు 

two men
Missing
Nagarjuna Sagar
Selfi

మరిన్ని వార్తలు