2022లో గగన్ యాన్

Submitted on 13 June 2019
Union Min Jitendra Singh: On eve of 75th Independence anniversary of India in 2022, ISRO has resolved to send its first human Mission into space

75వ స్వాతంత్ర్యదినోత్సం సందర్భంగా 2022లో తొలి స్వదేశీ పరిజ్ణానంతో మానవసహిత మిషన్ గగన్ యాన్ ను స్వేస్ లోకి పంపేందుకు ఇస్రో రెడీ అవుతున్నట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు.2022కు ముందే గగన్ యాన్ స్పేస్ లోకి వెళ్లే అవకాశముందని ఆయన తెలిపారు. ప్లానింగ్,ప్రిపరేషన్ ను మానిటరింగ్ చేసేందుకు  గగన్ యాన్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ పేరుతో ప్రత్యేక సెల్ క్రియేట్ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఇద్దరి నుంచి ముగ్గురు వరకు గగన్ యాన్ లో రోదసిలోకి పంపుతున్నట్లు ఆయన తెలిపారు.గగన్ యాన్ లో వెళ్లే పైలెట్లకు 2ఏళ్లపాటు శిక్షణ ఉంటుందని తెలిపారు. 10వేల కోట్ల రూపాయల ఖర్చుతో మిషన్ గగన్ యాన్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టినట్లు ఆయన తెలిపారు. జులై-15,2019న చంద్రయాన్-2 లాంచ్ అవుతుందని,సెప్టెంబర్ లో అది చంద్రుడిపై ల్యాండ్ అవుతుందన్నారు. భారత్ సొంతంగా స్వేస్ స్టేషన్ కలిగి ఉండేందుకు తాము ఫ్లాన్ చేస్తున్నట్లు ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు.

JITENDRA SINGH
Union Minister
space
GAGANYAN
SPECIAL CELL
ISRO
HUMAN MISSION
75INDEPENDENCE ANNIVERSARY
2022
Launch

మరిన్ని వార్తలు