అక్రమంగా సబ్ మెరైన్ లో వేల కోట్ల డ్రగ్స్ తరలింపు..ఛేజింగ్ చేసి పట్టుకున్న కోస్ట్ గార్డ్స్

Submitted on 12 July 2019
US Coast Guards Leap Onto "Narco-Sub", Seize Cocaine Worth $232 Million

లోతైన పసిఫిక్ జలాల ద్వారా అక్రమంగా వేలాది పౌండ్ల కొకైన్‌ ని తరలిస్తున్న సబ్ మెరైన్ అమెరికా కోస్ట్ గార్డ్ అధికారులు పట్టుకున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా నార్కో-సబ్ మెరైన్స్ అని పిలువబడే సబ్ మెరైన్స్ ని అడవిలో తయారుచేసి కొన్ని వ్యాపారసంస్థలు వాటి ద్వారా కొకైన్ వంటి మత్తు పదార్థాలు అక్రమంగా సముద్రజలాల ద్వారా తరలిస్తున్న విషయాన్నితనీఖీ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా కనిపెట్టిన అమెరికా కోస్ట్ గార్డ్ అధికారులు ఆ సబ్ మెరైన్ ని సముద్రంలో పట్టుకున్నారు.

జూన్-18,2019న U.S. కోస్ట్ గార్డ్ కట్టర్ మున్రో... పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఈ సబ్ మెరైన్ ని గుర్తించారు. తెల్ల తిమింగళం మాదిరిగా సముద్రంలో కొలంబియన్,ఈక్వడోరన్ తీరానికి వందల మైళ్ళ దూరంలో ఉన్న నార్కో-సబ్ మెరైన్ ని తనిఖీ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా గుర్తించి ఓడ రెండు చిన్న పడవల్లో ఒక హెలికాప్టర్‌తో ఓవర్‌హెడ్ చూస్తూ ఆ సబ్ మెరైన్ ని కోస్ట్ గార్డ్ లు ఫాలో అయ్యారు. హాలీవుడ్ సినిమా రేంజ్ లో సుముద్రంలో వెళ్తున్న ఆ సబ్ మెరెన్  పై భాగంపైకి దూకి డోర్ తీసి అందులో ఉన్నవాళ్లను పట్టుకున్నారు. హాలీవుడ్ మూవీ ఫైట్ రేంజ్ లో ఉన్న దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ సబ్ మెరైన్ లో 15వేల కోట్ల రూపాయల విలువైన 17వేల పౌండ్ల కొకైన్ ఉన్నట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ ఫసిఫిక్ ఏరియా ప్రతినిధి లెఫ్టినెంట్ కమాండర్ స్టీఫెన్ బ్రిక్కీ తెలిపారు. గురువారం(జులై-11,2019)ఆయన ఈ విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు తెలియజేశారు.

us coast gaurd
cocaine
leap
seize
narco submarine
232 mllion
pacific ocean
chazing


మరిన్ని వార్తలు