అగ్రవర్ణాల దాష్టీకం..వడ్డెర కుటుంబంపై దాడి...

09:22 - February 13, 2018

ప్రకాశం : అగ్రవర్ణాలు దారుణాలు పెచ్చరిల్లుపోతున్నాయి..ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు..ఆడవారిపై అతిదారుణంగా ప్రవర్తిస్తున్నారు..సభ్య సమాజం తలదించుకొనే ఘటనలు ఎన్నో చూస్తున్నా పాలకులు..అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అగ్రవర్ణాలు రెచ్చిపోతున్నారు. తాజాగా మహా శివ రాత్రి నేపథ్యంలో ఓ వడ్డెర కుటుంబంపై అగ్రవర్ణాలు దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది.

కందుకూరు మండలం రూరల్ పలుకూరులో ఓ వృద్ధురాలు..మగ దిక్కు లేకుండా ఇద్దరు కుమార్తెలతో..పిల్లలతో 20 గజాల స్థలంలో ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటోంది. వీరు ఇంటున్న నివాసం పక్కనే శివాలయం ఉంది. గుడి పక్కనే వడ్డెర కుటుంబం ఉండొద్దని..ఉంటే అరిష్టమని గ్రామ పూజారీ చెప్పినట్లు తెలుస్తోంది.

దీనితో అగ్రవర్ణాలు రెచ్చిపోయారు. ఇక్కడి నుండి ఖాళీ చేసి ఎక్కడైనా వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. వృద్ధురాలిపై ఇష్టమొచ్చినట్లుగా దాడికి పాల్పడ్డారు. అడ్డుగా వచ్చిన కూతుళ్లపై కామాంధుల్లా రెచ్చిపోయారు. వస్త్రాలును చింపేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఫలితం కనబడడం లేదని సమాచారం.

చివరకు సీపీఎం నేతలను బాధిత కుటుంబం ఆశ్రయించింది. జరిగిన ఘోరాన్ని తెలియచేసింది. స్పందించిన సీపీఎం నేతలు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని..వారి తరపున పోరాటం చేస్తామని సీపీఎం ప్రాంతీయ కార్యదర్శి గౌస్ టెన్ టివికి తెలిపారు. ఒకవేళ స్పందన లేకపోతే మహిళా సంఘాలతో కలిసి నిరహార దీక్షలకు సైతం దిగుతామని హెచ్చరించారు. మరి అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

Don't Miss