వ‌చ్చాడ‌య్యో ప‌హిల్వాన్ లిరిక‌ల్ వీడియో సాంగ్

Submitted on 12 July 2019
Vachaadayyo Pahalwan Lyrical Video Song Released From Pahalwan Movie

కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్‌ ఎస్‌.కృష్ణ దర్శకత్వంలో పహిల్వాన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సుదీప్‌ పహిల్వాన్‌ గా కనిపించబోతున్నారు. సుదీప్ సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. కబీర్ దుహాన్ సింగ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరో హైలైట్ ఎంటంటే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఒక ముఖ్య పాత్రం పోషించడం.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి వచ్చాడ‌య్యో ప‌హిల్వాన్ అనే సాంగ్ విడుద‌ల చేశారు. ఈ సినిమా కోసం సుదీప్ కుస్తీ పోటీలు, బాక్సింగ్ నేర్చుకున్నాడు. స్టంట్స్‌ కోసం హాలీవుడ్‌ నుంచి లార్వెన్‌ సోహైల్‌ అనే వ్యక్తిని కూడా పిలిపించారు. ఈ మూవీలో సుదీప్ లుక్ ఫ్యాన్స్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. 

అంతేకాదు ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు.  సుదీప్ కిల్లింగ్ లుక్స్ లో రియ‌ల్ పైల్వాన్‌ లా ఉన్నాడ‌ని చిరు అన్నారు. అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ సినిమా తెలుగులో ప‌హిల్వాన్ అనే టైటిల్ తో విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం సుదీప్ సైరా చిత్రంతో పాటు దబాంగ్ 3 అనే చిత్రం చేస్తున్నారు. 

Vachaadayyo Pahalwan
Lyrical Video
released
Pahalwan Movie

మరిన్ని వార్తలు